‘చదువు సారెడు బలపాలు దోసెడు' అన్నట్లుగా ట్రాఫిక్ ఫైన్.. స్కూటర్ ధర 80,000, జరిమానా రూ.1.61 లక్షలు!

"చారాణ కూరకు బారానా మసాలా" అనే సామెత మీరు వినే ఉంటారు. చిన్న దానికి ఎక్కువ ఖర్చు చేసిన సందర్భంలో దీన్ని వాడుతుంటారు. ఈ సామెత ఇప్పుడు ఓ స్కూటరిస్టుకు సరిగ్గా సరిపోయేలా మారింది. ఎందుకంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తికి భారీ ఫైన్ పడింది. ఇలా రూల్స్ ఫాలో కాకపోతే.. ఫైన్లు ఎదుర్కోవడం కామనే అయినా.. ఇక్కడ జరిమానా అమౌంట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అది పాపం... అతడి స్కూటర్ ధరను మించిపోయి ఉంది. ఈ ఫైన్ కట్టే డబ్బులతో అతను వేరే కొత్త స్కూటర్‌ను కొనేయొచ్చు. అసలింతకీ ఏం జరిగిందంటే..

భారత్ లోని చాలా మెట్రో నగరాల్లో సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఈ కెమెరాలు వెంటనే పసిగట్టుతాయి. ఉదాహరణకు.. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే.. ఈ సర్వైలెన్స్ కెమెరా గుర్తించి, రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ బైకుకు జరిమానా విధిస్తుంది.

Heavy Traffic Fine Scooter

అయితే.. చాలా మందికి ఈ సర్వైలెన్స్ కెమెరాల సంగతే తెలియదు. ట్రాఫిక్ పోలీసు లేకపోయినా పనిచేసే ఈ నిఘానేత్రాల గురించి తెలియక చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఫైన్ల బారిన పడుతున్నారు. ఎవరూ చూడట్లేదు కదా అని యథేచ్చగా రోడ్లుపై వెళుతూ కెమెరా కంటికి చిక్కుతున్నారు.

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి... ఇలాంటి సమస్యను ఎదుర్కొని జరిమానాల భారం మోశాడు. కథనాల ప్రకారం... పెరియసామి అనే వ్యక్తి సహా అతని కజిన్ సందీప్ ఈ స్కూటర్ ను చాలా రోజుల నుంచి వినియోగిస్తున్నారు. ఈ స్కూటర్‌ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. దీంతో ఓనర్‌ షాక్‌లో ఉన్నారు.

Heavy Traffic Fine Scooter

వీళ్లు వాడుతున్న స్కూటర్.. యమహా ఫెసినో మోడల్. వాళ్లు ఈ స్కూటర్ వాడుతున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ చాలా సార్లు ఉల్లంఘించారు. ఈ కారణంగా మొత్తం జరిమానా రూ.1.61 లక్షలకు చేరింది. ఈ విషయం వాళ్లకు ఇటీవలే తెలియడంతో ఇది చూసి నోరెళ్లబెట్టారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఈ జరిమానా మొత్తం తెలుసుకుని ఆ ఇద్దరు వ్యక్తులు కంగుతిన్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ స్కూటర్ మార్కెట్ విలువ రూ.80 వేలుగా ఉంది. జరిమానా మొత్తం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో.. ఈ స్కూటర్‌ను పోలీసు శాఖ వాళ్లు సీజ్ చేశారు. దీంతో ఓనర్‌ నివ్వెర పోయాడు.

ఈ ఫైన్ అమౌంట్ ఇంత మొత్తంలో ఉన్నప్పటికీ కూడా.. వాళ్లు దీన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, ఇది చెల్లించడానికి తమకు మరింత సమయం కావాలని కోరుతున్నారు. అయితే పోలీసు అధికారులు దీన్ని చెల్లించలేదు. చివరికి మీడియా కథనాల ప్రకారం.. పెరియసామి, సుదీప్ ఈ జరిమానా మొత్తం చెల్లించి, తమ స్కూటర్‌ను తిరిగి తెచ్చుకున్నారని సమాచారం.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఈ కథనంలోని ఇద్దరు వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే.. ఈ సమస్య రాకుండా ఉండేది. లేదా వాళ్లు కనీసం ఆ రూల్స్‌పై అవగాహన ఉన్నా ఈ ఫైన్ భారం ఎదుర్కోకపోయేవారు. వాళ్లకు ఈ విషయం కాస్త ముందుగా తెలిసినా వాళ్లు ఎప్పుడో ఒకప్పుడు తమ పద్ధతి మార్చుకునేవారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, February 7, 2025, 7:20 [IST]
English summary
Heavy traffic fine scooter more than its original price shocked owner
Read more on: #offbeat #fine #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+