మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా? అవి అలా వెంటపడటానికి గల కారణం ఏమైంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఇది చిన్న విషయమే అయినప్పటికీ, దీనికి వెనుక కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

పగటిపూట కానీ లేదా రాత్రిపూట కానీ రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు సదరు వాహనాలను కుక్కలు వెంబడిస్తూ ఉంటాయి. అయితే, అన్ని రకాల వాహనాలను కుక్కలు వెంబడించవు. కొన్ని ఎంపిక చేసిన రంగులు కలిగిన కార్లు లేదా టూవీలర్లను మాత్రమే అవి వెంబడిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలలో సదరు జంతువులు ప్రమాదంలో పడటమే కాకుండా, వాటి వలన వాహన చాలకులు కూడా ప్రమాదాల్లో పడుతుంటారు. ఈ సమస్య గ్రామాలు, నగరాలు అనే తారతమ్యం లేకుండా దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది.

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

సాధారణంగా, ఎవరైనా కొత్తవాళ్లు ఇంటికి వచ్చినా లేదా కుక్కలు తరచుగా తిరిగే ప్రాంతంలో కొత్తగా ఎవరైనా కనిపించా అవి గట్టిగా అరవడం చేస్తాయి. శునకాలు తరచూ గమనించే వారిని చూసి, వారిని నమ్మి వారి పట్ల విధేయంగా ఉంటాయి. అదే, కొత్త వారిని మొదటిసారిగా చూసినప్పుడు అవి వారిని త్వరగా నమ్మకపోగా, వారి వలన తమకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని మొరగడం లేదా వారిపై దాడి చేయడం చేస్తాయి. మరి, కుక్కలు ఎందుకు వాహనాలను వెంబడిస్తాయి?

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

కుక్కలు గుంపులుగా లేదా ఒంటరిగా వాహనాలను వెంబడించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. శునకం అంటేనే విశ్వాసానికి పెట్టింది పేరు. మీరు శునకానికి ఒక్కసారి భోజనం పెట్టినప్పటికీ, అవి వాటి జీవితాంతం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాయి. అయితే, కుక్కలు కొంత మందికి మాత్రమే చేరువగా మెలుగుతాయి, కొత్త వారిని లేదా కొత్త వాహనాలను చూసినప్పుడు ఆవేశంగా ముందుకు వస్తాయి. మనుషులను కుక్కలు గుర్తుపడుతాయి సరే, కానీ వాహనాలను ఎలా గుర్తు పడతాయనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా?

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

నిజమే, కుక్కులు వాహనాలను కూడా గుర్తు పడుతాయి. ఏదైనా వాహనం తమ ప్రాంతానికి చెందినది లేదా ఆ వాహనాన్ని తిరిగి గుర్తు పట్టుకోవాలని కుక్కులు భావించినట్లయితే, వాటి టైర్లపై అవి మూత్ర విసర్జన చేస్తాయి. అలా మూత్ర విసర్జన చేసిన వాసనను గుర్తు పట్టడం ద్వారా సదరు వాహనాలు సురక్షితమైనవిగా కుక్కలు భావిస్తాయని జంతు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వాహనం కొత్తగా కనిపించినా లేదా సదరు వాహనం తమ ప్రాంతానికి చెందినది కాదని కుక్కలు గుర్తించినా వెంటనే మొరగడం ప్రారంభిస్తాయి.

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

కొత్త వారిని చూసినప్పుడు శునకాలు ఏవిధంగానైతే మొరుగుతాయో, కొత్త వాహనాలను చూసినప్పుడు కూడా వాటి వలన తమకు మరియు తమ ప్రాంతంలోని వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ముందుగానే ఊహించి సదరు వాహనాలను వెంబడించడం ప్రారంభిస్తాయి. కుక్కలపై శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం, కుక్కలు కొన్నిసార్లు 'టైమ్ పాస్' కోసం కూడా వాహనాలను వెంబడించే అవకాశం ఉంది. కుక్కలు ఒంటరిగా అనిపించినప్పుడు లేదా 'పోరాటం' అనిపించినప్పుడు 'సమయం గడపడానికి' వాహనాలను వెంబడిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

ఇలా చేయడం వల్ల వాటికి నీరసం తొలగిపోయి, ఆనందంగా ఉంటాయని వారు అంటున్నారు. కుక్కలు వాహనాలను వెంబడించడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే, వాటికి వాహనాలు చేసే పెద్ద శబ్దాలు నచ్చకపోవడమట. వాహనాలు పెద్ద శబ్దాలు చేస్తూ ప్రయాణిస్తుంటే, కుక్కలు ఆ శబ్ధాలకు భయపడుతాయని, కాబట్టి ఈ భావం వలన కూడా కుక్కలు వాహనాలను వెంబడిస్తాయని చెబుతున్నారు. నిజానికి, శునకాల వినికిడి శక్తి చాలా గొప్పగా ఉంటుంది. మామూలు మనుషులు కూడా వినలేని శబ్దాలను కూడా కుక్కలు చాలా ఖచ్చితంగా వినగలవు.

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

కాబట్టి, వాహనాలు చేసే విపరీత ధ్వని వాటికి నచ్చకపోవడం వల్ల కూడా అవి వాహనాలను వెంబడించే అవకాశం ఉండవచ్చు. చక్రాల వేగం కూడా కుక్కల మానసిక స్థితిని దెబ్బతీస్తుందట. అంటే, వేగంగా లేదా గుండ్రంగా తిరుగుతున్న చక్రాలను చూసినప్పుడు కుక్కలు ఆకర్షితమై, విచిత్రంగా ప్రవర్తిస్తాయని చెబుతున్నారు. అలాంటి దృశ్యాన్ని చూసినప్పుడల్లా కుక్కలు కొన్నిసార్లు అది ఆడుకునే సమయంగా కూడా భావిస్తాయట. వాహనాలను వెంబడించడం అంటే కుక్కలకు బంతులు లేదా బొమ్మలతో ఆడుకోవడం లాంటిదని చెబుతుంటారు.

మీరు బైక్‌పై లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైనా కుక్కలు వెంబడించాయా..? దానికి కారణం ఎంటో తెలుసా..?

మరొక వినికిడి ప్రకారం, ఏదైనా ఓ రంగు వాహనం కలిగిన కారు లేదా టూవీలర్ వలన సదరు కుక్క కానీ లేదా దానికి సంబంధించిన ఇతర కుక్కలు కానీ ప్రమాదంలో గాయపడినా లేదా మరణించినా, ప్రతీకారంగా కూడా కుక్కలు సదరు వాహనాల వెంటపడుతుంటాయని చెబుతారు. ఏదేమైనప్పటికీ, ఇలా రోడ్డుపై వాహన చాలకులను కుక్కలు వెంబడించడం అనేది చాలా ప్రమాదకరమైన చర్య. ఈ చర్య వలన కుక్కలు మాత్రమే కాకుండా, రోడ్డపై వెళ్లే వారు కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 3, 2022, 9:17 [IST]
English summary
Have you ever wondered why do dogs chase vehicles on the road
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+