ప్రమాదానికి గురైన హేమామాలిని కారు : నాలుగేళ్ల చిన్నారి మృతి
సినీనటి, భాజపా పార్లమెంట్ సభ్యురాలు హేమామాలిని కారు ప్రమాదానికి గురైంది. దీంతో నాలుగేళ్ల చిన్నారి సోనమ్ మృతి చెందింది.
మరిన్ని విషయాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం........

ఈ రోడ్డు ప్రమాదం ఆమె నియోజకవర్గం మధుర నుంచి రాజస్థాన్ రాజధాని జయపూర్‌కు వెళ్తుండగా జరిగింది.

గురువారం రాత్రి 9 గంటలకు జయపూర్‌కు సమీపంలోని దౌసా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న మెర్సెడెస్ కారు ఎదురుగా వస్తున్న మారుతి ఆల్టోను ఢీకొంది.

ప్రమాదంలో హేమామాలినికి కూడా గాయాలయ్యాయి. ఆమె కుడికంటి పైన నుదురు భాగంలో గాయమైంది.

ఆమెను జయపూర్‌లోని ఫోర్టిన్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు.

ప్రమాద సమయంలో ఆల్టోకారులో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వారిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై స్పస్టతరావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








