బాలయ్య రేంజ్ అంటే ఇదే బాస్! తమన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన కారు రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

నటసింహం నందమూరి బాలకృష్ణ(Bala Krishna) ఏ చేసిన కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోల్లో ఒకరైన ఆయన ఇప్పటికి కూడా కొత్త తరం హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమా హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, నటన, డ్యాన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకునిగా ప్రజలకు సేవ చేస్తూనే, సినిమాలు కూడా చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇటీవల కేంద్రం కూడా పద్మభూషన్ అవార్డుతో సత్కరించింది. ఇదిలా ఉంటే ఈ ఆనంద సమయంలో బాలకృష్ణ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాతో పాటు సినీ పరిశ్రమలో ట్రెండింగ్ టాపిక్ అయింది.

నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌‌ల కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా హిట్‌గా నిలిచాయి. తాజాగా డాకు మహారాజ్ సినిమాకి కూడా అదిరిపోయే మ్యూజిక్‌ను ఇచ్చిన తమన్‌కు బాలకృష్ణ ఏకంగా అత్యంత ఖరీదైన పోర్షే (porsche) కార్ గిఫ్ట్‌గా అందించారు. కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్‌గా ఇవ్వడంపై అందరు ఒక్కసారిగి గురయ్యారు. ఈ మోడల్ పేరు పోర్షే కయెన్ (porsche cayenne).

Balakrishna Gifts Thaman

మార్కెట్లో దీని బేస్ వేరియంట్ విలువ దాదాపు రూ.1.6 కోట్ల నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ.2.54 కోట్ల వరకు ఉంది. బాలయ్య గిఫ్ట్‌గా ఇచ్చిన కారు ధర రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం పోర్షే కయెన్ బేస్, GTS అనే రెండు వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. టాప్ ఎండ్ వేరియంట్‌ను తమన్ పొందినట్లు తెలుస్తుంది. దీన్ని ఇండియాలో కంప్లీట్ బిల్ట్-అప్ యూనిట్ (CBU)గా అందిస్తున్నారు.

ఇది ఒక ఎస్‌యూవీ మోడల్. 3.0-లీటర్ V6 టర్బో ఇంజిన్‌తో రన్ అవుతుంది. 340 bhp పవర్, 450 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 8-స్పీడ్ టిప్‌ట్రానిక్ S ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌ను జత చేశారు. ఇది చాలా శక్తివంతమైనది. 6 సెకన్లలో సున్నా నుండి 100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 243 కిలోమీటర్లు. డిజైన్ స్పోర్ట్స్ తరహా లుక్‌తో ఉంటుంది.

Balakrishna Music Composer Thaman

కోట్లు విలువ చేసే కారు కాబట్టి లగ్జరీ ఫీచర్లకు ఎలాంటి ఢోకా ఉండదు. క్యాబిన్‌లో 10.9-అంగుళాల కో-ప్యాసింజర్ డిస్‌ప్లే, 12.3-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.6-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రయాణికుల సౌకర్యం కోసం 8 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, వెనుక విండోలకు ఎలక్ట్రిక్ సన్‌బ్లైండ్‌లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి.

ఇక బాలకృష్ణ కార్ల విషయానికి వస్తే, ఆయన వద్ద చాలా లగ్జరీ మోడళ్లు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత ఖరీదైన MPV లెక్సస్ LM 350h బాలయ్య వద్ద ఉంది. దీని ధర దాదాపు రూ. కోట్ల నుండి రూ.2.50 కోట్ల మధ్య ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విలాసవంతమైన కారు.

Balakrishna Gifts New Porsche Cayenne To Thaman

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, February 17, 2025, 15:00 [IST]
English summary
Hero balakrishna gifts new porsche cayenne to daaku maharaaj music composer thaman
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+