'రిషబ్ పంత్‌' పాలిట ఆపద్భాంధవులు ఈ బస్సు డ్రైవర్, కండక్టర్: వెల్లువెత్తుతున్న ప్రసంశలు

ఇటీవల ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం సమయంలో బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ అతనికి సహాయం చేశారు. వీరిని హర్యానా రోడ్ వేస్ మర్యాదపూర్వకంగా సత్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కారు ప్రమాదంలో చిక్కుకుని గాయాలపాలైన రిషబ్ పంత్ ని ప్రమాదం జరిగిన సమయంలో హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ మరియు కండక్టర్ పరంజీత్ సహాయం చేశారు. పంత్ ప్రాణాలను కాపాడిన సుశీల్ కుమార్ మరియు పరంజీత్ ఇద్దరినీ హర్యానా రోడ్ వేస్ సత్కరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు వారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రిషబ్ పంత్‌ పాలిట ఆపద్భాంధవులు ఈ బస్సు డ్రైవర్, కండక్టర్

సుశీల్ కుమార్ మరియు పరంజీత్ ఇద్దరు తమ విధులను ముగించుకుని తిరిగి వచ్చిన తరువాత ప్రశంసాపత్రం మరియు షీల్డ్ వంటి వాటిని అందించినట్లు హర్యానా రోడ్ వేస్ పానిపట్ డిపో జనరల్ మేనేజర్ కుల్దీప్ జంగ్రా ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారు. బస్సు డ్రైవర్ మరియు కండక్టర్లను హర్యానా రవాణా మంత్రి మూల్చంద్ శర్మ కూడా ప్రసంసించారు. రిషబ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడంటే దానికి కారణం ఆ ఇద్దరూ అనే చెప్పాలి.

ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై రిషబ్ పంత్ లగ్జరీ కారు డివైడర్ను ఢీకొట్టిన భయంకరమైన ప్రమాదాన్ని చూసి పంత్ కు సహాయం చేయడానికి సుశీల్ కుమార్ మరియు పరంజీత్ పూనుకున్నారు. పరంజీత్ మొదట రిషబ్ పంత్ ను గుర్తించి అతడు ఇండియన్ క్రికెటర్ అని గుర్తించి సుశీల్ కుమార్ కి చెప్పాడు. అయితే మొత్తానికి వారు రిషబ్ పంత్ కి సహాయం చేశారు. హర్యానా ప్రభుత్వం వారిని ప్రశంసించడమే కాకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారిని ప్రశంసించడానికి ముందుకు వచ్చింది.

రిషబ్ పంత్‌ పాలిట ఆపద్భాంధవులు ఈ బస్సు డ్రైవర్, కండక్టర్

ప్రమాద స్థలం నుండి రిషబ్ పంత్ ను ఆసుపత్రికి చేర్చి రక్షించడంలో సహాయపడిన బాటసారులందరికీ కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క 'గుడ్ సమరితన్' పథకం కింద అందించే బహుమతి కూడా ఇస్తామని ఉత్తరాఖండ్ పోలీసు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తెలిపారు. నిజానికి రోడ్డుపై ఒక మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయడం నిజంగా ప్రశంసించాల్సిన విషయం.

2022 డిసెంబర్ 30 ఉదయం 5:30 గంటల సమయంలో ఢిల్లీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలోని రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు డివైడర్ ని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఎక్కువగా మంటలు వ్యాపించాయి, అతి కష్టం మీద రిషబ్ పంత్‌ బయటపడ్డాడు, కానీ అతనికి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి.

రిషబ్ పంత్‌ పాలిట ఆపద్భాంధవులు ఈ బస్సు డ్రైవర్, కండక్టర్

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం, రిషబ్ పంత్ తమ మీద, కాలికి, వీపు భాగంలో గాయాలైనట్లు తెలిసింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. అక్కడి స్థానిక ప్రజల ద్వారా కూడా జరిగిన సంఘటనలను గురించి అడిగి తెలుసుకున్నారు.

కారు ఢీకొని బూడిదగా మారడానికి మధ్య సమయం కేవలం 5 నుంచి 7 సెకన్లు మాత్రమే, ఆ సమయంలోనే పంత్ విండ్ స్క్రీన్ ను పగలగొట్టి కారు నుండి బయటకు రాగలిగాడు. పంత్ ఆ సమయంలో కారు నుంచి బయటకు రాకుండా పోయి ఉంటే ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. రిషబ్ పంత్ మరింత త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం.

More from DriveSpark

Article Published On: Tuesday, January 3, 2023, 6:30 [IST]
English summary
Haryana bus driver and conductor who saved rishab pant awarded by government
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+