King Nagarjuna మరో లగ్జరీ కారుని కొనుగోలు చేసిన కింగ్ నాగార్జున.. ధర ఎంతో తెలుసా..?

కింగ్ నాగార్జున రూటే సపరేట్. తను ఏది చేసినా వార్తల్లో ఇట్టే నిలిచిపోతుంది. వెరైటీ స్టైల్స్‌తో ప్రేక్షకుల్నీ ఎప్పటికప్పుడు పలకరిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన కార్ల గ్యారేజీలో సరికొత్త కారు వచ్చి చేరింది. ఇంతకు ఆయన కొనుగోలు చేసిన కారు ఏంటి దాని పూర్తి వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

కింగ్ నాగార్జున ఇటీవలె లగ్జరీ కియా ఈవీ6 కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న ఉత్తమ ఎలక్ట్రిక్ ప్రీమియం కార్లలో ఈ కారు ఒకటిగా ఉంది. దాదాపు రూ.70 లక్షలు ఖరీదు చేసే ఈ కొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారును డెలివరీ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Hero-Nagarjuna-New-Car

తన భార్య అమలతో కలిసి కొత్త కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును తన నివాసంలో డెలివరీ చేస్తున్న ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో కింగ్ నాగార్జున పంచుకున్నారు. వైట్ క్లాసీ షేడ్‌లో ఉన్న కియా ఎలక్ట్రిక్ కారును నాగార్జున బుక్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియాలో లాంఛ్ చేసిన ఎలక్ట్రిక్ క్రాసోవర్ కియా ఈవీ6కి మంచి ఆధరణ లభిస్తోంది.

ఈ కంపెనీ కొత్త ఈవీ6 ను భారతదేశంలో తన మొదటి మరియు ఏకైక ఎలక్ట్రిక్ కారుగా ప్రవేశపెట్టింది. దీనిని పూర్తి బిల్ట్ యూనిట్ (సీబీయూ) గా దిగుమతి చేసుకుంది. కియా మొదట భారతదేశంలో సుమారు 100 యూనిట్లను విక్రయించాలని భావించింది. తొలిరోజు 355కు పైగా బుకింగ్స్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే దూకుడుతో కియా ఈవీ6 బుకింగ్స్‌లో దూసుకుపోతుంది.

Kia-EV6-Car

ఈ సరికొత్త కియా ఈవీ6 ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది, ఇది మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్ శైలితో వస్తుంది. స్మూత్ మరియు ఏరోడైనమిక్ సిల్హౌట్‌తో రోడ్డుపై వారిని ఈ కారు ఆకర్షించనుంది. ఫ్రంట్‌లో టైగర్-నోస్ గ్రిల్ ను కలిగి ఉంది, ఇది స్లిమ్ LED హెడ్ లైట్లతో ఉంటుంది. వెనుక భాగంలో, కారు అంతటా ఎల్‌ఈడీ లైట్ బార్ విస్తరించి ఉంది. ఇది కారుకి అదనపు లుక్‌ని ఇస్తుంది.

ఇక ఈ కారు ఇంటీరియర్ డిజైన్ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. లోపలి భాగం విలాసవంతంగా డిజైన్ చేసింది. హ్యుందాయ్ అయోనిక్ 5 మాదిరిగానే, కియా ఈవి 6 బ్రాండ్ యొక్క ఇ-జీఎంపీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా వస్తుంది. దీని జీటి-లైన్ వేరియంట్లో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, వర్చువల్ రియాలిటీ మరియు సరౌండ్ వ్యూ కెమెరా ఉన్నాయి.

Kia-EV6-Car-Rearview

ఈ కొత్త కియా ఎలక్ట్రిక్ ఇవి6 సింగిల్ 77.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మరియు సింగిల్ మోటార్, RWD మరియు డ్యూయల్ మోటార్, AWD సెటప్‌లతో వస్తుంది. ఈ క్రాసోవర్ RWD వేరియంట్ 229 bhp వద్ద 350 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. AWD వేరియంట్ 325bhp వద్ద 605nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.

వేగవంతమైన 350 కిలోవాట్ల డీసీ ఛార్జర్‌తో దీని బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు. హోమ్ ఛార్జింగ్ కోసం, కొనుగోలుదారులు 22 కిలోవాట్ల వాల్ బాక్స్ ఛార్జర్‌ను ప్రామాణికంగా పొందుతారు. 60+ కనెక్టివిటీ కారు ఫీచర్లు, ఎయిర్ బ్యాగులు, ADAS వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది 528 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారతదేశంలో ఈ కారుని మహేంద్ర సింగ్ ధోని కలిగి ఉన్నారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ కూడా సరికొత్త కియా ఈవీ6 కారును డెలివరీ చేశారు. తన క్లోజ్ ఫ్రెండ్, హెడ్జ్ ఈక్విటీస్ మేనేజింగ్ డైరెక్టర్ అలెక్స్ కె బాబు తన కియా ఈవీ6ను బహుమతిగా ఇచ్చారు. ఆయన కారును రిసీవ్ చేసుకున్న వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. ఇలా రోజు రోజుకు ఈ కారుని సెలబ్రిటీలు సొంతం చేసుకుంటున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, June 30, 2023, 16:38 [IST]
English summary
Hero nagarjuna buys kia ev6 electric crossover costs 70 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+