యాత్రికులను వణికించిన హెలికాఫ్టర్.. వీడియో చూస్తే షాకవుతారు!

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్న భక్తులలో కొంత మంది నడవలేక ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారు. కొందరు జంతువులపై వెళ్తుంటే.. మరి కొందరు హెలికాఫ్టర్ల ద్వారా గమ్యాలను చేరుకుంటారు. ఇటీవల భక్తులను తీసుకెళ్లే ఓ హెలికాఫ్టర్ కంట్రోల్ తప్పి అందరిని ఒక్క సారిగా భయభ్రాంతుల్ని చేసింది.

ఉత్తర భారతదేశంలోని మంచు కొండల్లో పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర కొనసాగుతోంది. భక్తుల సంఖ్య గతంలో కంటే ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో హెలికాఫ్టర్ ఘటన భక్తులందరిని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఫైలెట్ చాకచక్యంగా హెలికాఫ్టర్ కంట్రోల్ చేయడంతో ముప్పు తప్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Helicopter Tailspin Makes Emergency Landing

శుక్రవారం తెల్లవారు జామున సిర్సీ హెలిప్యాడ్ నుంచి కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ బయలుదేరింది. ఆ సమయంలో అందులో యాత్రికులతో సహా మొత్తం 7 మంది ఉన్నారు. గమ్యాన్ని చేరుకునే సమయంలో హెలికాఫ్టర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల అది హెలిప్యాడ్‌లో ల్యాండ్ కాలేకపోయింది. గాలిలోనే గింగిరాలు తిరుగుతూ అక్కడివారిని భయానికి గురి చేసింది. అయితే ఈ సమయంలో ఫైలెట్ ఎంతో నేర్పుగా హెలికాఫ్టర్‌ను ల్యాండింగ్ చేశారు.

హెలికాఫ్టర్ గాలిలో చక్కర్లు కొడుతున్న సమయంలో ఫైలెట్ దానిని హెలిప్యాడ్‌కు వంద మీటర్ల దూరంలో ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ చేసే సమయంలో హెలికాఫ్టర్ వెనుక భాగం నేలను తాకింది. అయితే లోపలున్న వారికి ఎవరికి ఏ హాని జరగలేదు. అందరూ సురక్షితంగా బయటపడగలిగారు. ఈ ఘటన అక్కడున్నవారిని భయాన్ని కలిగించింది. దీంతో అక్కడున్న వారు అరుపులు కేకలతో గగ్గోలు పెట్టారు.

Helicopter Tailspin Makes Emergency Landing

నిజానికి హెలికాఫ్టర్‌లలో అప్పుడప్పుడు సాంకేతిక లోపాలు ఏర్పడతాయి. అయితే వాటిని ప్రయాణానికి బయలుదేరే ముందు గమనించి పరిష్కరించుకోవాలి. లేకుంటే ప్రయాణికుల ప్రాణాలు గాలిలోనే కలిసిపోతాయి. ఒకవేళా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా టెక్నీకల్ ఈజీయే అనిపిస్తే.. ఫైలెట్ ఏ మాత్రం గాబరా పడకుండా దాన్ని పరిష్కరించడానికి సిద్ధమవ్వాలి. ఆ సమయంలో ఏ మాత్రం ఒత్తిడికి లోనైనా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

పెరిగిన భక్తుల సంఖ్య

చాలామంది పరమ పవిత్రంగా భావించే చార్‌ధామ్‌కు ఈ ఏట భక్తుల తాకిడి ఎక్కువైంది. మంచు తగ్గినా తరువాత హిమాలయాల్లోని దేవాలయాలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. కేదార్‌నాథ్, యమునోత్రి, బద్రీనాథ్ మరియు గంగోత్రి సందర్శనల కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు ముందుగానే యాత్ర కోసం సన్నద్ధమవుతారు. చలి కాలం మొదలైతే.. మళ్ళీ ఈ దేవాలయాలు మూతపడతాయి. చలికాలం తీరేవరకు మళ్ళీ దేవాలయాల దర్శనం సాధ్యం కాదు.

చార్‌ధామ్‌ యాత్ర

మే ప్రారంభంలో చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది. కఠినమైన మార్గాల్లో చార్‌ధామ్‌ యాత్ర చేయాల్సి ఉంటుంది. వాహనాల సదుపాయం ఉండదు. కాబట్టి భక్తులు చాలా జాగ్రత్తగా యాత్రను ముగించాల్సి ఉంటుంది. అయితే అందమైన హిమాలయాల్లో సాగే యాత్ర మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చార్‌ధామ్‌ యాత్ర చేయాలని, ఆ అనుభూతి పొందాలని ఆశిస్తుంటారు. అది కొందరికే సాధ్యమవుతుంది. మరికొందరికి అనేక కారణాల వల్ల సాధ్యం కాకపోవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, May 25, 2024, 12:18 [IST]
English summary
Helicopter tailspin makes emergency landing in kedarnath
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+