టీవీఎస్ ఫినిక్స్, మహేష్ టెలివిజన్ కమర్షియల్ (వీడియో)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసినదే. ఈ ఒప్పందంలో భాగంగా టీవీఎస్ అందిస్తున్న లేటెస్ట్ 125సీసీ మోటార్‌సైకిల్ 'టీవీఎస్ ఫినిక్స్' బైక్‌కు ఆయన ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్)గా వ్యవహరించనున్నారు. ఈ నేపథ్యంలో, కొత్త టీవీఎస్ ఫినిక్స్ బైక్‌తో మహేష్ బాబుపై రూపొందించిన టెలివిజన్ కమర్షియల్ ఈ మధ్యనే విడుదలయ్యింది.
ఈ ప్రకటనలో నాజర్, మహేష్ బాబు కనిపిస్తారు. టీవీఎస్ ఫినిక్స్ విశిష్టతల గురించి నాజర్ మహేష్ బాబుకు వివరిస్తుంటాడు. మరి ఆ ప్రకటనను మనం కూడా చూసేద్దామా..!
టీవీఎస్ ఫినిక్స్ గురించి..
టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన సంవత్సరం చివర్లో తమ 125సీసీ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్ 'ఫినిక్స్'ను బడ్జెట్ ధరకే, ఎగ్జిక్యూటివ్ రైడ్ కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకొని విడుదల చేసింది. ఇందులో 125సీసీ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుంది.

టీవీఎస్ ఫినిక్స్ - మహేష్ బాబు
తర్వాతి స్లైడ్‌లో వీడియోలను వీక్షించండి.
టీవీఎస్ ఫినిక్స్ - మహేష్ బాబు (వీడియో)
టీవీఎస్ ఫినిక్స్ - మహేష్ (ప్రోమో)
TVS Phoenix TVC
Spring Suspension TVC
Hazard Lamps TVC



Click it and Unblock the Notifications








