ఇదేందయ్యా ఇది.. నేను ఎక్కడా చూడ్లే! బైకులో ఏటీఎం కార్డు పెడితే జ్యూస్ వస్తోంది.. వీడియో చూశారా?

సోషల్ మీడియాలో ఎన్నో సిత్రాలు కనువిందు చేస్తుంటాయి. ఈ విచిత్రాల మేకింగ్‌లో భారతీయులు తగ్గేదేలే అన్నట్లుగా పోటీ పడతారు. గతంలో బైకుల, కార్లకు సంబంధించి ఎన్నో వింత వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. కొందరు బైకులను విభిన్నంగా మార్చి వైరల్ అయ్యి ఆకట్టుకున్నారు. ఇప్పుడు.. ఇంకాస్త వింత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మిడిల్ క్లాస్ ఫేవరేట్ బైకు అయిన హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్‌ను ఓ వ్యక్తి.. ఊహకందని రీతిలో మోడిఫైడ్ చేశాడు. దీన్ని చూసిన వారంతా 'ఇదెక్కడి మ్యాజిక్కురా బాబు' అని ఆశ్చర్యపోతున్నారు. అతడి ట్యాలెంట్‌ను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి హీరో స్ప్లెండర్ బైకుతో ఏం ట్రిక్కు చేశాడు? దాన్ని ఏ విధంగా మార్చి ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. Sirswal.Sanjay అనే ఖాతా నుంచి ఈ వీడియో షేర్ అయింది. హీరో స్ప్లెండర్ బైక్‌ కాస్తా వెండింగ్ మెషీన్‌లా మారిపోయింది. ఓ వ్యక్తి.. ఈ మోటార్ సైకిల్ హెడ్‌లైట్ వద్ద ఉండే హోల్టర్‌లో ఏటీఎం కార్డు పెట్టి, దానిపై నంబర్లను ప్రెస్ చేశాడు. ఆ తర్వాత దాని ముందు గ్లాస్ పట్టుకోగానే బైక్‌లోంచిజ్యూస్ బయటకు వచ్చింది.

Hero Splendor Bike as ATM Card

క్షణాల్లో ఆ గ్లాస్ నిండిపోయింది. ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 3 లక్షల మందికి పైగా దీన్ని లైక్ కొట్టారు. వందలాది మంది తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, ఆ యువకుడిని అభినందిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. ఓ వ్యక్తి.. 'బిహార్ లో ఏదైనా సాధ్యమే' అని వ్యాఖ్యానిచంగా.. మరో వ్యక్తి.. 'ఈ దేశంలో అందరూ కళాకారులే' అని అన్నాడు.

ఇదే వ్యక్తి మరో వీడియోలో... బైకు విండ్‌ షీల్డ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, తనకు కావాల్సిన డబ్బులను మొబైల్‌లో నొక్కాడు. అంతే.. ఆ బైక్‌ హెడ్‌లైట్‌లో నుంచి డబ్బులు బయటకు వచ్చాయి. ఇంతే కాదు, మరో వీడియోలో.. ఇదే వ్యక్తి బైక్‌కి సైకిల్ బెల్ అమర్చి రోడ్ల మీద రైడ్ చేస్తూ వెళ్లడం కనిపించింది. స్ప్లెండర్ బైకు ఇన్ని విధాలుగా మార్చడంతో అందరూ అవాక్కవుతున్నారు.

Hero Splendor Bike as ATM Card

హీరో స్ప్లెండర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని విశేషాలను కూడా ఓ సారి చూసేద్దాం. ఈ బైకు దేశీయ మార్కెట్లో వివిధ వేరియెంట్లలో అందుబాటులో ఉంది. స్ప్లెండర్ ప్లస్ మోడల్ ధర రూ. 77,000 నుంచి రూ.79,000(ఎక్స్ షోరూమ్ ధర) గా ఉంది. ఇది 97.22 సీసీ సింగిల్- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఉంటుంది. ఇది 70 kmpl మైలేజీ అందిస్తుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ Xtec మోడల్ బైకు ధర రూ. 81,000 నుంచి రూ.84,000(ఎక్స్ షోరూమ్ ధర) మధ్య ఉంది. ఇది 97.22 సీసీ పెట్రోల్ ఇంజిన్ తో ఉంటుంది. 4- స్పీడ్ గేర్ బాక్స్ తో అనుసంధానించి ఉంటుంది. ఇది 70 kmpl మైలేజీ అందించగలదు. దీంట్లో ఫ్రంట్ & రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.

హీరో సూపర్ స్ప్లెండర్ మోడల్ బైకు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని‌ ఎక్స్ షోరూం ధర రూ.82,000 నుంచి రూ.86,000 మధ్య ఉంటుంది. ఇది 124.7 సీసీ పెట్రోల్ ఇంజిన్ తో 5 స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఇది 60 kmpl మైలేజీ అందించగలదు. ఇందులో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 10, 2025, 16:20 [IST]
English summary
Hero splendor bike modification into atm juice video gone viral
Read more on: #off beat #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+