GPS జీపీఎస్‌ లొకేషన్‌తో నేరుగా సముద్రంలో దూసుకెళ్లిన కారు.. కాపాడిన టూరిస్టులు.. వైరల్ అవుతున్న వీడియో..!!

గతంలో ఏదైనా రహదారిలో వెళ్తున్నప్పుడు రూట్ తెలియని సందర్భాల్లో దగ్గర్లోని వ్యక్తినో లేక వెనకాల వస్తున్న వాహనాలను ఆపి అడ్రస్ తెలుసుకునేవాళ్లం. అయితే ప్రస్తుతం మనం ఎక్కడికైన తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే కచ్చితంగా గూగుల్ మ్యాప్స్ ని వినియోగిస్తున్నాం. పెరిగిన టెక్నాలజీ కారణంగా దీనిని కచ్చితంగా వాడాల్సి వస్తోంది. దీంతో ఎవరీ సహాయం అవసరం లేకుండా లక్ష్యాలను సులభంగా చేరుకుంటున్నాం..

కొన్ని సందర్భాల్లో గూగుల్ లో కొత్త అడ్రస్‌లు అప్‌డేట్‌లో లేకపోవడం కారణంగా చిక్కులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఇలా జరుగుతోంది. గూగుల్ లో చూపించిన పాత అడ్రస్‌కి చేరుకుని అక్కడ దానికి సంబంధించిన ఆఫీస్, సంస్థ లేదా సొంత అడ్రస్ గురించి ఆరా తీయడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలా అవుతోంది.

gps location

గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని రాంగ్ అడ్రస్‌కి చేరుకుని ప్రాణాలతో బయటపడిన వారి గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి జరిగిన వింత గాథ వింటే మీరు షాక్ అవుతారు. దానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దారి తెలియక కారు సముద్రంలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఉన్న పర్యాటకులు సముద్రంలో మునిగిపోతున్న కారులోంచి వారిని బయటకు తీసి తీశారు.

GPS సహాయంతో డ్రైవింగ్ చేస్తూండగా కారు నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది. GPS దిశను అనుసరిస్తూ, వారు రాంగ్ టర్న్ తీసుకొని సముద్రం వైపుగా వెళ్లారు. ఈ ఘటనకు కారణం వారు మద్యం మత్తులో ఉండటమే అని స్థానికులు చెబుతున్నారు. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారిని పక్కనే బోటులో ఉన్న వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించి బయటకు లాగారు. దీంతో కారులోని వారితో పాటు టూరిస్టులు ఊపిరి పీల్చుకున్నారు.

gps location

దీనికి సంబంధించిన వీడియో ప్రత్యక్ష సాక్షి షేర్ చేశాడు. వీడియోలో సముద్రంలో మునిగిపోతున్న కారుని అందులోని ఇద్దరు పర్యాటకులను గమనించవచ్చు. కారు నుంచి వారు బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగా కారు మునిగిపోవడం కారులోని వారిని భయభ్రాంతులకు గురిచేసింది.అదృష్టవశాత్తూ, వాహనం నీటిలో మునిగిపోకముందే ఇద్దరు పర్యాటకులను కారు కిటికీలోంచి బయటకు తీశారు.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను క్రిస్టీ హచిన్‌సన్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వర్షం నుంచి ఆశ్రయం పొందేందుకు అక్కడ బోటు వద్ద కూర్చుని సరదాగా వీడీయో తీస్తున్నట్లు ఆమె తెలిపింది. ఈలోపే మా బోట్‌ను ఆనుకుని హార్బర్‌లోకి చాలా మంచి వేగంతో కారు వచ్చిందని చెప్పింది. క్షణాల్లో కారు మునిగిపోవడం ఆశ్ఛర్యానికి గురిచేసిందని అన్నారు. ఈలోపు తేరుకుని వారిని రక్షించినట్లు పోస్ట్ లో రాసుకొచ్చింది.

drown into see

ఈ ఘటన అమెరికాలోని హువాయి కయిలా కోనాలోని హార్బర్ వద్ద జరిగింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు తమదైన స్టైళ్లలో కామెంట్ల వర్షం కురిపించారు. ఆమె ఏ మ్యాప్‌లను ఉపయోగిస్తోందో అని నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. ఆమె మైండ్ సెట్ సరిగ్గా లేకపోవచ్చని నిజంగా ఆమెకు వైద్య పరీక్షల అవసరమని మరికొందరు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకొతమంది ఈ స్త్రీ పట్ల తమ హృదయం ఉప్పొంగుతుందని ఇది మిగతా వారికి ఆదర్శమని హాస్యాస్పదంగా స్పందించారు.

సహాయం చేసిన దేవదూతలను ఆశీర్వదించండి అంటూ మరికొరు కామెంట్ చేశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రధాన కారణమని అయితే జీవితంలో ఇంత మతిమరుపు పనికిరాదని హితవు పలుకుతూ కామెంట్ చేశారు. మ్యాప్ లనే సరిగ్గా ఫాలోచేయలేనివారు జీవితంలో ఎలా పైకి వస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.

More from DriveSpark

Article Published On: Monday, May 8, 2023, 17:27 [IST]
English summary
Gps direction took tourist car into sea drown visuals gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+