విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?

By Anil

అటుగా వెళ్లే విమానాలను, నౌకలను బెర్ముడా ట్రయాంగిల్ మింగేస్తూనే ఉంది. ఇది నిన్న మొన్నటి నిజం కాదు కొన్ని శతాబ్దాల కాలం నుండి ఇదే తంతు. అయితే ఎన్నో ఏళ్లుగా దీని అంతు చూసే పనిలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రాణాలకు తెగించి మరి దీని మిస్టరీని తేల్చాలనుకున్నారు, కాని విఫలం చెందారు. భూమి చుట్టూ ఒక నిర్ధిష్ట కక్ష్యలో తిరుగుతున్న అత్యాధునిక ఉపగ్రహాలు మరియు రాడార్ పరికరాలు వంటివి బెర్ముడా మిస్టరీ అంతు చూస్తున్నాయి.

ఈ సందర్భంలో, ఎన్నో సంవత్సరాలుగా విమానాలను మరియు ఓడలను పొట్టను పెట్టుకుంటున్న బెర్ముడా ట్రయాగింల్ యొక్క మిస్టరీని ఛేదించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. బెర్ముడా ట్రయాంగిల్‌ మిస్టరీ గురించి ఎన్నో ఏళ్లుగా ఉన్న పురాతన రహస్యాలను ప్రస్తుత అధ్యయనం ధ్వంసం చేయనుందని భావిస్తున్నారు.

బెర్ముడా ట్రయాగింల్

బెర్ముడా ట్రయాగింల్

ఉత్తర అట్లాంటిక్ ప్రాంతం, మియామి (ఉత్తర ఫ్లోరిడా) మరియు ప్యూర్టో రికాన్ సముద్ర ప్రాంతంలో 5 మిలియన్ చదరపు మైళ్ల విస్తీర్ణంలో గల ప్రమాదకరమైన ప్రాంతాన్ని బెర్ముడు ట్రయాంగిల్ అని పిలుస్తారు.

Picture credit: Alphaios/Wiki Commons

సముద్రపు దెయ్యం

సముద్రపు దెయ్యం

ఈ సముద్రంలోని ఈ ప్రాంతం మీదుగా వెళ్లిన ఎన్నో విమానాలు మరియు నౌకలు ఎవరికీ కనబడకుండా కనుమరుగయ్యాయి. ఈ జలమార్గం మీదుగా వెళ్లిన దాదాపు 40 నౌకలు మరియు 20 విమానాల వరకు అనుమానస్పద స్థితిలో కనుమరుగయ్యాయి. అందుకే ఈ బెర్ముడా ట్రయాగింల్‌‌ను సముద్రపు దెయ్యం అంటారు.

Picture credit: NASA/Wiki Commons

అయస్కాంతత్వం

అయస్కాంతత్వం

ఈ ప్రాంతంలో అయస్కాంతత్వం అనే బలం ఉండటం వలన అటుగా వెళ్లిన నౌకలను మరియు విమానాలను అత్యధిక బలంతో ఆకర్షించడం వలన ఇవి అదృశ్యం అయిపోతున్నాయి కొంత మంది కథనం. అయితే ఈ కథనాన్ని సమర్థిస్తూ ఎవరూ దీనిని ధ్రువీకరించలేదు. అప్పటి నుండి ఈ బెర్ముడా ట్రయాగింల్ మిస్టరీ అలాగే ఉండిపోయింది.

మొదటి ప్రమాదం

మొదటి ప్రమాదం

ప్రపంచంలో బెర్ముడా చరిత్రలో మొదటి సారిగా 1908 లో మొదటి ప్రమాదం జరిగింది. అయితే 1918 లో ఈ నౌక బెర్ముడా ట్రయాంగిల్‌లో ప్రమాదానికి గురైందని వెల్లడించారు. అమెరికాకు చెందిన యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే ఈ నౌక 306 మంది ప్రయాణికుల్ని మోసుకెళ్లినట్లు తెలుస్తోంది. కాని ఈ ప్రమాదం వెనుకున్న ఎటువంటి ఆధారాలు లభించలేదు.

