ఖరీదైన కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న వరుడు.. ఇంతకీ ఆ కారు ఏంటంటే.??

తాను కోరుకున్న కారు కాకుండా తక్కువ ధర కారు(Groom Demands For Hyundai Creta) కట్నంగా ఇచ్చినందుకు పెళ్లి రద్దు చేసుకున్నాడు ఓ పెళ్లి కొడుకు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పెళ్లి రద్దుతో వధువు కుటుంబీకులు ఆందోళనలో పడ్డారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

పెళ్లిలో కట్నకానుకలు ఇవ్వడమనేవి కామన్. కూతురిని అత్తగారింటికి పంపించేటప్పుడు బంగారు, నగదు, భూమి, కార్లు, బైక్‌లు ఇలా తమ స్థాయిలో వధువు కుటుంబీకులు కట్నంగా ఇవ్వడం సంప్రదాయంగా నడుస్తోంది. అయితే కొందరు ఎక్కువగా పెళ్లిలో వరుడికి కారు బహుమతిగా ఇవ్వడం చూస్తుంటాం. దానిని వారు ఆనందంగా స్వీకరిస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం వరుడు దీనికి విరుద్ధం.

Groom-Demands-For-Hyundai-Creta

ఉత్తర ప్రదేశ్‌లో ఓ వరుడు తాను పెళ్లి చేసుకోబోయే(Groom Cancelled Wedding) అమ్మాయి కుటుంబీకులను ఖరీదైన కారు కావాలని డిమాండ్ చేశాడు. అయితే ఆ కారు హ్యుందాయ్ క్రెటా. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ ఖరీదు ఎక్కువగా ఉండటంతో దానిని కొనుగోలు చేయలేక.. మారుతి వ్యాగన్ఆర్‌ను కొనుగోలు చేసి పెళ్లిలో వరుడికి బహుమతిగా అందించారు.

అయితే తాను కోరుకున్న హ్యుందాయ్ క్రెటా కాకుండా మారుతి వ్యాగన్ ఆర్ బహుమతిగా ఇవ్వడంతో.. వరుడు అసంతృప్తి చెందాడు. దీంతో కోపంతో వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. అమీర్ ఆలం అనే పెళ్లి కొడుకు తన డిమాండ్లు నెరవేరలేదని.. వధువు ఇంటికి వెళ్లకుండా పెళ్లి రద్దు చేసుకోవడమే కాకుండా పెళ్లి ఊరేగింపును కూడా నిలిపివేశాడు.

Groom-Demands-For-Hyundai-Creta

అయితే ఈ విషయం తెలియని వధువు కుటుంబీకులు వివాహ వేడుక వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో తెలియడంతో షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్ష్యం అవడంతో తెగ వైరల్ అవుతోంది. జరిగిన సంఘటనపై వధువు తీవ్ర ఆందోళనకు గురైంది.

ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేసింది. సంఘటనకు సంబంధించి వధువు వివరించడాన్ని వీడియోలో చూడవచ్చు. కన్నీళ్లు పెట్టుకుంటున్న యువతి.. పెళ్లి రద్దు కావడంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది. అంతేకాకుండా వరుడికి సందేశాన్ని కూడా పంపింది. ఎటువంటి కారణం లేకుండా వరుడు పెళ్లి రద్దు చేసుకున్నాడని వధువు ఆవేదన వ్యక్తం చేసింది.

Groom-Demands-For-Hyundai-Creta

ఈ ఘటనతో యువకుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. కాగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. వరుడిపై గ్రామస్థులు కేసు పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే వరుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి.

అయితే ఇలా పెళ్లి రద్దు కావడమే కాకుండా.. పెళ్లిలో సంతోషకరమైన సంఘటనలు కూడా జరిగాయి. ఇటీవల కేరళలో ఓ వధువు తన భర్తకు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ను బహుమతిగా ఇచ్చింది. సడెన్ సర్‌ప్రైజ్ చూసి అవాక్కయిన వరుడు.. ఆనందంలో మునిగిపోయాడు. బహుమతి స్వీకరించిన అనంతరం వధువుని రైడ్‌కు తీసుకెళ్లాడు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 8, 2024, 16:32 [IST]
English summary
Groom demands for hyundai creta as dowry he cancelled wedding viral video is here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+