పెళ్లి కొడుకు వినూత్న ఆలోచన.. ఫిదా అవుతున్న నెటిజన్లు - ఏం చేసాడో తెలుసా?
పెళ్లి కొడుకు గుర్రం మీద, పెళ్లి కూతురైతే.. పల్లకిలో వస్తారని అందరికి తెలుసు. అయితే కాలం మారింది, నేటి యువత ఏం చేసిన అందులో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇటీవల ఓ పెళ్లి కొడుకు చేసిన పని నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ పెళ్లి కొడుకు భిన్నంగా అలోచించి.. ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మండపానికి బయలుదేరాడు. బాగా అలంకరించుకుని భాజాభజంత్రీలతో ప్రయాణమైనప్పుడు.. వారి బంధువులు కూడా చాలా ఉత్సాహంగా చిందులు వేశారు. ఈ ఘటన బెంగళూరులో ఎక్కడ జరిగిందనే విషయం వెల్లడి కాలేదు, కానీ నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది.

వీడియోలో కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఏథర్ రిజ్టా' (Ather Rizta) అని తెలుస్తోంది. దీనిని బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఏథర్ ఎనర్జీ లాంచ్ చేసింది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ఈ స్కూటర్ ఇప్పుడు ఏకంగా ఓ పెళ్ళికొడుకుని ఆకర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ ఫౌండర్స్ తరుణ్ మెహతా మరియు స్వప్నిల్ జైన్ తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.
వీడియో షేర్ చేస్తూ.. ఇది గత వారంలో జరిగింది, పెళ్లికొడుకు పెళ్లి బారాత్ ఎంట్రీని రిజ్టాలో చేయాలనుకున్నాడు. అతని గ్రాండ్ ఎంట్రీ అద్భుతంగా ఉంది. రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యామిలీకి సంబంధించినదని తరుణ్ మెహతా ట్వీట్ చేశారు. ఇది కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు.

అదే వీడియోను ఏథర్ ఎనర్జీ కో-ఫౌండర్ స్వప్నిల్ జైన్ షేర్ చేస్తూ.. కుటుంబాలకు ప్రేమను అందించడానికి ఏథర్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పెకొన్నారు. ఏథర్ రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ పెళ్లి కొడుకు కోసం అందంగా పువ్వులతో అలంకరించబడి ఉండటం చూడవచ్చు. దరువు వాయిస్తుంటే.. పెళ్లి కొడుకుతో పాటు బంధువులు కూడా చిందులేయడం వీడియోలో చూడవచ్చు. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద పెళ్లి కొడుకు రావడం బహుశా ఇదే మొదటిసారి.
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి
ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ.1.09 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఎస్ మరియు జెడ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎస్ వేరియంట్ ఒక ఫుల్ చార్జితో 123 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. ఈ స్కూటర్ ధర రూ.1.09 లక్షలు. ఇది మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇక ఏథర్ రిజ్టా జెడ్ వేరియంట్ విషయానికి వస్తే.. ఇది రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. పెద్ద బ్యాటరీ కలిగిన స్కూటర్ 160 కిమీ రేంజ్, చిన్న బ్యాటరీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ 123 కిమీ రేంజ్ అందిస్తుంది. సుమారు ఏడు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ ధరలు రూ.1.25 లక్షల నుంచి రూ.1.46 లక్షల మధ్య ఉంటుంది. ఇది 34-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