Picture credit: Wiki Commons

విస్మయ పరిచే సంఘటనలు

విస్మయ పరిచే సంఘటనలు

1950 నుండి 1975 వరకు దాదాపుగా 428 నౌకలు మరియు బోట్లు వంటివి బెర్ముడా ట్రయాంగిల్‌లో అదృశ్యమైనట్లు సమాచారం వచ్చింది. దీనితో యావత్తు ప్రపంచం విస్మయానికి గురైంది. కాని దీని కన్నా ముందు 1945 ఒక సైనిక శిక్షణ విమానం బెర్ముడా ట్రయాంగిల్ మీదుగా వెళ్లినట్లు తెలిసింది. కాని వారిని వెతుక్కుంటూ వెళ్లిన ఇతర సిబ్బంది బెర్ముడా ట్రయాంగిల్ వద్ద వారు అదృశ్యం అయినట్లు సమాచారం ఇచ్చారు.

అతీంద్రియ శక్తి (super natural power)

అతీంద్రియ శక్తి (super natural power)

బెర్ముడా ప్రాంతంలో విమానాలు మరియు నౌకల ఉన్నట్లుండి అదృశ్య అవడానికి క్షుద్ర శక్తి కూడా కారణం అని వదంతులు వినిపించాయి. బెర్ముడా ట్రయాంగిల్ వీక్షించడానికి, దిక్సూచి ద్వారా ఖచ్చితమైన ప్రదేశాన్ని గర్తించడానికి ఆకస్మాత్తుగా వస్తున్న వెలుతురు ఎంతో ఆటంకం కలిగిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా సైన్సు పరికరాలకు సైతం ఈ బెర్ముడా రహస్యం అంతు చిక్కకపోవడంతో సైంటిస్టులు తలలు పట్టేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఉత్కంఠం

ప్రస్తుతం ఉత్కంఠం

ఆర్కిటిక్ యూనిర్శిటీ ఆఫ్ నార్వే ఈ బెర్ముడా ట్రయాంగిల్ క్రింది భాగంలో అనగా సముద్రలోపల భారీ గుంతలు ఉన్నట్లు తెలిపారు. నార్వే ఉత్తర సముద్ర గర్భంలో దాదాపుగా 800 మీటర్ల లోతు మరియు 150 అడుగల లోతులు గల గుంటలు ఉన్నట్లు తెలిపారు.

కారణం

కారణం

నార్వే సముద్ర భాగంలో మీథేన్‌ శిలాజ ఇంధనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఇవి సముద్ర లోపల గల వదులైన ప్రదేశంలో బయటకు వచ్చి పెద్ద పెద్ద పేళుల్లకు కారణం అయ్యాయి. అందువలన బెర్ముడా అనే ప్రాతంలో నీటి సాంద్రత తగ్గడం వలన అటుగా వెళ్లిన నౌకలు మునిగిపోతున్నాయని మరియు బెర్ముడా ట్రయాగింల్‌లో అధిక వేడి కారణం అటుగా వెల్లే విమానాలు కూలిపోతున్నట్లు తెలిసింది.

ఇప్పటికి నిర్ధారించలేకపోతున్నారు

ఇప్పటికి నిర్ధారించలేకపోతున్నారు

అతి త్వరలో ఈ తికమక పెడుతున్న బెర్ముడా ట్రయాంగిల్‌కు చెందిన మిస్టరీని తేల్చేయనున్నారు. వచ్చే నెలలో యురోపియన్ ఎర్త్ సైన్సెస్ వారు యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటిక్ సమక్షంలో సమావేశం నిర్వహించనున్నారు. అప్పుడు ఈ బెర్ముడా ట్రయాంగిల్ వెనుకున్న మిస్టరీని బయటపెట్టనున్నారు.

Picture credit: Alphaios/Wiki Commons

మరిన్ని ఆసక్తికరమైన విషయాలు గల అత్భుతమైన కథనాలు....
  • పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
  • మృదువైన పక్షి ఢీ కొంటె ఫతనమవుతున్న విమానాలు: అస్సలు దీని వెనకున్న మర్మం ఏమిటి?
  • భారతదేశపు సుదూర రైలు వివేక్ ఎక్స్ ప్రెస్ గురించి అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు
Most Read Articles

English summary
Has The Secret The Bermuda Triangle Finally Been Discovered
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more