Harith Noah డాకర్ ర్యాలీ 2024లో విజయం సాధించిన తొలి భారత రైడర్‌గా ‘హరిత్ నోహ్' రికార్డ్
డాకర్ హరిత్ నోహ్ చరిత్ర సృష్టించాడు. 2024 డాకర్ ర్యాలీ 2 క్లాస్ విభాగంలో హరిత్ నోహ్ విజేతగా నిలిచాడు. సౌదీ అరేబియాలో జరుగుతున్న ఈ పోటీలలో పాల్గొని విజేతగా నిలిచిన తొలి భారత రైడర్‌గా రికార్డ్ సాధించాడు. నోహ్ ఓవరాల్‌గా 11 స్థానం సంపాదించాడు. ఇప్పటి వరకు ఏ భారతీయుడికైనా ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్ కావడం గమనార్హం.
డాకర్ ర్యాలీ అనేది ప్రపంచంలోనే కఠినమైన రేసుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. టీవీఎస్ సహకారంతో హిరిత్ నోహ్ షెర్క్ మెషీన్ ర్యాలీ క్లాస్2లో రెండు రౌండ్స్‌లో విజయాలు సాధించాడు. మొదటి భాగంలో నెమ్మదిగా రైడ్ చేసిన హరిత్ రెండో రౌండ్‌లో అమాంత స్పీడ్‌ని పెంచాడు. తొలుత P18 స్థానంలో ఉన్న అతను ఆ తర్వాత P13 కి ఎగబాకాడు. స్టేజ్ 8 మరియు స్టేజ్10 లలో అత్యంత వేగాన్ని ప్రదర్శించి విజయం సాధించాడు.

ఈ విజయం యావత్ భారత్ గర్వించదగినది. కఠినమైన డాకర్ ర్యాలీలో పాల్గొని విజేతగా నిలువడం పట్ల దేశవ్యాప్తంగా హరిత్‌కి శుభాంకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేరళకు చెందిన 30 ఏళ్ల ఈ యువ రైడర్‌కి మోటార్ స్పోర్ట్స్ అంటే ఎనలేని ప్రీతి. ఇతను టాప్-10లో చోటు సంపాదించేందుకు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే వెనకబడి ఉండటం గమనార్హం. అత్యంత అనుభవజ్ఞులైన రైడర్లు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొంటారు. వారికి మాత్రమే అధికారికంగా ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది.
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మోటార్ సైక్లింగ్ అసోసియేషన్స్ ఆమోదించిన రైడర్లు మాత్రమే ర్యాలీజీపీలో(RallyGP) పాల్గొంటారు. ఈ ర్యాలీలు అత్యంత ప్రమాదకరమైనవి కఠినమైన ప్రదేశాల్లో, గరుకుగా ఉండే ప్రదేశాల్లో ఈ పోటీలు నిర్వహించబడతాయి. సాహస రైడర్లు మాత్రమే ఇందులో పోటీకి ముందుకు వస్తారు. అయితే భారత్ నుంచి చాలా తక్కువ మంది డాకర్ రేస్‌కి ఆసక్తి చూపిస్తారు. అయితే గత కొద్ది రోజులుగా దీనికి డిమాండ్ పెరుగుతోంది.

ఈ డాకర్ ర్యాలీకి ముందు హరిత్ తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినా కానీ పోటీలో నిలదొక్కుని విజయం సాధించాడు. తన విజయంపై హరిత్ హర్షం వ్యక్తం చేశారు. టాప్-10లో స్థానం దక్కించుకోక పోవడం కొంత అసహనం వ్యక్తం చేసినా.. రైడ్‌ని అనుకున్న సమయంలో పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ సంవత్సరం చాలా నేర్చుకున్నానని ప్రత్యేకించి రెండో వారంలో పోటీలో నిలదొక్కుకునే ధైర్యం వచ్చిందని పేర్కొన్నాడు.
ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ప్రయత్నించానని.. అందువల్లనే విజయం సాధించానని హరిత్ తెలిపాడు. యువ రైడర్లకు నా గెలుపు బూస్ట్ ఇస్తుందని అతను పేర్కొన్నాడు. 2020లో తొలిసారి డాకర్ పోటీలో పాల్గొన్నాడు. 2021 ఎడిషన్‌లో 20 స్థానంలో నిలిచి అత్యుత్తమ ర్యాంక్‌ని పొందాడు. ఆ తర్వాత 2022 మరియు 2023 పోటీలకు అతను దూరంగా నిలిచాడు. తాజాగా మరోసారి పోటీలో నిలిచి విజయం సాధించాడు.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: హరిత్ నోహ్‌కు 2023 సంవత్సరం పలు సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతను గత సంవత్సరంలో రెండు ప్రధాన చికిత్సలు చేయించుకున్నాడు. అయితే, హరిత్ నోహ్ ప్రతిఫలానికి తగినట్లుగా అతిపెద్ద విజయం కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందారు. భారతీయులుగా ఇది గర్వించదగ్గ విషయం. భవిష్యత్తులోని ఎందరో యువ రైడర్లు డాకర్ పోటీలో పాల్గొనేందుకు ఈ విజయం ప్రేరణ కలిగిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








