ఆడపిల్ల కోసం 'రేంజ్ రోవర్' కలర్ మార్చేసిన తండ్రి.. ఇలాంటి కారు ఎప్పుడూ చూసుండరు! (వీడియో)
సాధారణంగా రోడ్డుపైన చాలా వరకు వైట్, బ్లాక్ కలర్ కార్లను ఎక్కువగా చూస్తుంటాము. కానీ అప్పుడప్పుడు రెడ్, ఎల్లో వంటి కార్లు కనిపిస్తుంటాయి. కానీ ఒక వ్యక్తి తన కారును పింక్ రంగులోకి మార్చుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ..
నివేదికల ప్రకారం మనం చెప్పుకున్న పింక్ కలర్ కారు గుజరాత్‌కు చెందిన వ్యక్తి రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. తన రేంజ్ రోవర్ కారును సరికొత్త పింక్ రంగులోకి మార్చుకున్నాడు. దీనికి కారణం తనకు కూతురు పుట్టడమే. తనకు కుమార్తె పుట్టిందనే సంతోషంతో స్త్రీల రంగుగా భావించే రంగులోకి కారును మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే సూరత్ వీధుల్లో పింక్ కలర్ కారు వెళ్లడం చూడవచ్చు. కారు మొత్తం పింక్ రంగులోనే ఉంది, డోర్ హ్యాండిల్స్ మాత్రం బ్లాక్ రంగులో ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా కారు మీద పాపాయి బొమ్మ, సీతాకోక చిలుకల బొమ్మలు, వెనుక ఒక టీ షర్ట్ బొమ్మ ఉండటం కూడా చూడవచ్చు. ఈ కారు వెనుక ఓ లంబోర్ఘిని కారు రావడం కూడా చూడవచ్చు.
పింక్ కలర్ రేంజ్ రోవర్ కారు
ఆడపిల్ల పుడితే భారమనుకునే రోజుల్లో ఓ వ్యక్తి తనకు కూతురు పుట్టించని ఖరీదైన కారును పింక్ రంగులోకి మార్చేశాడు. ఇది నిజంగానే గర్వించదగ్గ విషయం. ఈ కారులోని ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ కూడా అదే పింక్ రంగులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కారు మొత్తం పింక్ రంగు కారుగా మారిపోయిందని చెప్పాలి. ఇక్కడ కనిపించే కారు రేంజ్ రోవర్ స్పోర్ట్స్.

రేంజ్ రోవర్ స్పోర్ట్స్ అనేది మంచి డిజైన మరియు ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్స్ కలిగిం చెప్పుకోదగ్గ SUV. ఇది 3.0 లీటర్ వీ6 టర్బో డీజిల్, 4.4 లీటర్ వీ8 టర్బో డీజిల్ మరియు 5.0 లీటర్ పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అయితే వీడియోలో కనిపించే కారు డీజిల్ వెర్షన్ అని రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా తెలిసింది.
ఆధునిక కాలంలో రేంజ్ రోవర్ కార్లు సర్వ సాధారణం అయిపోయాయి. ఒకప్పుడు సెలబ్రిటీలు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేసే ఈ కారును చాలామంది సాధారణ ప్రజలు కూడా తమ రోజువారీ వినియోగం కోసం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే రేంజ్ రోవర్ కారు కొన్న సెలబ్రిటీల జాబితాలో దిశా పటాని మరియు అనన్య పాండే మొదలైన ప్రముఖులు వారు ఉన్నారు.
కార్ల మోడిఫికేషన్ చట్టబద్దమేనా?
నిజానికి భారతదేశంలో వెహికల్ మోడిఫికేషన్ చట్టబద్దం కాదు. కేవలం కార్లలో చిన్న చిన్న మార్పులు మాత్రమే కాకుండా కారు కలర్ ఛేంజింగ్ కూడా కొన్ని రాష్ట్రాల్లో చట్ట విరుద్ధమే. కాబట్టి పింక్ కలర్ కారు రోడ్డుపై వెళ్లే సమయంలో పోలీసుల కంట పడితే తప్పకుండా ఆ కారు యజమాని ఇబ్బందిపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇది చట్ట విరుద్ధంగా పరిగణించబడితే దానిని తొలగించమని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








