ఉద్యోగులకు అదిరిపోయే దివాళీ గిఫ్ట్‌.. టాటా పంచ్‌ కార్లతో సర్‌ప్రైజ్‌ చేసిన ఫార్మా కంపెనీ.!!

దీపావళి వచ్చిందంటే ఉద్యోగులకు నిజంగా డబుల్‌ ఫెస్టివ్‌ సెలబ్రేషన్స్‌.. ఎన్నో ఏళ్లుగా సంస్థ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు వారి యజమానులు.. బోనస్‌లు అందిస్తూ వారి ఉత్సాహాన్ని డబుల్‌ చేస్తారు. హరియాణాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ పండుగ సందర్భంగా తమ ఉద్యోగులకు టాటా కార్లను బహుమతిగా ఇచ్చింది.

ఇటీవలే తమిళనాడులో ఓ ఎస్టేట్‌ యజమాని తన వద్ద పనిచేసే 15 మంది ఉద్యోగులకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హరియాణా పంచకులాలోని ఫార్మా కంపెనీ మిట్స్‌కార్ట్‌ ఛైర్మన్‌.. దివాళీ బోనస్‌గా 12 మంది ఉద్యోగులకు టాటా పంచ్‌ కార్లను అందించారు. అయితే వీరిలో ఆఫీస్‌ బాయ్‌ కూడా విశేషం..

Tata-Punch-Cars-Gift-To-Employees

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టాటా పంచ్‌ కార్లను బహుమతిగా అందజేస్తూ.. ఉద్యోగులే తనకు సెలబ్రిటీలంటూ మిట్స్‌కార్ట్‌ ఛైర్మన్‌ ఎంకె. భాటియా పేర్కొన్నారు. తమ సిబ్బందిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. వారి అంకిత భావం, కృషి, పట్టుదలకు ముగ్ధుడై ప్రత్యేక బహుమతిగా టాటా పంచ్‌ కార్లను అందించినట్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మిట్స్‌కార్ట్‌ సంస్థను ప్రారంభించినప్పటి నుంచి కంపెనీ ఎన్నో ఒడిదొడుకులను చూసిందని.. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉద్యోగులు తమతోనే ఉండి విజయానికి సహకరించారని భాటియా తెలిపారు. కంపెనీ ఎదుగులకు సహకరించిన తన ఉద్యోగులే తనకు సెలబ్రిటీలని, స్టార్స్‌ అనీ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Tata-Punch-Cars-Gift-To-Employees

అయితే టాటా పంచ్‌ కార్లు అందుకున్న వారిలో ఓ మహిళకు కారు నడపడం రాదట. తాము పని చేస్తున్న సంస్థ అందించిన బహుమతికి పొంగిపోతూ.. తనకు కారు నడపడం రాదని.. నేర్చుకుంటున్నానని చెప్పారు. అలాగే భవిష్యత్తులో మరికొంతమందికి కూడా గిఫ్ట్‌ ఇవ్వాలని యోచిస్తున్నట్లు భాటియా పేర్కొన్నారు.

కాగా టాటా మోటార్స్‌కు చెందిన టాటా పంచ్‌ కారు 2021 లో లాంచ్‌ అయింది. ఇది ఎంట్రీ లెవెల్‌ మైక్రో SUV. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో టాటా పంచ్ ధర రూ. 6 లక్షల నుండి రూ.10.10 లక్షలు(ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Tata-Punch-Cars-Gift-To-Employees

టాటా పంచ్‌ కారులో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. ఇక ఇందులో సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే.. అధునాతనమైన ఫీచర్లను ప్రవేశపెట్టారు. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్‌ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌ వ్యూ కెమెరాను కలిగి ఉంది.

ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. టాటా పంచ్‌ పెట్రోల్ వేరియంట్ 1.2-లీటర్, 3-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 85 bhp శక్తిని, 113 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. టాటా పంచ్‌ మైక్రో ఎస్‌యూవీ 18.8 - 20.09 kmpl మైలేజ్‌ని ఇస్తుంది.

Tata-Punch-Cars-Gift-To-Employees

ఇక టాటా పంచ్ CNG మోడల్ 1.2-లీటర్, 3-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ కారు 74 bhp గరిష్ఠ శక్తితో పాటు 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే పెట్రోల్ వేరియంట్‌ కారు కంటే కొంచెం తక్కువ అనే చెప్పవచ్చు. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉండగా.. 26.9 km/kg మైలేజ్‌ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 4, 2023, 9:13 [IST]
English summary
Haryana pharma company gifts tata punch cars to employees for diwali
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+