ట్రాఫిక్‌ రద్దీతో గందరగోళంలో పడిన ADAS టెక్నాలజీ.. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.!!

భారత మార్కెట్లో ఇప్పుడు ADAS(Advanced Driver Assistance Systems) టెక్నాలజీ ఉన్న కార్లు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. మొదటగా MG గ్లోస్టర్‌.. ఈ టెక్నాలజీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత చాలా మంది కార్ల తయారీదారులు తమ ప్రీమియం మోడల్‌ కార్లలో అడాస్‌ ఫీచర్‌ను అందించడం ప్రారంభించారు. అయితే ఈ ఫీచర్‌ ఆఫ్టర్‌ మార్కెట్లో కూడా దొరుకుతుంది.

సాధారణంగా కార్ కంపెనీలు తమ ఎస్‌యూవీలలో అందించే ADAS ఫీచర్‌కు ఆఫ్టర్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేసే ADAS ఫీచర్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. కంపెనీ అందించే డ్యాష్‌క్యామ్‌ ఎక్కువ కాలం సజావుగా పనిచేస్తుంది. కానీ ఆఫ్టర్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేసేది అంత నాణ్యతగా ఉండదు. అందుకు సంబంధించి ఓ ఉదాహరణ ఇక్కడ ఉంది.

ADAS-Technology-Indian-Traffic

"కార్స్‌ఇండియా " Redditలో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు. ట్రాఫిక్‌ రద్దీ ఉన్న రోడ్డుపై ఓ కారు వెళ్లడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ కారులో అమర్చబడిన 70 mai డాష్‌క్యామ్(Dash Cam) ఎలా విచిత్రంగా పనిచేస్తుందో చూడవచ్చు. కాగా డ్యాష్‌క్యామ్‌ పాదచారుల హెచ్చరికను చూపిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు.

అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. డ్యాష్‌క్యామ్‌లోని ADAS ఫీచర్‌ కేవలం పాదచారులను మాత్రమే కాకుండా.. కారుకు అడ్డంగా, ముందుకు వెళ్తున్న వాహనాలను కూడా పాదచారులుగా చూపిస్తోంది. దీని ద్వారా ఈ సిస్టమ్‌ వాహనాలను(ADAS In Indian Traffic) సరిగా గుర్తించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో పదే పదే హెచ్చరికలు జారీ చేస్తోంది.

ADAS-Technology-Indian-Traffic

అంతే కాకుండా ఆ కారు చుట్టూ ఉన్న ఇతర వాహనాల వేగాన్ని కూడా అస్థిరంగా చూపిస్తోంది. ఈ పోస్ట్‌ పట్ల నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో క్లిప్‌ను చూసి కొందరు వీడియో గేమ్‌ ఫుటేజ్‌ అని వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు భారత ట్రాఫిక్‌ పరిస్థితుల నేపథ్యంలో ADAS పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే భారత మార్కెట్‌లోని కార్లలో అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థల (ADAS) వినియోగం మరియు ఖచ్చితత్వంపై చాలా సందేహాలు నెలకొన్నాయి. కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగినట్లుగా కూడా సమాచారం. ADAS లోని అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు లేన్ చేంజ్ అసిస్ట్ వంటి సిస్టమ్‌ల ద్వారా హైవేపై డ్రైవ్‌ చేసేవారికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. దీని ద్వారా డ్రైవింగ్‌ అలసట తగ్గిపోతుంది.

ADAS-Technology-Indian-Traffic

అయితే చాలా మంది వ్యక్తులు ADASని దుర్వినియోగం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా హైవేపై హై స్పీడ్‌లో డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు.. స్టీరింగ్‌ వీల్, యాక్సిలరేట్‌ర్‌ను వదిలేసి సోషల్‌ మీడియాలో రీల్స్‌ కోసం విచ్చలవిడిగా నడుపుతున్నారు. దీని ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. సాధారణంగా ADAS రాడార్‌, కెమెరా సెన్సార్ల ఆధారంగా పనిచేస్తూ.. డ్రైవర్‌లకు దోహదపడుతుంది.

ఈ క్రమంలో కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. ADASని యాక్టివేట్ చేసి, ఆ తర్వాత కారులో గేమ్స్ ఆడటం, తినడం లేదా నిద్రపోవడం వంటి విచిత్ర పనులు చేస్తున్నారు. ఇలా చేయడం వారికి మాత్రమే కాకుండా ఇతర వాహనదారులకూ హాని కలిగిస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

కాగా భారత మార్కెట్లో కార్ల తయారీదారులు లెవెల్-1 మరియు లెవెల్-2 ADAS ఫంక్షన్‌లను ప్రవేశపడుతున్నారు. ఇది కారులోని కొన్ని భాగాలను ఆటోమేటిక్‌గా కంట్రోల్‌ చేస్తుంది. దీని ద్వారా సురక్షిత డ్రైవింగ్‌, సౌకర్యవంతమైన ప్రయాణానికి దోహదపడుతుంది. ఇలాంటి సిస్టమ్‌ను వాహనదారులు దుర్వినియోగం చేయకూడదని గమనించాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 3, 2024, 16:55 [IST]
English summary
Heavy traffic in india confused adas technology in cars here is a video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+