గిన్నిస్‌లో టాప్ స్పీడ్ రికార్డు కోల్పోయిన బుగాటి వేరాన్

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారు ఏదంటే, టక్కున గుర్తుకు వచ్చేది 'బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్' (Bugatti Veyron Super Sport). అయితే, ఇకపై ఆ పేరు గుర్తుకు రాదు. ఇప్పటి వరకూ ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారుగా గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం దక్కించుకున్న ఈ సూపర్ కారును గిన్నిస్ బుక్ రికార్డులను తొలగించివేస్తున్నట్లు సదరు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ఇందుకు కారణం ఏంటో తెలుసా..? బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ కారు రికార్డును వేరే ఏదైనా కొత్త సూపర్ కారు బ్రేక్ చేసి ఉంటంది అనుకుంటున్నారా..! అయితే మీరు క్లచ్‌పై కాలేసినట్లే. అసలు విషయం ఏంటంటే, ఈ సూపర్ కారు గరిష్టం వేగం గంటకు 431.072 కిలోమీటర్లు (గిన్నిస్ బుక్‌ రికార్డ్ స్పీడ్). కానీ, ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ బుగాటి విక్రయించిన ప్రొడక్షన్ వెర్షన్ వేరాన్ సూపర్ స్పోర్ట్ కారు ఇంత వేగాన్ని ఎప్పుడూ అందుకోలేదు.

ఇదే విషయాన్ని 'వెనామా్ జిటి' సూపర్ కారు సృష్టికర్త జాన్ హెన్నెస్సీ, గిన్నిస్ అధికారులను ప్రశ్నించాడు. ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కార్స్‌గా బుగాటి విక్రయించిన 30 వేరాన్ సూపర్ స్పోర్ట్ కార్లలో వేగపరిమితి (స్పీడ్ లిమిట్)ను గంటకు గరిష్టంగా 415 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే ఇది అధికారికంగా రికార్డ్ చేసిన గరిష్టం వేగం గంటకు 431 కిలోమీటర్లను అందుకోలేదు. ఈ నేపథ్యంలో, బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్ కారును తమ అఫీషియల్ రికార్డును తొలగించి వేస్తున్నామని గిన్నిస్ పేర్కొంది. బుగాటి 2010లో ఈ రికార్డును సృష్టించింది.

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

బుగాటి వేరాన్ సూపర్ స్పోర్ట్

హెన్నెస్సీ వెనామ్ జిటి

హెన్నెస్సీ వెనామ్ జిటి

హెన్నెస్సీ వెనామ్ జిటి

హెన్నెస్సీ వెనామ్ జిటి

హెన్నెస్సీ వెనామ్ జిటి

హెన్నెస్సీ వెనామ్ జిటి

ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో

ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో

ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో

ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో

ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో

ఎస్ఎస్‌సి అల్టిమేట్ ఏరో

More from DriveSpark

Article Published On: Tuesday, April 9, 2013, 11:39 [IST]
English summary
Hennessey Venom GT recently, reportedly broke the Bugatti Veyron Super Sport's production car top speed record of 267.8 mph. However, this was not recognized by Guinness World Records because the Venom GT did a single run instead of the required two runs, the average of which is taken. If no other car beat the Bugatti Veyron SS then why did it lose its title?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+