GPS Toll Plaza: ‌అందరికీ గుడ్‌న్యూస్‌.. జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థకు శ్రీకారం.. ప్రయాణించిన దూరానికే టోల్‌

వాహనదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ ప్లాజా(Toll Plaza)ల వద్ద వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులను తప్పించేందుకు ఇకపై టోల్‌ వసూల్‌ స్థానంలో కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. 2024 మార్చి నాటికి జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూల్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వచ్చే ఏడాది నుంచి టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి జాతీయ రహదారులపై(National Highways) టోల్‌ ప్లాజాల స్థానంలో జీపీఎస్‌ ఆధారిత(GPS Satellite Based Toll Fee) టోల్‌ కలెక్షన్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రోడ్లు, రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

GPS-Toll-Plaza

హైవేలపై జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూలు టెక్నాలజీ ద్వారా వాహనదారులకు ఊరట కలుగుతుందన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. దీని ద్వారా వాహదారుల నుంచి వారు ప్రయాణించిన దూరానికే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మార్చి కల్లా జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థలతో పాటు కొత్త టెక్నాలజీలను పరిచయం చేసేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థ ద్వారా టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ స్తంభనను తగ్గించవచ్చని కేంద్ర మంత్రి గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. అంతే కాకుండా హైవేలపై వాహనాదారులు ప్రయాణించే కచ్చితమైన దూరాలకే వారి నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వివరించారు.

GPS-Toll-Plaza

2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా GPS Satellite ఆధారిత టోల్ ఛార్జీల వసూలు సిస్టమ్‌ను ప్రారంభిస్తామని నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా వాహనదారులపై అధిక టోల్‌ ఫీజు భారం తగ్గడంతో పాటు పట్టణాలకు సమీపంలోని టోల్ గేట్ల వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు.

ఈ విధానంలో భాగంగా ఆటోమేటిక్‌గా టోల్‌ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌కు సంబంధించి రెండు పైలట్‌ ప్రాజెక్టులను చేపట్టామని గడ్కరీ తెలిపారు. కాగా 2018-19 లో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండే సగటు సమయం 8 నిమిషాలుగా ఉండేది. అయితే 2020-21, 2021-22 లో కేంద్రం ప్రవేశపెట్టిన ఫాస్టాగ్(FasTag) విధానం తర్వాత.. సగటు సమయం 47 సెకన్లకు తగ్గింది.

GPS-Toll-Plaza

ఫాస్టాగ్‌ విధానం తర్వాత వాహనదారులు టోల్‌ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గినా.. ట్రాఫిక్‌ ఇబ్బందులు పలు చోట్ల తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నగరాలకు సమీప ప్రాంతాల్లో, ఇంకా ఎక్కువ జనాభా కలిగిన పట్టణాల్లో టోల్‌ ప్లాజాల వద్ద వాహనాదారులు వేచి ఉండాల్సి వస్తోంది. పండుగలు, కీలక సమయాల్లోనూ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ సమస్యే లేకుండా చేసేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగానే వాహనాదారుల నుంచి వారు ప్రయాణించిన దూరానికే టోల్‌ ఛార్జీలు వసూలు చేసేలా, ఇంకా ట్రాఫిక్‌ సమస్యను తగ్గించేందుకు జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూలుతో పాటు కొన్ని టెక్నాలజీలను ప్రవేశపెట్టబోతోంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 21, 2023, 15:16 [IST]
English summary
Gps based toll collection system on national highways by 2024 march nitin gadkari says
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+