పుట్టిన రోజు నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన భార్య - ఆనందంలో హీరో అజిత్

తమిళ సినీ నటుడు 'అజిత్ కుమార్' గురించి తెలిసిన అందరికీ.. అతనికి బైకులంటే చాలా ఇష్టమనే విషయం కూడా తెలిసే ఉంటుంది. ఇటీవల పుట్టినరోజుకు ఆయన (అజిత్) భార్య ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

సినీపరిశ్రమలో అత్యధిక అభిమానులను కలిగి ఉన్న హీరోల జాబితాలో ఒకరైన అజిత్ ఇటీవల 53 వ పుట్టినరోజు జరుపుకున్నారు. అభిమానులు ఈయనను ముద్దుగా 'తల' అని పిలుచుకుంటారు. అయితే పుట్టిన రోజు కానుకగా అజిత్ భార్య షాలిని 'డుకాటి మల్టీస్ట్రాడా వీ4 అడ్వెంచర్ టూరర్' (Ducati Multistrada V4 Adventure) మోటార్‌సైకిల్ గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Ajith Kumar s Wife Gifts Ducati Multistrada

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలకు లెక్కకు మించిన లైక్స్ మరియు కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో 53 అనే నెంబర్ కనిపిస్తుంది. ఇది అజిత్ 53వ పుట్టిన రోజు గుర్తుగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే బైక్ ఉండటం చూడవచ్చు. ఈ బైక్ ధరలు రూ. 21.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఎరుపు మరియు తెలుపు రంగులలో కనిపించే ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

నిజానికి హీరో అజిత్ కుమార్ ఒక హార్డ్‌కోర్ బైకర్. ఇప్పటికే ఈయన అనేక సందర్భాల్లో బీఎండబ్ల్యూ మోటోరాడ్ బైకుపై లాంగ్ డ్రైవ్ వెళ్లిన సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక అజిత్ కుమార్ గిఫ్ట్‌గా పొందిన ఈ బైక్ విషయానికి వస్తే.. ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్. ఇది అధిక పనితీరును అందిస్తుంది. తద్వారా రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

డుకాటీ కంపెనీ దేశీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లలో తన మల్టీస్ట్రాడా బైకును అందిస్తోంది. అవి వీ2, వీ2 ఎస్, వీ4 మరియు వీ4 ఎస్ వేరియంట్లు. అజిత్ కుమార్ గిఫ్ట్‌గా పొందిన ఈ బైక్ వీ4 వేరియంట్ అని తెలుస్తోంది. ఇది అడ్జస్టబుల్ 50 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ మరియు అడ్జస్టబుల్ మోనోషాక్‌ను పొందుతుంది. కార్నరింగ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి ఇందులో ఉంటాయి.

డుకాటీ మల్టీస్ట్రాడా ట్రావెల్, ఎండ్యూరో, స్పోర్ట్స్ మరియు అర్బన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ రైడింగ్ మోడ్స్ అనేక ఇంజిన్ అవుట్ ఫుట్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబీఎస్ సెట్టింగ్‌లను రైడింగ్ స్టైల్‌కు అనుగుణంగా మారుస్తుంది. ఇందులో 1158 సీసీ వీ4 ఇంజిన్ ఉంటుంది. ఇది 170 పీఎస్ 4పవర్ మరియు125 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

హీరో అజిత్ కుమార్ వద్ద ఉన్న అడ్వెంచర్ బైకులలో ఇదే మొదటిది కాదు. ఇప్పటికే ఈయన వద్ద బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్ కూడా కలిగి ఉన్నాయి. ఆయన ఇటీవలే వీనస్ మోటార్ సైకిల్ టూర్స్ పేరుతో బైక్ టూరింగ్ కంపెనీని ప్రారంభించారు. లాంగ్ డ్రైవ్ చేయడం మాత్రమే కాకుండా.. బైకుల మీద ఉన్న ఆసక్తి వల్లనే ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు. ఇప్పటికే ఈయన ముంబై, చెన్నై, ఢిల్లీ రేసుల్లో పాల్గొన్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 2, 2024, 12:30 [IST]
English summary
Hero ajith kumar wife gifts ducati multistrada for birthday
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+