వీడియో: దుబాయ్ పోలీసుల సూపర్ లగ్జరీ కార్ కలెక్షన్

By Ravi

ఆయిల్ రిచ్ కంట్రీగా పేరొందిన దుబాయ్‌లో డబ్బుకు కొదవే లేదు. అక్కడి ధనవంతుల వద్ద ఎలా ఖర్చు పెట్టాలో తెలియంత డబ్బు ఉందన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది ధనికులు అత్యంత ఖరీదైన, విలాసవంతమైన లగ్జరీ కార్లను, సూపర్ కార్లను కొనుగోలు చేస్తుంటారు. కేవలం ధనిక వ్యక్తులే, అక్కడి పోలీసులు కూడా సూపర్ లగ్జరీ కార్లను వాడుతుంటారు.

ఇప్పటికే దుబాయ్ పోలీసుల వద్ద అనేక రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే బుగాటి వేరాన్‌తో అనేక రకాల సూపర్ లగ్జరీ కార్లు వారి కలెక్షన్‌లో ఉన్నాయి. ఈ కార్లన్నింటినీ భద్రపరచేందుకు ఓ పెద్ద గ్యారేజ్ కూడా ఉంది. ఇప్పుడు దుబాయ్ పోలీసులు తమ వద్ద ఉన్న సూపర్ లగ్జరీ కార్ కలెక్షన్‌ను పబ్లిక్‌కు చూపించడానికి అంగీకరించింది.

Dubai Police Supercar Fleet

దుబాయ్ పోలీసుల వద్ద మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి, ఆస్టన్ మార్టిన్ వన్-77, లాంబోర్గినీ అవెంటేడర్, ఆడి ఆర్8, ఫెరారీ ఎఫ్ఎఫ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్, బెంట్లీ కాంటినెంటల్, నిస్సాన్ జిటి-ఆర్, ఫోర్డ్ మస్టాంగ్, బిఎమ్‌డబ్ల్యూ ఎమ్6 గ్రాన్ కూపే, బార్బస్ బి63ఎస్-700 వైడ్‌స్టార్, షెవర్లే కమారో, మెర్సిడెస్ ఎస్ఎల్ 63 ఏఎమ్‌జి, రెనో ట్విజీ మొదలైన ఎగ్జోటిక్ కార్లున్నాయి.

ఈనాటి మన వీడియోలో దుబాయ్ పోలీసులు తమ లగ్జరీ కార్లను ప్రదర్శించడాన్ని చూడొచ్చు. అంతేకాదు, సీనియర్ పోలీసు అధికారులు ఆయా కార్ల గురించి వివరించడాన్ని కూడా ఇందులో చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు మనం కూడా ఆ వీడియోని చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/tjPUGMJ86E0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Saturday, June 7, 2014, 10:58 [IST]
English summary
World's fastest police car fleet exists for a reason. Dubai police supercar fleet, here's why it exists. Take a look at the world's most expensive police car fleet.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+