Fuel: ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారా..? జరభద్రం మీ కారు/బైక్ ఇంజన్ ప్రమాదంలో ఉన్నట్లే..!

వాహనదారులకు అలెర్ట్.. మీరు మీ బైక్ లేదా కారుని ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారా.? అయితే ఈ వార్త మీకోసమే. ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫుల్ ట్యాంక్ చేస్తే ఇధన సామార్థ్యం దెబ్బతినడంతో పాటు ఎదురయ్యే సమస్యలు, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

చాలా మంది తమ కార్లలో లేదా బైక్స్ లో ఫుల్ ట్యాంక్ పట్టిస్తారు. ఆ తర్వాత మైలేజ్ రాలేదని గగ్గోలు పెడతారు. ఇది మనకు కూడా జరిగే ఉంటుంది. దానికి ఓ కారణం ఉంది. అయితే ఆయా కంపెనీలు చూపించే మాన్యువల్ కెపాసిటీ కంటే 15-20 శాతం వరకు తక్కువగా ఇంధన ట్యాంక్ లు వస్తున్నాయని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కనుగొంది.

పెట్రోల్

పెట్రోల్ ట్యాంక్ లో తేడాలు..
రిజర్వ్‌లో నడుస్తున్న మీ కారు, స్కూటర్ లేదా మోటార్‌సైకిల్‌ను పూర్తి టాప్ అప్(ఫుల్ ట్యాంక్) చేయడానికి వెంటనే పెట్రోల్/డీజిల్ స్టేషన్‌ని చేరుకుంటాం. OEM(మాన్ ఫాక్టర్ కంపెనీ) క్లెయిమ్ చేసిన ఇంధన ట్యాంక్ సామర్థ్యం కంటే మీ వాహనం ఎక్కువ పెట్రోల్/డీజిల్‌ను తీసుకోవడం చాలా మందికి ఎదురయ్యే ఉండవచ్చు. దీంతో ఇంధన పంపింగ్ లో అవకతవకలు ఉన్నాయని గొడవపడిన సందర్భాలు కూడా చాలా చూశాం.

అయితే కంపెనీ సూచించిన దానికంటే తక్కువ మొత్తంలో ఇంధన ట్యాంక్‌లు ఉంటున్నాయని దీనిపై ఆదేశాలు జారీచేయాలనీ లీగల్ మెట్రాలజీ విభాగానికి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ విన్నపించుకుంది. దీనిని పరిగణలోకి తీసుకున్న వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వినియోగదారులకు మార్చి 6న ఓ సర్క్యూలర్ జారీ చేసింది.

ఫుల్ ట్యాంక్

సర్క్యూలర్ లో వెల్లడించిన నిజాలు..
ఆ సర్క్యూలర్ లో ఇకపై ఫుల్ ట్యాంక్ చేయవద్దని వినియోగదారులను ఆదేశించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆ ప్రకటనలో వెల్లడించింది. ఫుల్ ట్యాంక్ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని అలా చేయడం ద్వారా మైలేజ్ తో పాటు చెడు ఉద్గారాలు విడుదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గనిర్దేశకాల ప్రకారం ఫుల్ ట్యాంక్ చేస్తే ఎదురయ్యే ప్రమాదాలను వివరించింది.

పెట్రోల్ బంకుల్లో ఉన్న భూగర్భ ట్యాంకులు సాధారణ వాతావరణంతో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయని.. పెట్రోల్ ఫిల్ చేసినప్పుడు ఉష్ణోగ్రత పెరిగి అది ఇంధన ట్యాంక్‌ మొత్తం విస్తరిస్తుందని వివరించింది. పెట్రోల్ పట్టించిన వెంటనే గ్యాసోలిన్ ఆవిరి కావడానికి కొంత ఖాళీ స్థలం అవసరమవుతుంది. ట్యాంక్‌లోని ఖాళీ స్థలం అస్థిర సేంద్రీయ సమ్మేళనాలను లీక్ చేయకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

ఫుల్ ట్యాంక్ నష్టాలు

ఆ వాయువు విడుదల కాకపోతే పూర్తిగా నష్టం..
ఒకవేళ మీరు ఫుల్ ట్యాంక్ చేసినట్లైతే అది గ్యాసోలిన్ విడుదల చేయకపోతే ఇంజన్ పూర్తిగా దెబ్బతింటుంది. అలానే హైడ్రోకార్బన్ ఉద్గారాలు పెరిగి పర్యావరణానికి హాని చేస్తుంది. ఫుల్ ట్యాంక్ చేసి సరైన విధంగా పార్క్ చేయకపోతే ఇంధనం లీకేజీ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కావున ఇకపై మీరు పూర్తి ట్యాంక్ ని నింపే ముందు ఓసారి ఆలోచించండి.

తాజాగా ఏప్రిల్1 నుంచి BS6 ఫేజ్ 2 నూతన RDE నిబంధనల్నీ కేంద్రం కచ్చితం చేసింది. అందుకు తగినట్లుగా వాహన కంపెనీలు మార్కెట్ లోకి కొత్త వాహనాలను తీసుకువస్తున్నాయి. ఇదివరకే షోరూమ్ లల్లో అందుబాటులో ఉన్న పాత వాహనాలపై భారీ డిస్కౌంట్ లను ప్రకటించాయి. ఈ ఆఫర్ మార్చి నెల వరకే ఉండటంతో ఊహించని స్థాయిలో కార్లు, బైక్స్ అమ్మకాలు జరిగాయని మార్కెట్ నిపుణులు వెల్లడించాయి. ఇక ఏప్రిల్ నుంచి 15-20శాతం వరకు ధరలు పెరగనున్నాయి.


More from DriveSpark

Article Published On: Tuesday, March 28, 2023, 10:37 [IST]
English summary
Govt advised vehicle owners not to fill fuel tank completely details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+