రైలు కదిలేముందు జర్క్‌ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!

రైలు ప్రయాణమంటే చాలా మందికి సరదా ఉంటుంది. సుదూర ప్రయాణంలో ప్రశాంతమైన జర్నీని ఆస్వాదిస్తుంటారు. అయితే కొంత మంది రైలు ప్రయాణంలో చాలా విషయాలను గమనిస్తుంటారు.. అందులో ఒకటి రైలు స్టార్ట్ అవగానే ఒక్కసారిగా చిన్న జర్క్ లాంటిది వస్తుంది. స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన ప్రతిసారీ ఈ కుదుపు ఏర్పడుతుంది. అయితే ఇలా ఎందుకు కలుగుతుందో ఎప్పుడైనా గమనించారా.??

భారత్‌లో అతి పెద్ద రవాణా వ్యవస్థ.. రైల్వే రంగం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా విస్తృతమైన రైల్వే కనెక్టివిటీ ఉంది. తక్కువ ధరలో సుదూర ప్రయాణం అందిస్తుండటంతో.. చాలా మందికి రైల్లో ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇక రాత్రి సమయాల్లో రైల్వే ప్రయాణాలు కూడా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటాయి.

Jerk-In-Train-While-Starting-Engine

అయితే రైలు రైలు ప్రయాణంలో అందరూ ఈ అనుభూతి(Jerk In Train)కి మాత్రం ఖచ్చితంగా లోనై ఉంటారు. అదేంటంటే.. రైలు స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు అకస్మాత్తుగా జర్క్‌ వస్తుంది. దీని వెనుక కొన్ని సైంటిఫిక్‌ కారణాలున్నాయి. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మీకు రైలులోని కప్లింగ్ సిస్టమ్స్ గురించి తెలియాలి.

కప్లింగ్‌ సిస్టమ్‌ అంటే.. రైల్లోని ఓ కోచ్‌ను(Train Coupling System)ని మరో కోచ్‌తో కలిపే భాగాన్ని కప్లింగ్‌ అంటారు. భారతీయ రైల్వేలో మొత్తం రెండు రకాల కప్లింగ్ సిస్టమ్‌లు ఉన్నాయి. చెన్నై ICF ప్లాంట్‌లో తయారు చేయబడిన అన్ని కోచ్‌లు స్క్రూ కప్లింగ్‌తో రూపొందిస్తారు. అంటే అన్ని లైట్ వెయిట్ LHB కోచ్‌లలో CBC కప్లింగ్ ఉంటుంది.

Jerk-In-Train-While-Starting-Engine

సాధారణంగా రైలు కోచ్‌లను ఒకచోట ఉంచడానికి ఇలా కలపడం చాలా ముఖ్యం. ఇలా కలిపే క్రమంలో టెక్నాలజీని జత చేసిన చోట చిన్న ఖాళీని కలిగి ఉంటుంది. ఈ ఖాళీ ప్లేస్‌ ద్వారా.. రైలు ఆగి ఉన్నప్పుడు ఈ కప్లింగ్‌ల మధ్య గ్యాప్ తగ్గుతుంది. అయితే రైలు ఇంజిన్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కో కోచ్‌ను లాగుతుంది. రైళ్లను ఇలా లాగుతునప్పుడు, ఈ గ్యాప్‌.. కుదుపునకు కారణం అవుతుంది.

కాగా చెన్నై ఐసీఎఫ్ ప్లాంట్‌లో తయారైన కోచ్‌లలో ఉపయోగించే స్క్రూ టైప్ కప్లింగ్స్‌కు ఎక్కువ స్థలం ఉంటుంది. దీని వల్ల ఆ కోచ్‌లలో ప్రయాణించేటప్పుడు మరింత జర్క్‌ ఏర్పడుతుంది. LHB కోచ్‌లలో ఉపయోగించే CBC కప్లింగ్‌లు తక్కువ ఖాళీని కలిగి ఉండటం వల్ల.. ఆ కోచ్‌లలో కుదుపు తక్కువగా ఉంటుంది.

Jerk-In-Train-While-Starting-Engine

అందుకే ఈ కారణంగా, రైలు ఇంజిన్‌ను వేగంగా ప్రారంభించవద్దని ఇంకా.. కొన్ని కిలోమీటర్ల వరకు అతి వేగంగా వెళ్లవద్దని రైలు డ్రైవర్లకు సూచిస్తారు. ఈ సమయంలోనే కప్లింగ్స్ మధ్య గ్యాప్ తగ్గి కుదుపు రావడంతో రైలు ఇంజిన్ తన ప్రయాణాన్ని నిదానంగా ప్రారంభించడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగదు.

Jerk-In-Train-While-Starting-Engine

అయితే, కొన్నిసార్లు రైలు లోకో పైలట్లు ఓవర్ రైడ్ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో రైలులోని ప్రయాణికులు తీవ్ర జర్క్‌ను ఫీలవుతారు. కాగా కొంతమంది అనుభవజ్ఞులైన లోకోపైలట్లు హ్యాండిల్‌ చేసే విధానం ద్వారా.. ఈ కుదుపు అంతగా తెలియదు. ఇలా రైలుకు సంబంధించి ప్రతి విషయంలోనూ మనకు తెలియని ఎన్నో సైంటిఫికల్‌ కారణాలుంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, March 18, 2024, 18:30 [IST]
English summary
Here are the reasons behind jerk in train while starting engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+