పోలీస్ మీద కేసు పెట్టిన నెటిజన్లు: సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించారు!

ట్విట్టర్ ద్వారా ఇటీవల హెల్మెట్ ధరించకుండా బైకు మీద వెళుతున్న పోలీసుపై రహదారి నియమాన్ని ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. అవును, గురుగ్రామ్‌కు చెందిన 28 ఏళ్ల హర్మీత్ బాత్రా హెల్మెట్ లేకుండా వెళుతున్

By Anil Kumar

చట్టం ఎవడి సొత్తూ కాదు, చట్టం అందరికీ వర్తిస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి డైలాగులు వినిపిస్తుంటాయి కానీ, పాటించే దాఖలాలు చాలా తక్కువ. ఉదాహరణకు, రహదారి నియమాలను ఉల్లంఘించే ప్రజల మీద చట్టాన్ని ఝులిపించే పోలీసు అధికారులే, అన్నీ తెలిసినా ఈ నియమ, నిభందనలు మరియు చట్టాలు మాకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు.

పోలీస్ మీద కేసు పెట్టిన నెటిజన్లు

హెల్మెట్ తప్పనిసరి అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ వ్యవస్థలు సందర్భం వచ్చినప్పుడల్లా ఊదరగొడుతుంటారు. కానీ, ఎంతో మందికి హెల్మెట్ ప్రాధాన్యతను వివరించే పోలీసులే చాలా సందర్భాల్లో హెల్మెట్‌ను విస్మరిస్తున్నారు.

పోలీస్ మీద కేసు పెట్టిన నెటిజన్లు

రోడ్డు మీద జరిగే న్యాయఅన్యాలను మరియు చట్ట వ్యతిరేకుల గురించి వివరించేందుకు సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైన ఆయుధం. దీని ప్రాముఖత్య తెలుసుకున్న పలు పోలీసు శాఖలు ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ ఖాతాలను ప్రారంభించి మరింత మెరుగైన సేవలందిస్తున్నారు.

పోలీస్ మీద కేసు పెట్టిన నెటిజన్లు

బెంగళూరు, హైదరాబాద్, ముంబాయ్ మరియు ఢిల్లీ మెట్రో నగరాలు ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎప్పటికప్పుడు నెటిజన్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు, చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు.

పోలీస్ మీద కేసు పెట్టిన నెటిజన్లు

ఈ ట్విట్టర్ ద్వారా ఇటీవల హెల్మెట్ ధరించకుండా బైకు మీద వెళుతున్న పోలీసుపై రహదారి నియమాన్ని ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. అవును, గురుగ్రామ్‌కు చెందిన 28 ఏళ్ల హర్మీత్ బాత్రా హెల్మెట్ లేకుండా వెళుతున్న పోలీస్ అధికారి ఫోటో తీసి, ట్విట్టర్‌లో ట్వీట్ చేసి, గురుగ్రామ్ పోలీసులను ట్యాగ్ చేశారు.

పోలీస్ మీద కేసు పెట్టిన నెటిజన్లు

గురు‌గ్రామ్‌లోని సింకిందర్ పూర్‌లో యూనిఫామ్‌లో ఉన్న పోలీస్ అధికారి గస్తీ కోసం ఉపయోగించే బైకు మీద ఓ మహిళను కూర్చోబెట్టుకుని, ఇద్దురు కూడా హెల్మెట్ లేకుండా వెళుతుండగా, చట్టం ఎవ్వరి సొత్తు కాదు, అందరూ విధిగా పాటించాలని చెప్పే అధికారులే ఇలా చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఆ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే, గురుగ్రామ్ పోలీసుల నుండి ఊహించని విధంగా అనూహ్యమైన సమాధానం వచ్చింది. ఫిర్యాదు చేసినందుకు ధన్యవాదాలు, ఆన్‌లైన్ ఛలానా జారీ చేసే విభాగానికి ఈ కేసును పంపించినట్లు సమాధానమిచ్చారు.

పోలీస్ మీద కేసు పెట్టిన నెటిజన్లు

తొలుత ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన హర్మీత్ పోలీసుల ట్విట్టర్ సమాధానికి బదులుగా మరో ట్వీట్ చేశాడు. రహదారి నియమాన్ని ఉల్లంఘించిన ఆ వెహికల్ మీద ఏ గురుగ్రామ్ పోలీస్ బ్రాంచ్ 200 రుపాయల ఇ-ఛలానా విధించారని ప్రశ్నించారు.

ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా దెబ్బకు పోలీసు వ్యవస్థలో కొంత మార్పు వస్తోంది. అత్యంత పారదర్శకమైన పాలన మరియు సమర్థవంతమైన వ్యవస్థకు సామాజిక మాధ్యమాలు ఎంతో ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి, మీకు కనుక ఎవరైనా ఇలా రహదారి నిమయాలను ఉల్లంఘిస్తూ పట్టుబడితే, ఆ దృశ్యాన్ని కెమెరాతో క్లిక్‌మనిపించి, ట్విట్టర్ లేదా ఫేస్‌బుక్ ద్వారా ఆ యా సంభందిత అధికారులకు చేరవేయండి.

Image Courtesy: Twitter / Harmeet Batra

Most Read Articles

English summary
Read In Telugu: Gurugram Police Sends e-Challan to Police Officer Riding Motorcycle Without Helmet After Twitter Complaint
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X