కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న హంసా నందిని

By Ravi

తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌తో కుర్రకారుకి కిర్రెక్కించిన ప్రముఖ సినీ నటి హంసా నందిని పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. వైఎస్ఆర్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న హంసానందిని కారు గడచిన సోమవారం రాత్రి మహబూబ్ నగర్ వద్ద ప్రమాదానికి గురైంది.

హంసా నందిని ప్రయాణిస్తున్న టొయోటా ఇన్నోవా కారు హైవేపై అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బారికేడ్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ప్రాణ నష్టం జరగలేదు. కానీ కారు డ్రైవర్‌కు మాత్రం స్వల్పంగా గాయలయ్యాయి.


కడపలో ఓ స్టేజ్ షోలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారులో హంసానందినితో పాటు ఆమె తండ్రి, డ్రైవర్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో, హంసానందిని ఆమె తండ్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

హంసా నందిని ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించింది. యాక్సిడెంట్‌కు గురైన కారు ఫొటోను కూడా ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత, అదే రోడ్డుపై వెళ్తున్న భాను అనే వ్యక్తి హంసా నందినికి, ఆమె తండ్రికి లిఫ్ట్ ఇచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకునేందుకు సహకరించాడు.

Hamsa Nandini

ఈ విషయాన్ని కూడా ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంది. అంతేకాదు, భానుతో దిగిన ఫొటోను కూడా ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రాత్రి సమయం కావటంతో డ్రైవర్ కునుకు తీయటం వల్లనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ప్రస్తుతం హంసా నందిని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐటెం సాంగ్స్‌‌కి హాట్ ఫేవరేట్ గా పేరు తెచ్చుకుంది. 2013లో రిలీజ్ అయిన దాదాపు అన్ని బిగ్ బడ్జెట్ చిత్రాల్లో హంసా నందిని ఐటెం సాంగ్స్ చేసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 28, 2014, 14:28 [IST]
English summary
Actress Hamsa Nandini, who is known for her hot item numbers in hit Telugu movies, has miraculously escaped unhurt, when her car hit the barricade at Mehboobnagar on Monday evening. Confirming the news about her car accident, the actress gushed that she and her father were blessed to have survived without getting hurt.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+