helmet man of india కోట్లల్లో ఒక్కడు.. హెల్మెట్స్ పంపిణీ కోసం సొంత ఇళ్లునే అమ్మేశాడు.. నెటిజన్లు ఫిదా..!
సాధారణంగా కొందరు చేసే సాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలానే కొందరు నిర్వీరామంగా సేవా చేస్తు ఉంటారు. వారికి గుర్తింపు వచ్చినా రాకపోయినా వారి సేవను అలానే కొనసాగిస్తారు. అలాంటి వారు చేసే సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. తాజాగా ఓ వ్యక్తి చేసిన సామాజిక సేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
'హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరుపొందిన బీహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్ చాలా ఫేమస్. తొమ్మిదేళ్ల క్రితం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై తన బైక్‌ను వెనుక నుంచి ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదంలో అతని రూమ్‌మేట్, అత్యంత సన్నిహితుడు మరణించడంతో ఉచిత హెల్మెట్‌లను పంపిణీ చేసే మిషన్‌ను చేపట్టారు.

నిస్వార్థ సేవా..
ప్రమాదాల కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాడు. తాజాగా అతను హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందాడు. తాజాగా అతను ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మోటర్‌సైకిలిస్ట్‌లకు ఉచితంగా హెల్మెట్ అందిస్తుండగా ఓ వ్యక్తి తీసిన వీడియో గత నెలలో వైరల్‌గా మారింది. అతని నిస్వార్థ సేవకు నెటిజన్ల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రమాదం ఎక్కడి నుంచి అయిన పొంచి వచ్చే అవకాశం ఉంటుందని రాఘవేంద్ర ధృడంగా విశ్వసిస్తాడు. అయితే తాను కారులో ప్రయాణించే సమయంలో కూడా హెల్మెట్ ధరించి వెళ్లడం అతనికి అలవాటు. తన కారును లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై నడుపుతున్న వీడియో గతంలో చూడవచ్చు. హెల్మెట్ లేకుండా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళుతున్న మోటర్‌సైకిలిస్ట్ లను ఆపి వారికి హెల్మెట్ లను అందజేసిన సందర్భాలు గతంలో చాలా చేశాడు.
ముందు తన కారునుని నిలిపి ఎవరైన హెల్మెట్ లేకుండా వస్తే ఆ రైడర్లను ఆపి ఉచితంగా హెల్మెట్ లను ఇస్తాడు. అంతే కాకుండా హెల్మెట్ ధరించడం వల్ల కలిగే సురక్షిత ప్రయోజనాల గురించి వారికి వివరిస్తాడు. ఇలా రాఘవేంద్ర చేస్తున్న పనికి పలువురి నుంచి దేశవ్యాప్తంగా మన్ననలను పొందుతున్నాడు. ఇతను చేస్తున్న సామాజికి సేవకు నెట్టింట్లో ఎనలేని ప్రశంసల్నీ అందుకుంటున్నాడు.

56,000 హెల్మెట్ ల పంపిణీ..
రాఘవేంద్ర కుమార్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56,000 హెల్మెట్‌లను పంపిణీ చేశారు, అయితే, అతను ఇప్పుడు తను ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. హెల్మెట్‌లను అందించే ప్రయత్నంలో, అతను తన గ్రేటర్ నోయిడాలోని అపార్ట్‌మెంట్‌ను అమ్మేశాడు. అంతేకాకుండా ఈ మహత్తర కార్యక్రమం కోసం తన భార్య నగలను తాకట్టు పెట్టి రుణం కూడా తీసుకున్నాడు.
తనకు వస్తున్న ప్రశంసలపై స్పందించిన రాఘవేంద్ర మొదట్లో తనను పిచ్చివాడు అని పిలిచేవారని తెలిపాడు. కానీ నేను రహదారి భద్రత కోసం నా ప్రయత్నంలో కొనసాగాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు. రాబోయే కొద్ది వారాల్లో, నేను హెల్మెట్ కొనుగోలు ఖర్చును భరించలేనందున నేను బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని నా పూర్వీకుల గ్రామమైన భదరీకి తిరిగి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.

ఎన్ని కష్టాలొచ్చిన సేవా కొనసాగిస్తా..
ఈ సేవ చేస్తూనే ఏకకాలంలో పోషిస్తున్నట్లు చెప్పారు. తనకు ఆరేళ్ల కొడుకు (అన్ష్ సింగ్) ఉన్నాడు. అతనిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. ఖర్చు తగ్గించే చర్యగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏ స్థాయిలో ఉన్నా హెల్మెట్‌లు పంపిణీ కొనసాగిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. మీ వంతుగా కూడా హెల్మెట్ లు పంపిణీ చేస్తూ ప్రాణాలను కాపాడండి అంటూ సూచించాడు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎంచుకోక ముందు అనేక బహుళజాతి కంపెనీలకు న్యాయ సలహాదారుగా రాఘవేంద్ర పనిచేశాడు.
రాఘవేంద్ర చేస్తున్న సేవను గుర్తించిన భారత ప్రభుత్వ రోడ్డు రవాణా & హైవేల మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. అలాగే సామాజిక సేవా హీరో సోనూ సూద్‌తో సహా ఇతర ప్రముఖులు రాఘవేంద్ర చేస్తున్న సేవను కొనియాడారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని వారిని ప్రోత్సాహించే భాద్యత మన అందరిపై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇతని సేవకు గుర్తుగా తమ వంతు సాయం చేస్తామని ముందుకువస్తున్నారు.


Click it and Unblock the Notifications








