హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ని ఇలా మార్చేశారు!

మన దేశంలో వెహికల్ కస్టమైజేషన్ అనేది ఒక సాధారణ విషయమే, ఎందుకంటే ఇక్కడి ప్రజలు తమ వాహనాలు ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు కాబట్టి. కస్టమర్ల బడ్జెట్ మరియు అవసరాలకు అనుగుణంగా మోటారుసైకిల్ లేదా కారును కస్టమైజ్ చేసే అనేక దుకాణాలు ఇప్పటికే దేశంలో అనేక చోట్ల కనిపిస్తుంటాయి. తాజాగా ఓ కస్టమర్ హీరో పాషన్ ఎక్స్‌ప్రో బేస్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి ఆఫ్-రోడింగ్ డర్ట్ బైక్‌ను తయారు చేయించుకున్నాడు.

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ని ఇలా మార్చేశారు!

వాంప్‌వీడియో వీడియో ప్రకారం, బిట్టూ బైక్ మోడిఫికేషన్ కంపెనీ ఓ కస్టమర్ కోరిక మేరకు హీరో పాషన్ ఎక్స్‌ప్రో బైక్‌ను ఆఫ్-రోడింగ్ డర్ట్ బైక్‌‌గా మార్చింది. ఈ కస్టమైజేషన్ ప్రాజెక్ట్ కోసం కస్టమర్ హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటారుసైకిల్‌ను షోరూమ్ నుండి నేరుగా బిట్టూ బైక్ మోడిఫికేషన్ తీసుకువచ్చాడు. అయితే, ఈ మోటార్‌సైకిల్ మోడిఫికేషన్ కోసం మాత్రం కంపెనీ ఏకంగా రూ.80,000 మొత్తాన్ని కస్టమర్ నుంచి వసూలు చేసింది.

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ని ఇలా మార్చేశారు!

ఈ చిత్రాలలో చూసినట్లుగా, మోటార్‌సైకిల్‌కు పూర్తి కస్టమ్ పెయింట్ జాబ్ చేశారు. ఇంకా విభిన్నమైన ఫ్యూయెల్ ట్యాంక్, పొట్టిగా ఉండే సీట్, కస్టమ్ ఫెండర్స్, డిజిటల్ స్పీడోమీటర్, ఎక్కువ బటన్స్ కలిగి ఆఫ్-రోడ్ టైర్లు, సన్నటి స్పోక్ వీల్స్ మరియు పొడవైన ఫ్రంట్ సస్పెన్షన్ వంటి మోడిఫికేషన్లను ఇందులో చూడొచ్చు. సైడ్స్‌లో ఇది 'హోండా క్లాసిక్ 9' బ్యాడ్జ్‌తో పాటుగా కస్టమ్ ఎగ్జాస్ట్‌ (సైలెన్సర్)ను జోడించారు. ఇంజన్‌ను పూర్తి బ్లాక్-అవుట్ ఫినిష్‌లో నల్లగా ఉండేలా మోడిఫై చేశారు.

MOST READ: మీకు తెలుసా.. వడోదరలో ఇప్పుడు స్మార్ట్ సిటీ బస్ సర్వీస్

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ని ఇలా మార్చేశారు!

హీరో పాషన్ ఎక్స్‌ప్రో బిఎస్4 మోటార్‌సైకిల్‌లో 109.15 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9.4 బిహెచ్‌పి శక్తిని మరియు 9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 4-స్పీడ్ మెష్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులో మల్టీ-ప్లేట్ వెట్ క్లచ్‌ను జోడించారు.

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ని ఇలా మార్చేశారు!

ఇక హీరో మోటోకార్ప్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలో కొత్త బిఎస్6 'హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్‌'ను మార్కెట్లో విడుదల చేసింది. ఫ్రంట్ డిస్క్ మరియు డబుల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్ లభ్యం కానుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ ఫ్రంట్ డిస్క్ వేరియంట్ ధర రూ.99,950 గా ఉండగా, టాప్-ఎండ్ అయిన డబుల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1.03 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢీల్లీ)గా ఉంది.

MOST READ: మహీంద్రా ఎక్స్‌యూవీ300లో టర్బో వేరియంట్ వస్తుందా? - టెస్టింగ్ చిత్రాలు, వివరాలు

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ని ఇలా మార్చేశారు!

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటారుసైకిల్‌లో 163సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 15 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో హీరో బ్రాండ్ యొక్క ప్రోగ్రామ్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది సాటిలేని పెర్ఫార్మెన్స్‌ను, మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ని ఇలా మార్చేశారు!

కంపెనీ పేర్కొన్న వివరాల ప్రకారం, కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్ కేవలం 4.7 సెకన్లలోనే 0-60 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది సెగ్మెంట్లో కెల్లా ఉత్తతమైన పవర్-టు-వెయిట్ రేషియోని ఆఫర్ చేస్తుంది. బేస్-స్పెక్ మోడల్ మొత్తం 138.5 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇందులో టాప్-స్పెక్ ట్రిమ్ బేస్ ట్రిమ్ కన్నా 1 కేజీ అధనపు బరువును కలిగి ఉంటుంది.

MOST READ: 22 లక్షల కార్లకు రీకాల్ ప్రకటించిన వోల్వో, ఎందుకంటే?

కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మరింత స్పోర్టీ డిజైన్‌తో మంచి స్టైల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన ఫీచర్లను గమనిస్తే, చుట్టూ ఎల్‌ఈడీ లైట్లు (హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్‌ఎల్‌లు, ఇండికేటర్స్ మరియు టెయిల్ లైట్స్), ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ముందు మరియు వెనుక భాగంలో పెటల్ డిస్క్ బ్రేక్‌లు, వీటిని సపోర్ట్ చేసే సింగిల్-ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిల్‌ని ఇలా మార్చేశారు!

హీరో ప్యాషన్ ఎక్స్‌ప్రో మోడిఫికేషన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ కస్టమైజేషన్ కంపెనీ కస్టమర్ అసరాలను తీర్చడంలో చక్కటి పనితీరును కనబరిచిందనే చెప్పాలి. ఈ విషయంలో హీరో పాషన్ ఎక్స్‌ప్రోను ఎవరూ సులభంగా గుర్తించలేని విధంగా మోడిఫై చేశారు. లక్షలు పోసి కొనుక్కోలేని ప్రీమియం మోటార్‌సైకిళ్లను ఇలా నామ మాత్రపు మొత్తంతో మోడిఫై చేసుకొని ఆనందించవచ్చు.

Most Read Articles

English summary
Vehicle modification is a common thing in our country as people want to stand out in the crowd. There are several modification shops that will modify a motorcycle or a car according to the customers budget and needs.. Read in Telugu.
Story first published: Saturday, July 4, 2020, 17:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X