ఈ కారుకు 62 ఏళ్లుగా ఒకే యజమాని; గిన్నిస్‌లో స్థానం

By Ravi

సాధారణంగా మనం కొత్త కారును కొంటే ఎన్ని సంవత్సరాలు ఉపయోగిస్తాం.. మహా అయితే 10 లేదా 20 ఏళ్లు ఉపయోగిస్తామేమో..! అయితే, ఒకే కారును దాదాపుగా 62 ఏళ్లపాటు ఒకే వ్యక్తి ఉపయోగించటం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? అవును మీరు సరిగ్గానే చదివారు. అమెరికాకు చెందిన ఓ వృద్ధ దంపతులు ఇప్పటికీ 62 ఏళ్ల క్రితం తాము కొనుగోలు చేసిన కారునే ఉపయోగిస్తున్నారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్నది జేమ్స్ సి. రీస్, ఆయన సతీమణి మరియు వారి పురాతన కారు. అమెరికాలోని పెనుస్లేవియాలో ఉన్న కాలేజ్‌విల్లాకు చెందిన జేమ్స్ సి. రీస్ ఈ గ్రే అండ్ వైట్ కలర్ చెవర్లే కూపే కారును జూన్ 15, 1951లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈయన మరియు ఈయన కారు ప్రపంచంలో కెల్లా వాహనం యొక్క సుధీర్ఘపు యాజమాన్యం కలిగి ఉన్నదిగా (లాంగెస్ట్ ఓనర్‌షిప్ ఆఫ్ వెహికల్) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాధించుకుంది.

గిన్నిస్ బుక్ రికార్డులలో స్థానం సంపాధించుకునే సమయం నాటికి (ఫిబ్రవరి 8, 2013 నాటికి) ఈ కారు వయస్సు 61 సంవత్సరాల, 7 నెలల, 24 రోజులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ ఈ కారు చక్కగా నడుస్తుంది. తమ 50 వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ హనీమూన్ కారుతో ఫోటోలకు ఫోజిలిస్తున్న ఈ వృద్ధ దంపతుల్ని చూడండి..! భలే బాగుంది కదూ ఈ గిన్నిస్ రికార్డ్ కార్..!

The Longest Ownership Of A Vehicle

Source: Guinness World Records

More from DriveSpark

Article Published On: Monday, March 18, 2013, 19:38 [IST]
English summary
The longest ownership of a vehicle from new is 61 years, 7 months and 24 days by James C. Rees. Sr. of Collegeville, Pennsylvania, USA! James bought a grey and white Chevrolet Coupe on 15 June 1951 and still drives it as of 8 February 2013 - pictured are James and his wife on their 50th wedding anniversary, in front of the car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+