బామ్మతో మనవడి లాంగ్ డ్రైవ్.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కళ్లలో నీళ్లు రావాల్సిందే.!!
ప్రేమ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఓ అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే అనుబంధం. కానీ తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు, బామ్మ, తాతయ్య, జంతువులు.. ఇలా వీరితో పెనవేసుకున్న బంధం కాకుండా పవిత్రమైన ప్రేమ లాంటిదే.. ఇందుకు నిదర్శనం(Grandma And Grandson Long Drive) ఇక్కడున్న ఓ యువకుడు, బామ్మ..
మూడు తరాలను చూస్తూ తమ జీవితంలో ఎన్నో అనుభవాలను మూటగట్టుకున్న వృద్ధులు ఈ తరానికి ఆదర్శం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది కొడుకులు, కూతుళ్లు.. తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేయం లేదా వారిపట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభించడం చేస్తుంటారు. ఈ తరం యువతకు వారి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలుసుకోరు.

కానీ ఈ యువకుడు(Grandma And Grandson Car Trip) అందుకు విరుద్ధం. తన అమ్మమ్మతో ఆ యువకుడికి ఎనలేని అనుబంధం ఉంది. తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆప్యాయతను ఆమెతో కలిగి ఉన్నాడు. అందుకే చివరి రోజుల్లో తన అమ్మమ్మను సంతోషపరిచేందుకు.. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆమె వద్దకు వచ్చి తన కారులో లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్తాడు. ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ప్రేమకు కొత్త నిర్వచనం అందించారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బామ్మ, యువకుడి లవ్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా యువకుడు ఉద్యోగరీత్యా ముంబయిలో ఉంటున్నట్లు సమాచారం. బెంగళూరులో ఉంటున్న తన బామ్మ వద్దకు ప్రతి 15 రోజులకొకసారి వచ్చి ఆమెను కలిసి కారులో బయటకు తీసుకువెళ్తుంటాడు. అంతేకాకుండా ప్రతి రోజూ తన అమ్మమ్మతో ఫోన్‌లో మాట్లాడుతుంటాడు.

వారి ప్రయాణంలో ఎన్నో ముచ్చట్లు దొర్లుతుంటాయట. తన అమ్మమ్మను లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్తుండగా.. అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారంతా బెంగళూరులో కలిసి ఉంటున్నప్పుడు ఆ పాత జ్ఞాపకాలను, తన చిన్ననాటి సంగతులను నెమరువేసుకుంటామని యువకుడు చెబుతున్నాడు. ట్రిప్‌కు వెళ్లిన ప్రతిసారి తన అమ్మమ్మ చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తుంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
చిన్నప్పటి నుంచి తన జీవితంలో అమ్మమ్మ సహకారం ఎంతో కీలకమని ఈ సందర్భంగా వీడియోలో యువకుడు పేర్కొన్నాడు. చదువుకునే రోజుల్లో హోంవర్క్, ఇంటి పని ఇలా చాలా రకాలుగా తనకు సాయం చేసేదని గుర్తు చేసుకున్నాడు. కానీ ఉద్యోగ రీత్యా.. తనతో సమయం గడపలేకపోయేవాడినని ఆవేదన వ్యక్తం చేసేవాడు.

అందుకే సమయం దొరికినప్పుడల్లా.. తనతో ఫోన్‌లో మాట్లాడుతుండేవాడినని యువకుడు చెబుతున్నాడు. 15 రోజులకు ఒకసారి బెంగళూరు వచ్చి అమ్మమ్మను కారులో బయటకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించాడు. ఈ ప్రయాణం ద్వారా వారి మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకొస్తున్నాడు. ఈ జర్నీ ద్వారా తమ ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నాడు.
అంతే కాకుండా ఈ లాంగ్ ట్రిప్‌లో వారు కొత్త కొత్త విషయాలను తెలుసుకోగలుగుతున్నారు. కాగా ఇటీవల ఓ బామ్మ కూడా తన భర్త పాత జావా బైక్‌ను రినోవేట్ చేసి తన మనవళ్లకు బహుమతిగా ఇచ్చిన వీడియో వైరల్‌గా మారింది. తుప్పుపట్టి కొట్టుకుపోయిన బైక్‌ను మళ్లీ షోరూం స్థితికి తీసుకొచ్చి మనవాళ్లకు బహుమతిగా ఇవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వర్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








