ప్రపంచంలోనే అతి పొడవైన స్కూటర్..!!

వృత్తి రీత్యా ప్లంబర్ అయిన ఫర్జ్ తమ ప్లంబర్ పనితనాన్ని ఈ స్కూటర్‌పై ప్రయోగించి మరీ దీనిని రూపొందించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకునేందుకు కోసం ఫర్జ్ ఈ పొడవైన స్కూటర్‌ను ఎలాంటి యంత్రాలు ఉపయోగించకుండా చేతుల్తోనే రూపొందించాడు.
మరి ఈ స్కూటర్ ఇంజన్ ఏ 1,000 సీసీ ఇంజనో లేక అంతకన్నా ఎక్కువో అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. కేవలం 125 సీసీ ఇంజన్ కలిగిన స్కూటర్‌నే ఫర్జ్ ఇలా తీర్చిదిద్దాడు. అంతేకాదు 25 మంది ప్రయాణికులను తన స్కూటర్‌పై ఎక్కించుకొని షికార్లు కూడా చేశాడు.
ఒక 125 సీసీ స్కూటర్‌ను మధ్యభాగానికి కట్ చేసి, ఈ రెండు భాగాలకు మధ్యలో 23 మంది కూర్చునే విధంగా అల్యూమినియం ఫ్రేమ్‌తో దీని బాడీని డిజైన్ చేశాడు. మరి కేవలం 9 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే విడుదల చేసే ఓ 125 సీసీ స్కూటర్ 25 మంది బరువును మోస్తూ ప్రయాణించడమంటే ఆశ్చర్యకరమైన విషయమే.
ఫర్జ్ అంత మందిని కూర్చోబెట్టుకొని దాదాపు 100 మీటర్ల దూరం ప్రయాణించి చూపించి విమర్శకుల చేత ఔరా అనిపించుకున్నాడు. అయితే ఈ స్కూటర్‌ను టర్నింగ్ చేయాలంటే మాత్రం కనీసం సిక్స్-లేన్ రోడ్ అయినా కావాల్సిందే..! కోలిన్ ఫర్జ్ ఈ వీడియోను గిన్నిస్ బుక్ వారికి పంపించాడు. ఇతని వద్ద ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబిలిటీ స్కూటర్‌ను రూపొందించిన రికార్డు కూడా ఉంది.


Click it and Unblock the Notifications








