చిల్లర ఇవ్వడంలో ఆలస్యం చేశారని పెట్రోల్ స్టేషన్‌లో నిప్పంటించిన కస్టమర్

ప్రమాదం అని తెలిసినా కూడా చేయకూడని తప్పు చేశాడు. పెట్రోల్ పట్టించుకున్న తరువాత చిల్లర ఇవ్వడంలో ఆలస్యం చేశారనే కారణంతో తలెత్తిన వివాదం పెట్రోల్ స్టేషన్‌కు నిప్పంటించే వరకు దారి తీసింది.

By Anil Kumar

ప్రతి మనిషికీ విచక్షణ జ్ఞానం తప్పనిసరి, విచక్షణ కోల్పోతే క్షణ కాలంలో చేసే పొరబాట్లు కోలుకోలేని పరిమాణాలకు దారితీస్తాయి. అందుకొక నిదర్శనం ఇవాళ్టి కథనం, ప్రమాదం అని తెలిసినా కూడా చేయకూడని తప్పు చేశాడు. పెట్రోల్ పట్టించుకున్న తరువాత చిల్లర ఇవ్వడంలో ఆలస్యం చేశారనే కారణంతో తలెత్తిన వివాదం పెట్రోల్ స్టేషన్‌కు నిప్పంటించే వరకు దారి తీసింది.

పెట్రోల్ బంకును తగలబెట్టిన కస్టమర్

పెట్రోల్ బంకుల్లో ఆలస్యమైందనే కారణంతో కేరళ రాష్ట్రంలోని కొడకర ప్రాంతంలో ఓ వ్యక్తికి నిప్పించాడు. ఈ సంఘటన మొత్తం పెట్రోల్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది.

పెట్రోల్ బంకును తగలబెట్టిన కస్టమర్

ఈ ఘటనలో నిప్పుంటుకున్న వ్యక్తి దిలీప్‌‌గా గుర్తించారు. దిలీప్‌ను 25 శాతం కాలిన గాయాలతో సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చేర్చారు. వివరాల్లోకి వెళితే, పెట్రోల్ పట్టించుకున్న వ్యక్తి మరియు పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చిన వ్యక్తి మధ్య జరిగిన వాగ్వాదంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.

పెట్రోల్ బంకును తగలబెట్టిన కస్టమర్

వినీత్ అనే వ్యక్తి పెట్రోల్ కోసం వేచి ఉన్నాడు, అదే సమయంలో దిలీప్ పెట్రోల్ పట్టించుకుని వెనక్కి వచ్చిన మొత్తాన్ని లెక్కపెడుతున్నాడు. 2000 రుపాయల నోటు ఇవ్వడంతో పెట్రోల్ బంకు ఉద్యోగికి 10 రుపాయల నోట్ల రూపంలో వెనక్కి ఇవ్వడంతో లెక్కించడంలో ఆలస్యం అయ్యింది. దీంతో వినీత్ దిలీప్‌తో గొడవకు దిగాడు.

పెట్రోల్ బంకును తగలబెట్టిన కస్టమర్

కోపంతో ఊగిపోయిన వినీత్ అప్పటికే పెట్రోల్ నింపి ఉంచిన ప్లాస్టిక్ బాటిల్‌ను చేతిలోకి తీసుకొని దిలీప్ మీద వేయబోయాడు. అయిచే, దిలీప్ దాన్ని లాక్కొని పెట్రోల్ బంకు ఉద్యోగిని చేతికి ఇవ్వబోతుండగా మళ్లీ లాగేసుకున్న వినీత్ వెంటనే ఆ పెట్రోల్‌ను దిలీప్ మీద పోసి నిప్పంటించాడు.

పెట్రోల్ బంకును తగలబెట్టిన కస్టమర్

క్షణాల్లో దిలీప్ మరియు ఆయన బైకును మంటలు చుట్టుముట్టాయి. వెనక్కి వచ్చిన చిల్లర నోట్లను లెక్కిస్తున్న దిలీప్ స్నేహితుడు, వెంటనే అక్కడికి వచ్చి దిలీప్‌ను రక్షించి బుద్ధిలేని పని చేసిన వినీత్ మీద రాయితో దాడి చేశాడు.

పెట్రోల్ బంకును తగలబెట్టిన కస్టమర్

దిలీప్ బైకు హీరో కరిజ్మా మంటల్లో పూర్తిగా కాలిపోయింది. నిప్పంటుకున్న దిలీప్ 20 నుండి 25 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. పెట్రోల్ స్టేషన్ ఉద్యోగులు అగ్నిమాపక పరికరాలు ఉపయోగించి మంటలను అదుపు చేశారు.

అదృష్టవశాత్తు పెట్రోల్ నింపే మెషీన్లకు నిప్పంటుకోలేదు. విచక్షణ కోల్పోయే చేసే పనులు ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.

పెట్రోల్ బంకును తగలబెట్టిన కస్టమర్

More from DriveSpark

Article Published On: Friday, May 25, 2018, 18:52 [IST]
English summary
Read In Telugu: Hero Karizma rider set on fire in petrol bunk for delay in tendering change: Caught on CCTV
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+