హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
కర్ణాటక రాష్ట్రంలో అప్పుడే ఎలక్షన్ ఫీవర్ ప్రారంభమైంది. ఈసారి రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సీఎం సీటు దక్కించుకోవాలని రాజకీయ ప్రముఖులంతా కసరత్తులు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు ఓటర్లను తమవైపుకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) (జనతా దళ్ సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి ఓ అధునాతమైన మరియు అత్యంత విలాసవంతమైన వ్యాన్‌ను సిద్ధం చేయించుకున్నారు.
రాష్ట వ్యాప్తంగా సాగే తన ఎన్నికల ప్రచారం సౌకర్యవంతంగా, విలాసవంతంగా మరియు సుఖవంతంగా సాగేందుకు ఓ హై-టెక్ లగ్జరీ మినీ వ్యాన్‌ను కుమారస్వామి కోసం బెంగుళూరుకు చెందిన వెహికల్ కస్టమైజర్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఇచ్చాడు. జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ 'టొయోటా' అందిస్తున్న ఓ వ్యాన్‌ను విలాసవంతమైన ఇంటీరియర్లతో, సౌకర్యవతమైన సదుపాయాలతో కస్టమైజ్ చేశారు. మరి హెచ్‌డి కుమారస్వామి ఎన్నికల ప్రచార క్యాంపైన్ వ్యాన్‌లో ఉన్న విలాసాలేంటే మనమూ ఓ కన్నేసొద్దాం రండి..!

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) (జనతా దళ్ సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి ఓ అధునాతమైన మరియు అత్యంత విలాసవంతమైన వ్యాన్‌ను సిద్ధం చేయించుకున్నారు.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
రాష్ట వ్యాప్తంగా సాగే తన ఎన్నికల ప్రచారం సౌకర్యవంతంగా, విలాసవంతంగా మరియు సుఖవంతంగా సాగేందుకు ఓ హై-టెక్ లగ్జరీ మినీ వ్యాన్‌ను కుమారస్వామి కోసం బెంగుళూరుకు చెందిన వెహికల్ కస్టమైజర్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఇచ్చాడు.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
ఈ కస్టమైజ్డ్ టొయోటా ఎలక్షన్ వ్యాన్‌కు నాలుగు లౌడ్ స్పీకర్లను అమర్చారు. ప్రచార సమయంలో కుమారస్వామి చేసే ప్రసంగాలు, రికార్డ్ చేయబడిన సందేశాలు ప్రజలకు వినిపించేలా వీటిని కారుకు పైభాగంలో అమర్చారు.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
ఈ వ్యాన్‌లో డ్రైవరుతో పాటుగా 7 మందికి చోటు ఉంటుంది. ఇందులో హెచ్‌డి కుమారస్వామి కోసం ఓ పెద్ద మాహారాజ సీట్ కూడా ఉంటుంది.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
ఇంకా ఇందులో ఓ వాష్‌బేసిన్, టెలివిజన్ సెట్, కమ్యూనికేషన్ సిస్టమ్, కాఫీ మెషీన్, రిఫ్రిజిరేటర్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
ఎన్నికల ప్రచార సమయంలో కుమారస్వామి ప్రజలకు అభివాదం చేసేందుకు గాను వ్యాన్‌కు పైభాగంలో సన్‌రూఫ్‌ను, అలాగే సీటును పైకి లేపేందుకు హైడ్రాలిక్ లిఫ్ట్‌ను అమర్చారు.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
బెంగుళూరులోని విల్సన్ గార్డెన్స్‌లో ఉన్న శ్రీస్టి ట్రావెల్స్‌కు చెందిన రాజు గౌడ ఈ హెచ్‌డి కుమారస్వామి ఎన్నికల క్యాంపైన్ వాహనాన్ని డిజైన్ చేశారు.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
హెచ్‌డి కుమారస్వామి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లగ్జరీ సీటు

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
ఆకర్షనీయమైన ఇంటీరియర్ లైట్స్, ఆటోమేటిక్ సన్‌రూఫ్.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
దృఢమైన గ్లాస్‌తో తయారు చేసిన కిటికీ అద్దాలు, క్లాస్ ఇంటీరియర్స్.

హెచ్‌డి కుమారస్వామి లగ్జరీ ఎన్నికల ప్రచార వాహనం
టొయోటా లగ్జరీ మినీ వ్యాన్.

Click it and Unblock the Notifications