రాష్ట్రపతిచే సత్కరించబడిన సాధారణ జంట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సాధారణంగా ప్రజలు ప్రమాదాల భారిన పడినప్పుడు గాని, అనారోగ్యాలపాలైనప్పుడు గాని అత్యవసర సేవలకు అంబులెన్సులు చాలా అవసరం. అంబులెన్సుల ద్వారా సకాలంలో ఆసుపత్రికి చేరుకోవాలి. అంబులెన్స్ డ్రైవర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి, అంబులెన్స్‌లను సకాలంలో డ్రైవ్ చేసి బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఈ కారణంగానే అంబులెన్స్ సర్వీస్ మరియు అంబులెన్స్ డ్రైవింగ్ చాలా ఉత్తమమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది.

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

అంబులెన్స్ డ్రైవర్స్ తమ సర్వీస్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెడతారు. ఇదే విధంగా హిమాంషు అనే ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎక్కువ భాగం అంబులెన్స్ సర్వీస్ కోసం దారబోశాడు. ఇందులో వింత ఏమి అనుకుంటున్నారా.. యితడు ఏకంగా 20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేస్తున్నాడు.

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

ఇంత గొప్ప మహోన్నతమైన పనికి పూనుకున్న హిమాంషు భార్య ట్వింకిల్ కూడా ఈ పనిలో నిమగ్నమైపోయింది. హిమాంషు చేసిన సేవకు మెచ్చి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు హిమాంషు దంపతులను గౌరవించారు.

MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

ఇటీవల మహీంద్రా & మహీంద్రా కంపెనీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియోను విడుదల చేసింది. బొలెరో అంబులెన్స్ నిజంగా చాలామంది ప్రాణాలను కాపాడింది ఈ వీడియో ద్వారా తెలిపింది. ఇది అంబులెన్స్ పురుషుడు మరియు అంబులెన్స్ మహిళ యొక్క 20 సంవత్సరాల కథ.

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

ఈ ఇద్దరూ తమ సర్వీస్ తో దాదాపు 10 వేలమందికి పైగా ప్రజల ప్రాణాలను రక్షించారు. కరోనా కాలంలో, భార్యాభర్తలు ఇద్దరూ ప్రజా సేవలో అవిరామంగా పనిచేశారు. ఈ విధంగా సేవ చేసే తరుణంలో హిమాంషు భార్య కరోనా మహమ్మరి భారిన పడింది.

MOST READ:భారత్‌లో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 2021 విడుదల : ధర & వివరాలు

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

భార్య కరోనా భారిన పడినప్పటికీ కూడా హిమాంశు తన ఫ్రీ అంబులెన్స్ సేవలో అవిరామంగా కృషి చేస్తున్నాడు. ఈయన చేసిన సేవకు గాను పలువురు ప్రభుత్వ అధికారులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వారిని ఎంతగానో ప్రశంసించారు.

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

ఇద్దరి గౌరవార్థం మహీంద్రా ఈ వీడియోను విడుదల చేసింది. నివేదికల ప్రకారం హిమాంషు హర్యానాకు చెందినవాడు. అతడు 2000 నుండి ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. హిమాంషు తండ్రి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు అంబులెన్స్ రాలేదు. ఈ సంఘటనతో చలించిపోయిన హిమాంషు ఈ పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని ఉచిత అంబులెన్స్ సేవను ప్రారంభించారు.

MOST READ:రాంబో గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త స్పోర్ట్స్ కార్.. ఈసారి ఏ కార్ కొన్నారంటే..

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

ఆ రోజునుంచి దాదాపు పదివేల మందికి పైగా సహాయం చేశాడు. కరోనా వైరస్ సమయంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో చాలా మంది ఇంటికె పరిమితమయ్యారు. కానీ హిమాంషు మరియు అతని భార్య ప్రజలకు సేవ చేయడానికి పరితపించిపోయారు.

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

ఈ సేవకు గాను ప్రజలందరూ మెచ్చుకున్నారు. సాధారణంగా మహీంద్రా బొలెరోను ప్రయాణీకుల వాహనం ఉపయోగిస్తారు. కానీ హిమాంషు మహీంద్రా బోలెరోని అంబులెన్స్‌గా ఉపయోగిస్తున్నారు. మహీంద్రా బోలెరోని అంబులెన్సుగా మార్చి ప్రజలకు సేవ చేస్తున్నందుకు కూడా చాలామంది వారిని కొనియాడారు.

MOST READ:ఫాస్ట్‌ట్యాగ్‌ మినిమమ్ బ్యాలెన్స్‌పై క్లారిటీ ఇచ్చిన NHAI

20 సంవత్సరాలు ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ చేసిన జంట

ఏది ఏమైనా ఇంతటి సేవాతత్పరత కలిగి ఉండటం చాలా ప్రశంసనీయం. అలనాడు ఏమి ఆశించని మథర్ తెరిస్సా గురించి విన్నాం.. ఈ నాడు హిమాంషు తన జీవితాన్ని ప్రజల సేవలోనే వినియోగిస్తున్నాడు. ఇంతటి గొప్ప సేవ చేస్తున్న హిమాంషుని ఎంత కొనియాడిన తక్కువే..

Most Read Articles

English summary
Haryana Man Himanshu And His Wife Giving Free Ambulance Service From Past 20 Years. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X