ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కలిగిన మారుతి 800 అరుదైన కారు గురించి ఎప్పుడైనా విన్నారా?

మారుతి సుజుకీ 800 గురించి మీకు తెలుసా అని ఎవరినీ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కారు అంత ఫేమస్‌ మరి. కొనాళ్ల క్రితం వరకు ఎక్కువగా ఈ కార్లే భారత్‌లోని రోడ్లమీద కనిపించేవి. అయితే ఇవన్నీ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ కలిగిన కార్లు.. అయితే మారుతి 800 ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కలిగిన కారు గురించి విన్నారా.. ఎప్పుడైనా చూశారా అంటే.. చాలా తక్కువ మంది మాత్రమే అవును అంటారు.

మారుతి 800 ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కలిగిన కార్లను కూడా మారుతి సంస్థ తయారు చేసింది. ఇప్పుడంటే చాలా కార్లు ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్‌ను కలిగి ఉంటున్నాయి. అసలు ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ గురించి చాలా మందికి తెలియని సమయంలోనే ఆ కార్లను మారుతి తయారు చేసింది. అయితే ఆ కార్లన్ని ఇప్పుడేమయ్యాయి. మారుతి 800 ఆటోమేటిక్‌ కారు వీడియోను ఆటోలాగ్‌ ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఛానల్‌లో ప్రసారం చేసింది.

Maruti Suzuki 800 automatic gearbox variant

ప్రపంచ వ్యాప్తంగా ఆటోమేటిక్‌ కార్లకు డిమాండ్‌ పెరుగుతున్న సమయంలోనే మారుతి సుజుకి 800 ఆటోమేటిక్‌ కార్లను భారత్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. మరియు ఈ కార్లు పట్టణ ప్రాంతాల్లో మెరుగైన అనుభూతిని ఇస్తాయని నిరూపితం అయ్యాయి. మారుతి సుజుకి 800 మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ తరహాలోనే 3 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. కానీ తగినంత కస్టమర్‌ డిమాండ్‌, ఉత్పత్తి సమస్యల కారణంగా ఈ కార్ల తయారీ, విక్రయాలను మారుతి నిలిపివేసింది.

Maruti Suzuki 800 automatic gearbox variant

ఫలితంగా అరుదైన కారుగా మారుతి సుజుకి 800 (ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌) మిగిలిపోయింది. అయితే మొత్తం ఎన్ని ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ కలిగిన కార్లు విక్రయాలు జరిగాయి వంటి వివరాలను మారుతి ఎప్పుడూ వెల్లడించలేదు. ఈ కారు మారుతి సుజుకి 800 మాన్యువల్‌ వేరియంట్‌ మాదిరిగానే తయారు చేయబడ్డాయి. కానీ ఆటోమేటిక్‌ వేరియంట్‌ 0.8 లీటర్‌ ఇంజిన్‌తో 3 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండేది.

1983 సంవత్సరంలో మారుతి సుజుకి 800 భారత్‌లో తన కార్లను విడుదల చేసింది. ఈ కార్లు మధ్యతరగతి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. కేవలం చాలా తక్కువ సమయంలో ఎక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్న కారుగా మారుతి 800 నిలిచింది. మరియు కేవలం మూడేళ్లలోనే అప్‌గ్రేడ్‌ పొందింది.

మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ కార్లతో పోల్చితే చాలా తక్కువ సంఖ్యలోనే ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ వేరియంట్‌ కార్లు విడుదల అయ్యాయి. 1987 నుంచి 1992 వరకు మాత్రమే మారుతి సుజుకి 800 ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కార్లు అందుబాటులో ఉన్నాయని సమాచారం. ఇప్పటికి ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్ కార్లను కొంతమంది దగ్గర ఉన్నట్లు సమాచారం. అటువంటి కారు వీడియోనే ఇటీవల వెలుగులోకి వచ్చింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 26, 2023, 17:26 [IST]
English summary
Have you ever seen maruti suzuki 800 automatic gearbox variant car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+