రెనాల్ట్‌ కైగర్‌ కారు పైకి దూసుకెళ్లిన బైక్‌.. ఇలా చేసి ఉంటే ప్రమాదం జరిగేది కాదు..

దేశంలో నిత్యం అధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా.. నిర్లక్ష్య డ్రైవింగ్‌ లేదా అవగాహన లోపం కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో యాక్సిడెంట్‌ ఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పోలీసులు వాటిని విడుదల చేసి వాహదారులు, ప్రయాణికులు చూపిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

సీసీ కెమెరాలు ఉన్న చోట ప్రమాదాలు జరిగితే అవి ఎలా జరిగాయో మనకు తెలుస్తుంది. కానీ నిఘా కెమెరాలు లేని చోట ప్రమాదం ఎలా జరిగిందనేది మనం చెప్పలేం. కానీ కార్లలో ప్రత్యేక ఫీచర్‌ డ్యాష్‌ బోర్డ్‌ కెమెరా ద్వారా ప్రమాదం గురించి తెలుసుకుంటున్నాం. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన ఓ సంఘటన డ్యాష్‌ బోర్డ్ కెమెరాలో రికార్డైంది.

Car DashCam

లక్నోలో ఇటీవల రెనాల్ట్ కైగర్ కారు, హీరో స్ప్లెండర్ బైక్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్నాయి. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు రెనాల్ట్‌ కైగర్‌ కారు వెనుక వస్తున్నారు. బైక్‌పై ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రయాణం చేసినట్లు కెమెరా ద్వారా తెలుస్తోంది. ఈ రెండు వాహనాలు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నాయి.

వీడియోలో చూస్తే ఈ రెండు వాహనాల మధ్య గ్యాప్ కూడా బాగానే ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రెనాల్ట్ కైగర్ డ్రైవర్ కారు వేగాన్ని తగ్గించవలసి వచ్చింది. ఈ క్రమంలో బైకర్‌ కూడా తన బండి వేగాన్ని తగ్గించి ఉండాల్సింది. కానీ అతను ఆ పని చేయలేదు.

Car DashCam

కారు వేగం తగ్గినప్పుడు బైకర్‌ బ్రేక్ వేయలేదు అంతేకాకుండా వేగాన్ని కూడా తగ్గించలేదు. దీంతో బైక్‌ కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. బైక్‌పై వెళ్లేవారు తమ దృష్టి మరల్చడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలు కారులోని డ్యాష్‌ బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి.

డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్‌ లేదా బైకర్‌ తమ దృష్టి మరల్చకూడదు. కానీ చాలామంది అనుకోకుండా పక్కకు చూడటమో లేదా ఫోన్‌లో మాట్లాడటం, ఫోన్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేస్తుంటారు. చాలా రోడ్డు ప్రమాదాలకు ఇది ఓ కారణం. లక్నోలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

లక్నోలో జరిగిన ప్రమాదం తీరు డ్యాష్‌ బోర్డ్ కెమెరా ద్వారా వెలుగులోకి వచ్చింది. కార్లలో డ్యాష్‌బోర్డ్ కెమెరాలు ఎందుకు అవసరం అనే ప్రశ్నకు ఈ ప్రమాదం మనకు సమాధానమిస్తుంది. రోడ్డు ప్రమాదాల విషయంలో ఎవరిది తప్పు అని నిర్ణయించడానికి డ్యాష్‌బోర్డ్ కెమెరా ఫుటేజీని సాక్ష్యంగా నిలుస్తుంది.

అలాగే, ఈ వీడియో రికార్డింగ్‌లు బీమా క్లెయిమ్ విధానాలను కూడా సులభతరం చేస్తాయి. కాబట్టి వెంటనే మీ కారులో డ్యాష్‌బోర్డ్ కెమెరాను ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా బైక్‌పై ప్రయాణిస్తున్నవారు హెల్మెట్‌ ధరించలేదు. ఇది ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. డ్యాష్‌బోర్డ్ కెమెరాలు రహదారులపై ప్రమాదాలను సమర్థవంతంగా రికార్డ్ చేస్తుంది.

ఈ కెమెరాల ద్వారా ప్రమాదం తర్వాత భీమా క్లెయిమ్‌లను దాఖలు చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు సాక్ష్యంగా కీలకంగా నిలుస్తుంది. అంతేకాకుండా, అధునాతన డ్యాష్‌బోర్డ్ కెమెరాలు మోషన్-డిటెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. వాహనాన్ని ట్యాంపరింగ్ చేసే ఎలాంటి ప్రయత్నాలను అయినా క్యాప్చర్ చేయగలవు.

డ్యాష్‌బోర్డ్ కెమెరా కారులో ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా రహదారిపై వ్యక్తిగత భద్రతను నిర్ధారించడానికి మరియు ప్రమాదకర పరిస్థితులను తీవ్రతరం చేయకుండా నిరోధించడానికి అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. ఈ కెమెరాలు ప్రమాద దృశ్యాలు, అలాగే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు చేసి డ్రైవర్ల నుంచి డబ్బు దోపిడీ చేసే స్కామ్‌లను బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 14, 2023, 19:00 [IST]
English summary
Hero splender crashes into a renault kiger caught on dashcam video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+