హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

సాధారణంగా ఒక మార్కెట్ బాగా అభివృద్ధి చెందాలంటే దానికి ప్రకటనలు చాలా అవసరం. ఈ ప్రకటనలు కూడా గొప్ప సెలబ్రెటీలతో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రకటనల వల్ల ఆ వస్తువులు బాగా అమ్ముడవుతాయి. ఈ ప్రకటనల గురించి దాదాపుగా అందరికి తెలుసు. ప్రకటన లేకుండా ఒక వస్తువు బాగా పాపులర్ అవ్వడం చాలా కష్టం.

హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

ఏది ఏమైనా ఆటో మొబైల్ మార్కెట్ బాగా అభివృద్ధి చెండాటానికి ఈ ప్రకటనలు అత్యంత ప్రధాన పాత్ర వహిస్తాయి. కేవలం ఈ ఆధునికి యుగంలో మాత్రమే కాదు ఎనభై మరియు తొంభైలలో కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి చాలా పెద్ద బైక్ కంపెనీలు టెలివిజన్ ప్రకటనలను ఉపయోగించాయి.

హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

ఒకప్పటి కాలంలో టెలివిజన్ యాడ్స్ చేసిన కంపెనీలలో ఒకటి హీరో హోండా. 1985 లో, హీరో హోండా తన మొదటి 4 స్ట్రోక్ బైక్ సిడి 100 యాడ్‌ను టెలివిజన్ ప్రేక్షకుల కోసం విడుదల చేసింది. ఈ ప్రకటనలో సల్మాన్ ఖాన్ నటించారు.

MOST READ:హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్[వీడియో]

హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

సెలబ్రెటీ కండల వీరుడు అయిన సల్మాన్ ఖాన్ ఈ యాడ్ లో కనిపించడం వల్ల ఈ బైక్ చాలా ఎక్కువగా అమ్ముడైంది. హీరో హోండా కంపెనీ యొక్క ఈ బైక్ ఆ సమయంలోనే అత్యుత్తమ ఇంధన సామర్థ్యం అందించిన బైక్. ఈ బైక్ ఒక ఫుల్ ట్యాంక్ తో దాదాపుగా 400 కిలోమీటర్ల మైలేజిని అందించేది.

హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

ఆ సమయంలో ఈ బైక్ కొనుగోలు చేసిన వాహనదారులు ఒక లీటరుకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని పేర్కొన్నారు. మెరుగైన మైలేజ్ మరియు ఆధునిక డిజైన్ కారణంగా, ఈ బైక్ ఆ రోజుల్లోనే ఎక్కువమంది వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది.

MOST READ:కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

హీరో హోండా ఈ బైక్ రూపకల్పనను చాలా సరళంగా ఉంచింది. ఈ బైక్ సరసమైన ధర వద్ద లభించడం మాత్రమే కాకుండా, దృడంగా ఉంది వాహనదారునికి చాలా నమ్మికయినదిగా కూడా నిలిచింది. ఈ బైక్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ఇందులో స్క్వేర్ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లైట్లు మరియు ఇండికేటర్స్ వంటివి నిక్షిప్తమై ఉన్నాయి.

ఈ బైక్‌లో స్పోక్ వీల్స్‌తో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ మోటారుసైకిల్ మొత్తం బరువు 116 కిలోలు. ఆ నాటి ఈ బైక్ ఈ రోజు స్టాండర్డ్ 100 సిసి బైక్‌ల మాదిరిగానే ఉంటుంది. కావున ఆ రోజుల్లో గొప్ప సంచలనం సృష్టించింది. ఈ బైక్ అప్పట్లోనే ఎక్కువ అమ్మకాలను సాధించింది.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!

ఈ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 97 సిసి ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజన్ ఉంటుంది. ఇది 7.5 బిహెచ్‌పి పవర్ మరియు 7.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌ యొక్క ట్రాన్స్‌మిషన్ కోసం 4-స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Hero Honda CD 100 Salman Khan Rare Television Commercial Advertisement Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X