హీరో అజిత్‌కు యాక్సిడెంట్.. నుజ్జు నుజ్జు అయిన కారు ముందు భాగం.. వైరల్ అవుతున్న ప్రమాదం వీడియో
హీరో అజిత్ కుమార్‌కు కార్లు, బైకులన్న చాలా ఇష్టం అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన ఒక రేసర్. గతంలో చాలా సార్లు ఇలాంటి వాటిల్లో పాల్గొన్నారు. రోడ్లపై స్పోర్ట్స్ బైకులతో రైడింగ్ చేస్తూ కెమెరాల కంట పడ్డారు. అయితే తాజాగా హీరో అజిత్‌కు ఒక ప్రమాదం జరిగింది. కార్ రేసింగ్‌లో పాల్గొనడానికి ప్రాక్టిస్ చేస్తున్న సమయంలో కార్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అజిత్‌కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సీని తారలతో పాటు, ఆయన అభిమానులు చాలా కంగారు పడ్డారు. అయితే అజిత్‌కు ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ న్యూస్‌గా మారింది. వీడియోను చూసిన అందరూ కూడా తమ అభిమాన హీరో క్షేమంగా ఉన్నాడని సంతోష పడుతున్నారు.
హీరో అజిత్ ఎప్పటి నుంచో ఒక రేసర్. తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా పలు బైక్ రేసింగ్, కార్ రేసింగ్స్‌లలో పాల్గొన్నారు. గతంలో కొద్ది కాలం ఎలాంటి రేసింగ్స్‌కు పోలేదు. కానీ ఇటీవల రేసింగ్ ప్రాక్టీస్ తిరిగి మొదలు పెట్టారు. 11, 12 తేదీల్లో దుబాయ్‌లో 'Dubai 24 Hours Race' కార్ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దానిలో ఆయన కూడా పాల్గొంటున్నారు.

బృందంతో పాటు ఆయన కూడా గత కొంత కాలంగా అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కారుతో ట్రాక్‌పై రేసింగ్‌కు ముందు ప్రాక్టిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న సెక్యురిటీ వాల్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది కారు వద్దకు చేరుకున్నారు. ఆయన క్షేమంగా కారు నుంచి బయటకు వచ్చారు.
అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆయన రేసింగ్ టీం సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో తెలియజేసింది. కార్ రేసింగ్ సమయంలో సరైన భద్రత చర్యలు పాటించడం వల్లనే హీరో అజిత్‌కు ఎలాంటి గాయాలు కాలేదని టీమ్ తెలిపింది. దుబాయ్‌లో జరగనున్న కార్ రేసింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనిలో తన జట్టు ఎలాగైనా గెలవాలని పట్టు వదలకుండా శిక్షణ తీసుకుంటున్నారు.

ఈ రేసింగ్‌లో పాల్గొనడానికి ఆయన గత కొన్ని నెలలు అక్కడే ఉంటున్నారు. అజిత్ ఉపయోగించిన కారును ప్రత్యేకంగా రూపొందించారు. ఇది 3096 సిసి ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది వెనుక వీల్స్ డ్రైవ్ కారు. సాధారణంగా రేస్ కార్లకు ఇలాగే ఉంటుంది. ఈ కారు 4585 mm పొడవు, 1920 mm వెడల్పుతో ఉంటుంది. దీని వీల్‌బేస్ 2457 mmగా ఉంది. ఈ కారు ధర రూ.2.75 కోట్లు ఉంటుంది.
రేసింగ్ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో దెబ్బతిన్న కారును రిపేర్ చేసే అవకాశం ఉంది. లేదంటే రేసింగ్ కోసం మరో కారును ఉపయోగించవచ్చు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో రేసింగ్‌లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. మరికొద్ది రోజుల్లో ఇది ప్రారంభం కానుంది. అప్పుడు ఆయన రేసింగ్‌లో కనిపిస్తారా లేదా అనేది తెలిసిపోతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








