ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఎవరికైనా తమ నిత్యజీవితంలో డ్రైవింగ్ అనేది చాలా అవసరం. కావున పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. అయితే కొంతమందికి డ్రైవింగ్ పట్ల అభిరుచి ఉంటుంది, కావున ఇలాంటి వారు తొందరగా డ్రైవింగ్ నేర్చుకుంటారు. అయితే కొంతమందికి అవసరం కాబట్టి డ్రైవింగ్ నేర్చుకుంటారు. అయితే మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో ఏడు పదులు వయసు దాటిన మహిళ ఏకంగా 11 వాహనాలను అవలీలగా డ్రైవింగ్ చేస్తోంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

నివేదికల ప్రకారం, కేరళకు చెందిన జె.రాధామణి వివిధ రకాల వాహనాలను నడపడానికి చాలా ఆసక్తి కనపరుస్తుంది. ఈమె వయసు 71 సంవత్సరాలు. జె.రాధామణి కేరళలోని కొచ్చిలోని తొప్పుంపాడికి చెందినది. ఈమె ఒకటి రెండు కాదు 11 వాహనాలను సులభంగా డ్రైవ్ చేసి అందరిని అబ్బురపరుస్తోంది.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

జె.రాధామణి ఎక్స్‌కవేటర్లు, ఫోర్క్‌లిఫ్ట్‌లు, క్రేన్లు, రోడ్ రోలర్లు, ట్రాక్టర్లు, కంటైనర్ ట్రెయిలర్లు, బస్సులు, లారీలు మరియు మరికొన్ని రకాల వాహనాలను నడపడానికి లైసెన్స్ పొందింది. కావున ఈ వాహనాలను ఈమె ఈ అన్ని వాహనాలను కూడా అధికారికంగా డ్రైవ్ చేయగలదు.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

నిజానికి రాధామణి తన 30 ఏళ్ల వయసులో తొలిసారిగా కారు డ్రైవ్ చేయడం నేర్చుకుంది. డ్రైవింగ్ నేర్చుకోవడానికి తన భర్త ప్రేరణ చాలా వరకు ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ కారణంగానే ఈమె చాలా త్వరగా డ్రైవింగ్ నేర్చుకోగలిగింది. భారీ వాహనాలను సైతం డ్రైవింగ్ చేయడానికి ఈమె గతేడాది లైసెన్స్‌ పొందింది.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

అయితే ఈమె 1988లో బస్ మరియు లారీ రెండింటికీ మొదటిసారిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అంతే కాకుండా తొప్పుంపాడి నుంచి చేర్యాలకు తొలిసారిగా బస్సు నడిపిన ఘనత కూడా ఈమెకే దక్కింది. ఆ ప్రాంతంలో బస్సు నడపడం వల్ల అక్కడి రవాణా శాఖ అధికారులు ప్రశంసలు కూడా అందుకుంది.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

రాధామణి కేవలం తానూ డ్రైవింగ్ నేర్చుకోవడమే కాకూండా, ఎంతోమందికి డ్రైవింగ్ నేర్పిస్తుంది. ఇప్పటికే ఎంతోమందికి ఈమె డ్రైవింగ్ నేర్పిస్తుంది. 1970 వ సంవత్సరంలో ఈమె భర్త కొచ్చిలో A-Z డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాడు. అయితే 2001 వ సంవత్సరంలో రాధామణి తన భర్తను ప్రమాదంలో కోల్పోయింది.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

రాధామణి భర్త చనిపోయిన తరువాత కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తనవంతు అయ్యింది. ఈ కారణంగా ఈమె డ్రైవింగ్ స్కూల్‌ నడపాల్సివచ్చింది. రాధామణి తన డ్రైవింగ్ స్కూల్‌లో వివిధ రకాల వాహనాలను నడపడంలో శిక్షణ ఇస్తుంది. డ్రైవింగ్ స్కూల్ నడపడానికి, వారు బోధించే వాహనాలకు యాజమాన్యం లేదా బోధకుడు లైసెన్స్ కలిగి ఉండటం అవసరం. ఈ కారణంగానే ఈమె తన పేరు మీద 11 రకాల వాహనాల లైసెన్స్ తీసుకుంది.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

ప్రస్తుతం ఆమె తన డ్రైవింగ్ స్కూల్‌లో కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తోంది. తన ఇద్దరు కుమారులు, కోడలు, మనవడితో కలిసి డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాధామణి ఇప్పటికీ విద్యార్థి. డ్రైవింగ్ స్కూల్‌లో కంప్యూటర్ ఆపరేషన్‌తో పాటు, ఆమె కలమసేరి పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సును కూడా అభ్యసిస్తోంది. మొత్తమీద కేరళ లేదా భారతదేశంలో 11 రకాల వాహనాలకు లైసెన్స్ కలిగి ఉన్న ఏకైక మహిళా డ్రైవర్ ఈమె అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

రాధామణి భర్త ఆమె కోసం ఒక స్కూటర్ కొన్నాడు, అప్పటి నుండి ఆమె ఆ స్కూటర్‌పైనే ఎక్కడికైనా వెళ్తుంది. అత్యవసరమైనప్పుడు మాత్రమే ఆమె కారులో తిరుగుతుంది. రాధామణి 2020లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఇంకా టవర్ క్రేన్‌ను నడపలేదని చెప్పారు. టవర్ క్రేన్‌లు చాలా ఎత్తులో ఉన్నాయని, చీర కట్టుకుని అంత ఎత్తులో ఉన్న క్రేన్‌పై ఎక్కడం కుదరదని చెప్పుకొచ్చారు.

ఇది విన్నారా.. 70 ఏళ్ల వయసు దాటినా 11 వాహనాలు నడపడానికి లైసెన్స్ కలిగిన మహిళ

నిజంగా దేశంలో ఇలాంటి మహిళలు చాలా అరుదు అనే చెప్పాలి. రాధామణి ధైర్యం మరియు అభిరుచికి తన వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. నేర్చుకోవాలనే తపనకు తన వయసు ఏ మాత్రం అడ్డు కాలేదు. ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటె ఏదైనా సులభంగా నేర్చుకోవచ్చు. అలాంటి వారికి మన రాధామణి ప్రేరణ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 12, 2022, 13:52 [IST]
English summary
Grandmother in kerala holds 11 types of driving license details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+