పట్టువదలని విక్రమార్కుడు హీరో అజిత్.. యాక్సిడెంట్ తర్వాత కూడా క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో అదరగొట్టాడు..
హీరో అజిత్ కుమార్‌కు సినిమాలతో పాటు కార్లు, బైక్స్ రేసింగ్ అన్న చాలా ఇష్టం. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ప్రారంభంలో కూడా చాలా సార్లు ఈ రేసింగ్స్‌లలో కూడా పాల్గొన్నారు. గతంలో కూడా స్పోర్ట్స్ బైకులతో రోడ్లపై రైడింగ్ చేస్తూ చాలా సార్లు కనిపించారు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన కొంచెం సమయం దొరికిన కూడా తన కార్లు లేదా బైక్స్‌తో రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోతుంటారు. ఇటీవల కొద్ది కాలం పాటు రేసింగ్ వంటి వాటికి బ్రేక్ ఇచ్చిన అజిత్ తాజాగా ఇలాంటి వాటిల్లో పాల్గొనడానికి మరోసారి రంగంలోకి దూకారు. ఇదిలా ఉంటే దుబాయ్‌లో 11, 12 తేదీల్లో 'Dubai 24 Hours Race' కార్ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. దీనిలో ఆయన కూడా పాల్గొంటున్నారు. దీని కోసం గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటూ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు.
అయితే ప్రధాన మ్యాచ్‌కు ముందు ఈ టోర్నీకి సంబంధించిన క్వాలిఫైయింగ్ మ్యాచ్ 10 వ తేదీన జరిగింది. ఈ రేసింగ్‌లో హీరో అజిత్ కుమార్ ఏడో స్థానంలో నిలిచారు. తన పోటీదారులను వేగంగా దాటుకుంటూ ఆయన ఈ స్థానం దక్కించుకున్నారు. 2.03.476 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రధాన మ్యాచ్‌కు ముందు మెరుగైన స్థానంలో నిలవడంపై ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు సిని తారలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే ఊపును కొనసాగిస్తూ, 11, 12వ తేదీల్లో జరగబోయే దుబాయ్ 24 గంటల రేసింగ్ పోటీలో విజేతగా నిలవాలని అజిత్ అభిమానులతో పాటు, సెలబ్రిటీలు అందరూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అజిత్‌కు ఒక ప్రమాదం జరిగింది. రేసింగ్‌లో పాల్గొనడానికి ప్రాక్టిస్ చేస్తున్నప్పుడు ఆయన డ్రైవింగ్ చేస్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా ఉన్న సెక్యురిటీ వాల్‌ను ఢీకొట్టింది.
అదృష్టవశాత్తూ అజిత్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడయాలో తెగ వైరల్ అయింది. ఆయన రేసింగ్ టీం ఈ ప్రమాదానికి సంబంధించిన విషయాన్ని పోస్ట్ చేసిన ఆయన అభిమానులు చాలా ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడటం చూసి అందరూ చూసి సంతోష పడ్డారు. అజిత్‌కు తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.

ఆయనకు చిన్నప్పటి నుంచే కార్లు, బైక్స్ వాటి రేసింగ్‌లపై ఇష్టం ఉంది. రేసింగ్స్ కోసం శిక్షణ కూడా తీసుకున్నారు. చాలా కాలం పాటు రేసింగ్‌కు విశ్రాంతి ఇచ్చిన ఆయన మళ్లీ రేసింగ్స్‌లో పాల్గొనడానికి కొత్తగా రేసింగ్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని తిరిగి శిక్షణ తీసుకున్నారు. తన రేస్ గ్రూప్‌ను గతేడాది సెప్టెంబర్‌లో వెల్లడించారు. 24 గంటల దుబాయ్ కార్ రేస్ తరువాత కూడా ఆయన పలు రేసింగ్స్‌లలో పాల్గొనబోతున్నారు.
హీరో అజిత్ ఆసియా ఫార్ములా BMW ఛాంపియన్‌షిప్, FIA ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్, బ్రిటిష్ ఫార్ములా 3 ఛాంపియన్‌షిప్‌తో పాటు మరిన్ని రేసింగ్ పోటీల్లో పాల్గోనబోతున్నారని సమాచారం. ఈ పోటీల్లో పాల్గొనడం వలన సినిమాలకు కొద్ది కాలం పాటు విరామం ఇవ్వనున్నారు. ఈ రేసింగ్స్ పూర్తి కావడానికి ఎంత లేదన్నా దాదాపు 9 నెలల కాలం పడుతుందని ఆయన అన్నారు. రేసింగ్స్ పూర్తయిన తర్వాత తిరిగి సినిమాల్లో పాల్గొంటారు.

గతంలో కొద్ది కాలం పాటు రేసింగ్స్‌కు దూరంగా ఉండి, వరుస సినిమాల్లో నటించగా, ఇప్పుడు వరుసగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి రేసింగ్స్‌పై దృష్టి సారించారు. ఆయన అభిమానులు కొద్ది కాలం పాటు కొత్త సినిమాల్లో చూడలేకపోవడం బాధపడే విషయమే. అయితే రెండు కొత్త సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








