జులై 6న ముంబైలో గల్ఫ్ స్కూటర్ ర్యాలీ ప్రారంభం

By Ravi

వర్షాలు వచ్చినా రాకపోయినా గల్ఫ్ మాన్‌సూన్ స్కూటర్ ర్యాలీ మాత్రం వచ్చేసింది. ఈ ఏడాది 25వ గల్ఫ్ మాన్‌సూన్ స్కూటర్ జులై 6వ తేదీన ముంబైలో జరగనుంది. నావీ ముంబై‌లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ట్రాక్‌పై రైడర్లు తమ స్కూటర్లతో చేసే విన్యాసాలు చూసేందుకు ముంబై వాసులు సిద్ధమయ్యారు.

బెలాపూర్ మైనింగ్ ఏరియాల్లోని రఫ్ టెర్రైన్స్‌పై ద్విచక్ర వాహనం కానీ లేదా నాలుగు చక్రాల వాహనం కానీ నడపటం అంటే అంత సులువైన అంశ కాదని, ఆ ప్రాంతంలో 5 నిమిషాలు వర్షం పడితేనే పరిస్థితి క్లిష్టంగా ఉంటుందని స్పోర్ట్స్‌క్రాఫ్ట్ ఆర్గనైజింగ్ చైర్మన్ శ్రీకాంత్ కరణి చెప్పారు.

Gulf Scooter Rally

ఈ ర్యాలీ రెండు సెక్టార్లలో విభజించనున్నారు. ఒకటి సెంట్రల్ ముంబైలోని పారెల్ వద్ద ఉన్న అవర్ లేడీస్ హోమ్ నుంచి నావీ ముంబై మధ్యలో (40 కిలోమీటర్లు), మరొకటి బెలాపూర్‌లోని 6.8 కిలోమీటర్ల ట్రిపుల్ లూప్.

భారతదేశంలో అత్యంత క్లిష్టమైన మోటార్‌స్పోర్ట్‌లలో ఈ గల్ఫ్ మాన్‌సూన్ స్కూటర్ ర్యాలీ కూడా ఒకటి. గతంలో ఈ పోటీలో పాల్గొన్న అనేక మంది రైడర్లతో పాటుగా కొత్త వారు కూడా ఈ సవాలును ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నారని కరణి తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, July 4, 2014, 14:55 [IST]
English summary
The 25th Gulf Monsoon Scooter Rally to be held on July 6 in Mumbai. This Golf Monsoon Scooter Rally is one of the toughest two-wheeler rallies in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+