రోడ్డుపై ల్యాండ్ అయిన హెలికాప్టర్.. నవ్వు తెెప్పిస్తున్న నెటిజన్ల కామెంట్స్

గాల్లో విమానం లేదా హెలికాప్టర్ వెళుతున్నప్పుడు అది కనుమరుగయ్యేంత వరకూ అలాగే చూస్తూ ఉండిపోతాం. ఎందుకంటే ఫ్లైట్‌ను చూడాలంటే ఎయిర్ పోర్టులోనే చూసే అవకాశం ఉంది. లేదంటే ఎవరైనా వీఐపీలు ఏదైనా ప్రాంతానికి హెలీకాప్టర్లో వచ్చినప్పుడు చూసే అవకాశం కలుగుతుంది. కానీ ఎక్కడైనా రోడ్డుపై ఆగడం చూశారా..

హెలికాప్టర్ రోడ్డుపై ఆగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ.. ఇది అక్షరాలా నిజం. అసలే రద్దీ రోడ్డు.. ఆపై హడావుడిగా ఆఫీసులు లేదా ఇతర పనుల మీద వెళ్లే జనం.. ఇలాంటి పరిస్థితుల్లో హెలీకాప్టర్ వారి వాహనాలకు అడ్డంగా ఆగితే.. ఫస్ట్ అబ్బా ఏంటిది.. అని విసుక్కోవడం మానేసి.. అరె ఏంటిది.. అని ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా..

Helicopter-Parked-On-Road

దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం ముందే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఇక ట్రాఫిక్‌లో చుక్కలు చూడాల్సిందే.. ఇక బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలా రోడ్డుపై హెలికాప్టర్ ఆగిన సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. బెంగళూరు నగరంలో రోడ్డు నిత్యం ట్రాఫిక్‌తో రద్దీ ఉంటుంది. అసలే వాహనదారులు హడావుడిగా వెళ్తుండగా సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కన అక్కడ హెలికాప్టర్ ఆగింది. అసలే ట్రాఫిక్‌కి కేరాఫ్‌గా నిలిచే బెంగళూరులో రోడ్డుపై హెలికాప్టర్ ఆగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ ఫొటో, వీడియోను X(ట్విట్టర్)లో షేర్ చేశారు. ఈస్ట్ బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు ఫొటో ద్వారా తెలుస్తోంది. కాగా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

రోడ్డు పక్కన హెలికాప్టర్ ఆగడంతో వాహనదారులు తమ వాహనాలను ఆపి వింతగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు వింత క్యాప్షన్ ఇచ్చారు. బెంగళూరు ట్రాఫిక్‌కు కొత్త మార్గం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో నెటిజన్ల ఫన్నీ కామెంట్లతో ఈ పోస్ట్ ట్రెండింగ్‌గా మారింది.

ఈ ట్వీట‌్‌పై నెటిజన్లు చేసిన కామెంట్లు నవ్వు తెప్పిస్తున్నాయి. ఆఫీసుకి ఎందుకు లేట్ అయిందని బాస్ అడిగితే.. ఓ పక్షి రోడ్డు దాటుతోంది అందుకే ఆలస్యమైందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాంటివి రోడ్డుపై ఉంటే నేనసలు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని పట్టించుకోనని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

హెలికాప్టర్ హెచ్ఏఎల్ దగ్గర ఆగడంతో అక్కడ పనిచేసేవారు లోపలికి వెళ్లకుండా ఇదో సాకుగా చెప్పవచ్చని మరో నెటిజన్ ఫన్నీగా స్పందించారు. మరొకరు ఇది మాల్దీవుల డిఫెన్స్ హెలికాప్టర్ అని.. బెంగళూరు రోడ్డుపై ఎందుకు నిలిపారని కామెంట్ చేశారు. ఇలా విభిన్న రకాలుగా స్పందించారు.

కాగా X లో ఈ ట్వీట్‌కు 21 వేల వ్యూస్ వచ్చాయి. చాలా మంది దీనిని రీపోస్ట్ చేశారు. ఏదేమైనా ఇలా నిత్యం ట్రాఫిక‌్‌తో రద్దీగా ఉండే బెంగళూరు నగరంలో ఇలా రోడ్డు పక్కన హెలికాప్టర్ ఆగడంతో.. వారికి కొంత ఆలస్యమైనా కాసేపు వారికి ఆ సీన‌్‌తో వాహనదారులతో పాటు నెటిజన్లకు ఆటవిడుపుగా ఉందని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, September 9, 2023, 13:14 [IST]
English summary
Helicopter parked on bengaluru road halts traffic funny reactions from netizens
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+