కారుకి అంత్యక్రియలు.. వేలాది మంది సమక్షంలో ఖననం.. వీడ్కోలు కోసం ఏకంగా రూ. 4 లక్షలు ఖర్చు చేసిన యజమాని
కొన్నేళ్లుగా తమ మధ్య ఉంటూ, ఎక్కడికంటే అక్కడికి వెళ్లడానికి సహాయపడిన కారుకు అంత్యక్రియలు చేసిన ఘటన ఇటీవల తాజాగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని ఆమ్రేజీ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సంజయ్ పోలారా వద్ద 12 ఏళ్లుగా ఒక మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్(Maruti Suzuki Wagon R) కారు ఉంది. ఈ కారులోనే అతను, కుటుంబం అన్ని ప్రాంతాలకు వెళ్లేవారు. తన వ్యాపార నిర్వహణలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. అలాగే, ఇతర అవసరాలకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడింది. అయితే ఇన్నాళ్లు వారి వృద్ధికి, అవసరాలకు ఉపయోగపడిన కారుకు ఇకపై విశ్రాంతి ఇద్దామని నిర్ణయించుకున్నారు. సాధాసీదాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా మనుషులకు ఏ విధంగా అయితే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారో అదే విధంగా తన కుటుంబంతో కలిసి కారుకు ఘనంగా వీడ్కోలు పలికారు
తన కారును వ్యాపారవేత్త సంజయ్ పోలారా మొదటగా బంతి, గులాబి పూలతో అందంగా అలంకరించారు. ఆ తర్వాత తన ఇంటి నుంచి ఊరేగింపు నిర్వహించి వ్యవసాయ క్షేత్రానికి తీసుకొచ్చారు. కారు వెంట యజమాని, మొత్తం కుటుంబ సభ్యులు, 1500 మందికి పైగా అతిథులు వచ్చారు. ఆచార పద్ధతి ప్రకారం, సాంప్రదాయ పూజ, ఆశీర్వాదాలను నిర్వహించిన తరువాత అప్పటికే సిద్ధం చేసిన 15 అడుగుల లోతైన గుంతలోకి కారును ఖననం చేశారు.

గుజరాత్‌లోని సురత్‌కు చెందిన సంజయ్ పోలారా నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారాలను నిర్వహిస్తున్నాడు. తన 12 ఏళ్ల కారుకు శశ్వాత వీడ్కోలు పలకడానికి ఆయన దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మొదలగు వారు కారును గుంతలోకి దింపే సమయంలో విచార వదనంతో కనిపించారు.
ఈ కార్యక్రమంపై సంజయ్ పోలారా మాట్లాడుతూ, ఈ కారు గత 12 ఏళ్లుగా మా కుటుంబంలో ఒక భాగస్వామిగా ఉంది. మా కుటుంబ వృద్ధిలో ఇది అత్యంత కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఇంత కాలం మాకు ఎంతో ఉపయోగపడిన కారును ఇతరులకు అమ్ముకోవాలని అనుకోలేదు. అందుకే మా కారుకు గౌరవంగా అంతిమ వీడ్కోలు పలకాలని నిర్ణయించి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం కారు దహాన సంస్కరాలకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది తెగ వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌తో సహా, ఎక్స్ ఖాతాలో ఈ వీడియోకు లైకులు, షేర్లు అధికంగా వస్తున్నాయి. కారును అమ్మకుండా భవిష్యత్ తరాలకు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా వ్యాపారవేత్త సంజయ్ పోలారా, ఆయన కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.
మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ విషయానికి వస్తే ఇది మొదట డిసెంబర్ 18, 1999న ఇండియా మార్కెట్లోకి విడుదల అయింది. మధ్యతరగతి ప్రజల నుంచి మొదలుకుని సినీ తారలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చాలా మంది ఈ కారును కలిగి ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా వ్యాగన్ఆర్ కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. ఈ కారును ఇప్పటికీ చాలా మంది వాడుతున్నారు.

ప్రస్తుతం, ఉన్నటువంటి సరికొత్త మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ ధర రూ.5.54 లక్షల నుంచి ధర రూ.7.33 లక్షలు (ఎక్స్-షోరూమ్ - బెంగళూరు)గా ఉంది. ఇది LXI, VXI, ZXI ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. పూల్‌సైడ్ బ్లూ, గాలంట్ రెడ్, సిల్కీ సిల్వర్, సాలిడ్ వైట్‌తో పాటు మరిన్ని కలర్స్‌లలో లభిస్తుంది. ఇది CNG, 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.
మైలేజ్ విషయానికి వస్తే, CNG వేరియంట్లు 33.48 kmpl,పెట్రోల్ వేరియంట్లు 23.56 నుండి 25.19 kmpl వరకు ఇస్తాయి. చిన్న కుటుంబం ప్రయాణించడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. లోపల 5 మంది కూర్చుని ఈజీగా ప్రయాణించవచ్చు. కారు లోపల ప్రయాణికులకు, డ్రైవర్లకు అవసరమయ్యే అన్ని ఫీచర్లను అందించారు.


Click it and Unblock the Notifications








