కరోనా ఎఫెక్ట్; అంబులెన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ కారణంగా రోగులకు సరిపడా అంబులెన్సులు అందుబాటులో లేదు. కావున ప్రైవేట్ వ్యక్తుల హవా ఎక్కువైంది. ప్రైవేట్ వ్యక్తుల అంబులెన్సులలో సాధారణ చార్జీలకంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

దీనిని దృష్టిలో ఉంచుకుని కరోనా రోగులకు సహాయం చేయడానికి హర్యానా పోలీసులు ముందుకు వచ్చారు. హర్యానా పోలీసులు ఇప్పుడు 440 ఎస్‌యూవీలను అంబులెన్స్‌గా ఉపయోగిస్తూ రోగులను ఉచితంగా ఆసుపత్రికి తీసుకెలుతున్నారు. ఈ వాహనాలను కోవిడ్-19 హాస్పిటల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ యొక్క చిన్న పేరుతో కోవ్-హాట్స్ అని పిలుస్తారు.

కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

ఈ పనుల కోసం ప్రతి జిల్లా పోలీసులకు 20 టయోటా ఇన్నోవా ఎస్‌యూవీలను ఇస్తామని హర్యానా పోలీసు డిజిపి మనోజ్ యాదవ్ తెలిపారు. ప్రైవేట్ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ లేకపోవడం లేదా అధిక ఛార్జీలు వసూలు చేయడం వంటి ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనం కోవిడ్ రోగులకు ఉచితంగా లభిస్తుంది.

MOST READ:ట్రక్కు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఇదే.. మీకు తెలుసా?

కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

ప్రస్తుతం ఈ సర్వీస్ లో 126 వాహనాలను లాంచ్ చేశారు, హిసార్ రేంజ్‌లో 26 ఎస్‌యూవీలను లాంచ్ చేశారు. వీటితో పాటు గురుగ్రామ్ పోలీస్, రోహ్తక్ రేంజ్‌లో 20 ఎస్‌యూవీలు, ఫరీదాబాద్, పంచకుల 10 ఎస్‌యూవీలు, అంబాలా, కర్నాల్ రేంజ్‌లో 12 ఎస్‌యూవీలు, రేవారి సౌత్ రేంజ్‌లో 16 ఎస్‌యూవీలు ఇవ్వబడ్డాయి.

కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

ఈ ఎస్‌యూవీలన్నీ ప్రస్తుతం రోగులను ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో 70 ఎస్‌యూవీలు గురువారం జిల్లాలకు చేరుకోగా, మిగిలిన 244 ఎస్‌యూవీలు ఆదివారం సాయంత్రం నాటికి చేరుతాయి. ఈ అంబులెన్సులు అవసరమైన వారు 108 డయల్ చేయవచ్చు లేదా పోలీసు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.

MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

ఈ అంబులెన్స్ హాస్పిటల్ సర్వీస్ చేయడమే కాకుండా, హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలను పోలీసులే డ్రైవ్ చేస్తారు. ఈ సమయంలో మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు మరియు పిపిఇ కిట్లు ఇవ్వబడ్డాయి, తద్వారా సురక్షితంగా ఉంచవచ్చు.

కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న ఆటో కంపెనీలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇందులో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా 'ఆక్సిజన్ ఆన్ వీల్స్' ప్రచారాన్ని ప్రారంభించారు. సంస్థ తన 100 బొలెరో ట్రక్కుల ద్వారా ముంబై, థానే, నాసిక్ మరియు నాగ్‌పూర్‌లో మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తోంది.

MOST READ:వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ

కరోనా ఎఫెక్ట్; అంబులన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

ఇదే సమయంలో హ్యుందాయ్ ఇండియా కంపెనీ కూడా కరోనా రోగులకు దాదాపు రూ. 20 కోట్లరూపాయల ప్యాకేజి ప్రకటించారు. అంతే కాకుండా దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ మౌలిక సదుపాయాలను కూడా అందిస్తుంది. ఏది ఏమైనా కరోనా సమయంలో హర్యానా పోలీసులు చేస్తున్న ఈ చర్య నిజంగా ప్రశంసనీయం.

Most Read Articles

English summary
Haryana Police 440 SUVs Ambulances. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X