వాహనదారులకు అలర్ట్.. ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్స్ బంద్! కారణం ఇదే..
GPS Toll Collection To Replace FASTag: టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గిందని కేంద్ర ప్రభుత్వం 2021లో వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) తప్పనిసరి అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాలు 'ఫాస్ట్‌ట్యాగ్'లను కలిగి ఉన్నాయి. ఇంతలోనే త్వరలో ఫాస్ట్‌ట్యాగ్స్ కనిపించవని ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఫాస్ట్‌ట్యాగ్స్ ఎందుకు కనిపించవు? ఆ స్థానాల్లో రానున్న కొత్త టెక్నాలజీ ఏంటనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో మీకోసం..
నివేదికల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గత కొన్ని నెలల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టం అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) వెల్లడించారు. అయితే ఈ జీపీఎస్ విధానం వచ్చే ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే వాహనాలకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్ట్‌ట్యాగ్‌లు అవసరం లేదని స్పష్టమవుతోంది.

2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి, దీంతో దేశం మొత్తం మీద ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది. అంతకంటే ముందే జీపీఎస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టం అమలు చేయడానికి కేంద్రం సిద్ధమైపోయింది. దీనికోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్‌ను కూడా నియమించిందని చెబుతున్నారు.
జీపీఎస్ బేస్డ్ టోల్ కలెక్షన్స్ ఎలా జరుగుతాయంటే..
జాతీయ రహదారిపై వాహనం ప్రయాణించేతప్పుడు వెహికల్ నెంబర్ ప్లేటుని రోడ్డుపై అమర్చబడి కెమెరాలు స్కాన్ చేస్తాయి. నెంబర్ ప్లేట్స్ అనేవి టోల్ వసూలు చేసే అకౌంట్లకు లింక్ అయ్యి ఉంటాయి, కాబట్టి టోల్ చార్జీలు ఆటోమాటిక్‌గా కట్ అయిపోతాయి. ఈ కొత్త విధానం వాహనదారుల సమయాన్ని మరింత ఆదా చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

టోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా ఫాస్ట్‌ట్యాగ్స్ పుట్టుకొచ్చింది, ఇప్పుడు జీపీఎస్ సిస్టం అమలులోకి రానుంది. జాతీయ రహదారులపైన ఈ కొత్త టెక్నాలజీ టెస్ట్ రన్ నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది.
గతంలో ఫాస్ట్‌ట్యాగ్స్ కూడా అమలులోకి రాని రోజుల్లో.. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి, ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. 2018-19 సమయంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారుడు కనీసం 8 నుంచి 10 నిముషాలు వేచి ఉండాల్సి వచ్చేది. ఆ తరువాత ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత టోల్ ప్లాజాల దగ్గర వేచి ఉండాల్సిన సమయం బాగా తగ్గింది. జీపీఎస్ సిస్టం అమలులోకి వస్తే.. టోల్ ప్లాజాల దగ్గర వేచి ఉండాల్సిన అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే టోల్ ప్లాజాల అవసరమే లేదని స్పష్టమవుతోంది.

ఫాస్ట్‌ట్యాగ్స్ ఈకేవైసీ
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'వన్ వెహికల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగా.. జనవరి 31 నాటికి ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అసంపూర్తిగా ఉంటే కేవైసీ పూర్తి చేసుకోవాలని, లేకుంటే అలాంటి ఫాస్ట్‌ట్యాగ్స్ డీయాక్టివేట్ అవుతాయని 2024 జనవరి 15న ప్రకటించింది. ఆ తరువాత గడువును ఫిబ్రవరి 29 వరకు పెంచింది.
ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అసంపూర్తిగా ఉన్న వినియోగదారులు కేవైసీ పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఏప్రిల్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కనిపించవని ప్రకటించడంతో కొంత సందేహంలో పడిపోయారు. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు కేంద్రం వెల్లడించాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.


Click it and Unblock the Notifications








