లోక నాయకుడు (కమల్ హాసన్) తన ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు.. ఇదే: చూడండి

'కమల్ హాసన్' అంటేనే నటనకు నిలువెత్తు రూపం, ఎందుకంటే ఏ పాత్రలోకైనా పరకాయప్రవేశం చేసి ఆ పాత్రకే జీవం పోస్తాడు. దశావతారం సినిమాలో ఆయన నటన ఒక ఎత్తు అయితే, భారతీయుడు సినిమాలో మరో ఎత్తు అనే చెప్పాలి. భారతీయదు సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు భారతీయుడు-2 సినిమా కోసం మళ్ళీ దర్శకుడు శంకర్ తో చేతులు కలిపారు.

కమల్ హాసన్ ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు

1996 లో భారతీయుడు సినిమా పెద్ద హిట్ ఇచ్చిన తరువాత ఇప్పుడు మళ్ళీ శంకర్ తో జతకట్టారు. ప్రస్తుతం భారతీయుడు సినిమాతో కమల్ హాసన్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో తన ఫిట్ ఫిజిక్ కోసం ఫిజికల్ ట్రైనింగ్ అందించే ట్రైనర్ కి ఒక కారుని గిఫ్ట్ గా ఇచ్చేసాడు.

కమల్ హాసన్ ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు

కమల్ హాసన్ తన ఫిజికల్ ట్రైనర్ కి కారుని గిఫ్ట్ అందించే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో ఆ ట్రైనర్ కుటుంబం కూడా ఉంది. కమల్ హాసన్ తన ట్రైనర్ కి గిఫ్ట్ గా ఇచ్చిన కారు రెనాల్ట్ కంపెనీ యొక్క క్విడ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఏ వేరియంట్ అనేది ఖచ్చితంగా తెలియదు.

కమల్ హాసన్ ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు

రెనాల్ట్ కంపెనీ యొక్క క్విడ్ విషయానికి వస్తే, దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు సురక్షితమైన వాహనం. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఇప్పుడు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది.

రెనాల్ట్ క్విడ్ లో వీడియో ప్లేబ్యాక్ మరియు వాయిస్ రికగ్నిషన్‌ ఫీచర్లతోపాటు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన సైడ్ మిర్రర్లు, ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి.

కమల్ హాసన్ ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు

కొత్త రెనాల్ట్ క్విడ్ ఆకర్షణీయమైన డిజైన్‌ కలిగి ఉంది. ఇందులో ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, టాప్-ఎండ్ వేరియంట్‌లలో రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్‌ వంటివి ఉన్నాయి.

కమల్ హాసన్ ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు

కొత్త రెనో క్విడ్ 0.8 లీటర్ మరియు 1.0 లీటర్ ఇంజన్ ఆప్షన్లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు మెటల్ మస్టర్డ్, ఐస్ కూల్ వైట్ విత్ బ్లాక్ కలర్ రూఫ్ తో లభిస్తుంది. సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో మూన్‌లైట్ సిల్వర్ మరియు జాన్‌స్కర్ బ్లూ ఉన్నాయి.

కమల్ హాసన్ ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులోని 0.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 53 బిహెచ్‌పి పవర్ ను మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక 1.0 లీటర్ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పి పవర్ ను మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

కమల్ హాసన్ ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు

సేఫ్టీ ఫీచర్స్ పరంగా కూడా రెనాల్ట్ క్విడ్ ఉత్తమంగానే ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, సీట్ బెల్ట్ రిమైండర్, ఓవర్‌స్పీడ్ అలర్ట్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

కమల్ హాసన్ ఫిజికల్ ట్రైనర్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన కారు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హీరో కమల్ హాసన్ గతంలో డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌కు ఖరీదైన 'లెక్సస్‌' లగ్జరీ కారును, హీరో 'సూర్య'కి రోలెక్స్ వాచ్ వంటి వాటిని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే ఇప్పుడు తన ఫిజికల్ ట్రైనర్ కారు గిఫ్ట్ గా ఇచ్చి సంతోషింపచేసాడు. ఇవన్నీ కూడా కమల్ హాసన్ యొక్క ఉదారతను చూపుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త బైకులు మరియు కార్లను గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hero kamal hasan gifted renault car to his fitness trainer details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X