సెకండ్‌ హ్యాండ్‌ కమర్షియల్‌ వాహనాలను ప్రైవేటు వాహనాలుగా రిజిస్ట్రేషన్‌ చేయడం ఎలా?

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ప్రపంచంలోని పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంది. కొత్త కార్లు సహా ఇతర వాహనాలు కొనుగోలు చేసినట్లుయితే రిజిస్ట్రేషన్‌ సహా ఇతర పనులు త్వరగా పూర్తవుతాయి. అయితే సెకండ్‌ హ్యాండ్ కార్ల రిజిస్ట్రేషన్‌ మార్పులు సహా ఇతర అంశాలు కొంచెం కష్టంతో కూడుకున్నాయి. ఎందుకంటే సెకండ్‌ హ్యాండ్ కార్లకు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనుగోలు చేస్తున్నప్పుడు అనేక కీలక అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనుగోలు చేసి టాక్సీ, డెలివరీలు వంటి వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు కమర్షియల్‌ వాహనాలను కొనుగోలు చేసిన వ్యక్తిగత వాహనాలుగా మారుస్తుంటారు. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్‌ కొంచెం కష్టంగా ఉంటుంది.

How to register commercial second hand car as private car news

వాణిజ్య ట్యాగ్‌ను తీసివేయాలి: కమర్షియల్‌ కారును ప్రైవేటు వాహనంగా మార్చేందుకు ముందుగా వాణిజ్య ట్యాగ్‌ను తీసివేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సమీపంలోని ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. కమర్షియల్‌ కారును వ్యక్తిగత వాహనంగా ఎందుకు మారుస్తున్నారో ఆ దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. దీంతోపాటు అసలు వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, బీమా, చిరునామా పత్రాలను దరఖాస్తుతో జతచేయాలి.

నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్ పొందాలి : కమర్షియల్‌ కారును బ్యాంక్‌లోన్‌ పైన కొనుగోలు చేసినట్లయితే బ్యాంకు నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్ పొందాలి. వాణిజ్య వాహనం రద్దు చేసుకున్న తర్వాత ఆ కారును ప్రైవేట్‌ వాహనంగా మార్చేందుకు మరోసారి దరఖాస్తు చేసుకోవాలి.

second hand car as private car

అనంతరం రీ రిజిస్ట్రేషన్‌ కోసం రోడ్డు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గుర్తింపు కార్డు, చిరునామా, పాన్‌కార్డు, ఆర్టీవో కార్యాలయం నుంచి పాత రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు ధృవీకరించే ధ్రువీకరణ పత్రం మరియు ఫాం-20 ను ఆర్టీవో కార్యాలయంలో సమర్పించాలి.

కమర్షియల్ వాహనాన్ని ప్రైవేటు వాహనంగా మార్చేందుకు అనేక ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉంటుంది. బ్యాంక్‌, ఆర్టీవో నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలు అన్ని పూర్తయిన తర్వాత ఆర్టీవో కార్యాలయంలో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు తనిఖీ చేసిన అధికారులు కొత్త రిజిస్ట్రేషన్‌ను జారీచేస్తారు.

సెకండ్‌ హ్యండ్‌ బైక్‌ల రిజిస్ట్రేషన్‌..
సెకండ్‌ హ్యండ్‌ బైక్‌లను ఆన్‌లైన్‌ ద్వారానే సులభంగా రీరిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకోవచ్చు.. ఇందుకోసం ఒరిజినల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, పొల్యూషన్‌ కంట్రోల్ సర్టిఫికేట్‌, ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్‌, ఫారం-29, ఫారం-30 వంటి పత్రాలుండాలి. ఆయా పత్రాల్లో అవసరమైన వివరాలను సక్రమంగా పూర్తిచేయాలి. అనంతరం ఆ పత్రాలపై విక్రేత, కొనుగోలు దారుడు ఇద్దరూ సంతకాలు చేయాలి.

వాహన్‌సేవా పోర్టల్‌ సందర్శించి అందులో వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌, ఛాసిస్‌ నంబర్‌ నమోదుచేయాలి. అనంతరం ట్రాన్స్‌ఫర్ ఆఫ్‌ ఓనర్‌షిప్‌ ఆప్షన్‌పైన క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత అవసరమైన పత్రాల స్కాన్‌ కాపీలను అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం డెబిట్‌, క్రెడిట్‌, నెట్‌ బ్యాంకింగ్‌తో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. వచ్చిన దరఖాస్తును నింపిన తర్వాత్ Submit బటన్‌పైన క్లిక్‌ చేయాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత అధికారులు కొత్త రిజిస్ట్రేషన్‌ను జారీ చేస్తారు.

More from DriveSpark

Article Published On: Monday, November 20, 2023, 10:05 [IST]
English summary
Guidelines to register commercial second hand cars as private cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+