లగ్జరీ కారు కొన్న హార్దిక్‌ పాండ్యా.. కారులో ఫ్రిజ్‌, 48 ఇంచెస్‌ టీవీ, ఇంకా మరెన్నో టాప్‌ క్లాస్‌ ఫీచర్లు!

రోజువారి లైఫ్‌స్టైల్‌లో భారత క్రికెట్ జట్టు ఆటగాడు హార్దిక్ పాండ్యా స్టైలే వేరు. ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ హార్దిక్ కెరీర్లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇది అతని కెరీర్‌లో కీలకమైన మైల్‌స్టోన్‌గా అభివర్ణించవచ్చు. తాజాగా హార్దిక్ పాండ్యా ఇటీవల లగ్జరీ లెక్సస్ ఎల్ఎం350హెచ్ (Lexus LM 350h Luxury MPV) కారును కొనుగోలు చేశాడు. ఈ టాలెంటెడ్ ఆల్‌రౌండర్ సుదీర్ఘకాలంగా భారత క్రికెట్ జట్టులో ఉన్నాడు. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ ఆల్‌రౌండర్ తన కొత్త లగ్జరీ కారులో కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంపీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రజలను వస్తూ ఉండగా అక్కడే ఉన్న ఫ్యాన్స్‌ ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ ఎంపీవీని దేశంలోని ప్రముఖులు, బాలీవుడ్‌, వ్యాపారవేత్తలతో సహా పలువురు సెలెబ్రిటీలు అత్యంత ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులోని లగ్జరీ ఫీచర్లు ఆ రేంజ్‌లో ఉంటాయి కాబట్టి.

Hardik Pandya in Lexus LM 350h MPV

లెక్సస్ ఎల్ఎం 350హెచ్ లగ్జరీ ఎంపీవీ లేటెస్ట్ జనరేషన్ వెర్షన్ మార్చిలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. న్యూ జనరేషన్‌ ఎల్ఎం 350 హెచ్ లగ్జరీ ఎంపీవీ కోసం బ్రాండ్ గత సంవత్సరం బుకింగ్స్‌ని ప్రారంభించింది. దీనిని 7-సీటర్ లేదా 4-సీటర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. వీటి ఎక్స్ షోరూమ్ ధర వరుసగా రూ.2 కోట్లు, రూ.2.5 కోట్లుగా నిర్ణయించారు.

ఈ లెక్సస్ ఎంపీవీని GA-K మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. క్యాబిన్ స్పేస్ ఎక్కువగా అందించేలా బాక్సీ డిజైన్‌ని రూపొందించారు. 4-సీటర్ వెర్షన్ క్యాబిన్ విశాలంగా ఉంటుంది. ఇది ముందు అలాగే వెనుక కూర్చునే ప్రయాణీకుల మధ్య డివిజిన్‌ ఉండేలా చేస్తుంది. ఇంటీరియర్స్‌లో ఎయిర్ క్రాఫ్ట్ లాంటి రెక్లైనర్ సీట్లు, 23 స్పీకర్ల సరౌండ్ సౌండ్ సిస్టమ్, కుషన్‌ తరహా హెడ్ రెస్ట్, 48 అంగుళాల టీవీ, ఫ్రిజ్ ఉన్నాయి.

Hardik Pandya s Lexus LM 350h MPV Visuals

అంతే కాకుండా ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌తో కూడిన ఏసీ, పవర్ సీట్ లాంగ్ స్లైడ్ రైల్, వివిధ రకాలుగా ఆపరేట్ చేయగల టిల్ట్-అప్ సీటు, వైబ్రేషన్లను గ్రహించే పిస్టన్ వాల్వ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫాల్ట్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌, USB B పోర్టులు, వైర్‌లెస్ ఛార్జర్లు, రీడింగ్ లైట్లు, వ్యానిటీ అద్దాలు, హోల్డర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రయాణీకుల శరీరానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసే కొత్త సెన్సార్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ కూడా ఇందులో లభిస్తుంది. అడాప్టివ్ సస్పెన్షన్ ప్రయాణాలను సౌకర్యవంతంగా చేయడానికి సహాయపడుతుంది. నాయిస్ రిడక్షన్ టైర్లు, యాక్టివ్ నాయిస్ కంట్రోల్, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు లెక్సస్ ఎంపీవీలో ఉన్నాయి.

Hardik Pandya s Lexus LM 350h MPV Visuals

ఈ లెక్సస్ ఎల్ఎమ్350హెచ్ ఎంపీవీ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులోని 2.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ 246bhp పవర్ మరియు 239nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అధిక సామర్థ్యం కోసం ఇంజిన్ నికెల్-మెటల్ హైడ్రైడ్ బ్యాటరీతో కలిసి పనిచేస్తుంది. ఈ ఇంజిన్ సీవీటీ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ప్రస్తుతం, లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ ఎంపీవికి దేశంలో ప్రత్యక్ష పోటీదారులు లేరు.

ట్రెండ్‌కి అనుగుణంగా అంబానీ గ్యారేజీ నిత్యం కొత్త వాహనాలను వచ్చి చేరతాయి. ఈ జాబితాలోకి లెక్సస్ ఎంపీవీ కూడా కొత్తగా ప్రవేశించింది. అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్ మరియు విమానంలో ఉండే విధంగా ఫస్ట్ క్లాస్ క్యాబిన్లకు సరిపోయే ఇంటీరియర్లతో, ఈ లగ్జరీ కారు ఉంది. అలాగే రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ఈ కారుని కలిగి ఉన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, August 16, 2024, 15:15 [IST]
English summary
Hardik pandya in lexus lm350h luxury mpv visuals gone viral check this car specifications in telugu
Read more on: #lexus #celebrity cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+