మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న హర్ష్ లింబాచియా - ధర తెలిస్తే షాకవుతారు!

సెలబ్రిటీలు, ప్రముఖులు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తూ ఉంటారని అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ఫేమస్ కమెడియన్, రచయిత 'హర్ష్ లింబాచియా' మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హర్ష్ లింబాచియా కొత్త 'మెర్సిడెస్ బెంజ్ జీఎస్ఎస్ ఫేస్‌లిఫ్ట్‌' (Mercedes Benz GLS Facelift) ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కంపెనీ ఈ కొత్త కారును ఈ ఏడాది ప్రారంభంలో రూ. 1.32 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. ఈ కారును డెలివరీ చేసుకునే సమయంలో.. అతడు తన భార్య భారతి సింగ్‌తో కనిపించాడు.

Haarsh Limbachiyaa Mercedes Benz GLS

హర్ష్ లింబాచియా మాత్రమే కాకుండా థాని భార్య భారతి సింగ్‌ కూడా మంచి కమెడియన్. వీరిద్దరూ కలిసి పలు కామెడీ షోలలో పాల్గొన్నారు. వీరికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇక వీరు కొనుగోలు చేసిన కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు విషయానికి వస్తే.. ఇది తెలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కూడా పొందుతుంది.

ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్.. అద్భుతమైన కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. జీఎల్ఎస్ బోల్డ్ లుక్ కలిగి నాలుగు స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్ మరియు మధ్యలో బ్రాండ్ లోగో వంటివి పొందుతుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటివి ఇందులో ఉంటాయి. టెయిల్ లైట్ కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ బంపర్ కూడా చూడవచ్చు.

Haarsh Limbachiyaa Mercedes Benz GLS

బ్లాక్, బేజ్ మరియు బ్రౌన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో క్యాబిన్ ఉంటుంది. క్యాబిన్ మొత్తం లెదర్ అపోల్స్ట్రే. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్, డ్యూయెల్ స్క్రీన్ MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి ఉన్నాయి. వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ సస్పెన్షన్ మరియు ఏడీఏ ఎస్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ SUV వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, అడ్జస్టబుల్ రియర్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌బ్లైండ్‌లు మరియు వెనుక ప్రయాణికుల కోసం రెండు 11.6 ఇంచెస్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు మొదలైన ఎన్నో ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు ప్రయాణ సమయంలో మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క 450 వేరియంట్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 376 bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇక 450డీ వేరియంట్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది ఇది 362 bhp పవర్ మరియు 700 Nm టార్క్ అందిస్తుంది.

బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. రెండు ఇంజిన్లు 20 Bhp పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ వంటి వాటిని అడిషనల్ బూస్ట్‌తో మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ ద్వారా పొందుతాయి. ఈ రెండు ఇంజిన్లు మంచి పనితీరును అందిస్తాయి. కాబట్టి ఎక్కువమంది దీనిని ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2024, 14:00 [IST]
English summary
Haarsh limbachiyaa buys mercedes benz gls facelift details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+