Hero Splendor బైక్‌పై స్టంట్స్ అదుర్స్.. రైడర్ నైపుణ్యానికి సలాం..!
హీరో సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా ఉంది. హీరో స్ప్లెండర్ పాత మోడల్‌లో ఇందులో ఒకటి. ఈ బైక్‌ను తొలిసారిగా 1994లో విడుదల చేశారు. ఈ బైక్‌ను అనేకసార్లు అప్‌గ్రేడ్ చేశారు. ఈ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. మరియు అత్యుత్తమ మైలేజీ ఇచ్చే వాహనాల్లో స్ప్లెండర్ బైక్ ఒకటిగా ఉంది.
హీరో స్ప్లెండర్ బైక్‌ను ఎటువంటి స్టంట్స్ చేసేందుకు వీలుగా తయారు చేయలేదు. అయినా ఓ యువకుడు స్ప్లెండర్ బైక్‌పై స్టంట్స్ చేశాడు. ఏకంగా ఐదు బైక్‌ల పైనుంచి విజయవంతంగా దూకాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ముస్తు రైడర్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో ఓ యువకుడు తన స్ప్లెండర్ బైక్‌పైన స్టంట్స్ చేయడం గమనించవచ్చు. అయితే పబ్లిక్ రోడ్లపై కాకుండా ఓ ప్రత్యేకమైన ప్రాంతంలో ఈ విన్యాసాలు చేస్తున్నారు. అయితే ఓ రైడర్ ఎంతో చాకచక్యంగా ఐదు బైక్‌ల పైనుంచి దూకాడు. స్ప్లెండర్ బైక్ రైడర్‌కు ఎంతో నైపుణ్యం ఉన్నట్లు ఈ వీడియో ఆధారంగా తెలుస్తోంది.
వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా పార్కింగ్ చేసిన ఐదు బైక్‌ల మీదుగా స్ప్లెండర్ బైక్ రైడర్ సులభంగా దూకాడు. అయితే చివరలో బైక్ టెయిల్ ల్యాంప్‌కు కొంత నష్టం జరిగి ఉండవచ్చు. ఈ వీడియో యాక్షన్ సినిమాను గుర్తుచేస్తుంది. అయితే చూసేందుకు వీడియో చాలా ఆకట్టుకున్నా.. బైక్‌ను కొంచెం డ్యామేజీ చేసే అవకాశం ఉంది.

ఈ వీడియోను సరిగా గమనిస్తే స్ప్లెండర్ బైక్ రైడర్ హెల్మెట్ సహా ఇతర భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఒక వేళ స్టంట్స్ చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగిదే తలకు సహా ఇతర భాగాలకు తీవ్రంగా గాయలయ్యే అవకాశం ఉంది. బైక్ ల్యాండింగ్ చేసినప్పుడు ముందు టైర్ భూమిని బలంగా ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో వెన్నుముక దెబ్బతినే అవకాశం ఉంది.
స్ప్లెండర్ బైక్ రైడర్ ఎంతో నైపుణ్యం ప్రదర్శిస్తున్నా.. ఇలాంటి సమయంలో రక్షణ చర్యలు ఎంతో అవసరం. హెల్మెట్ సహా ప్యాడ్‌లు కలిగి ఉండడం తప్పనిసరి. దీంతోపాటు బైక్ కూడా భారీగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. బైక్ చక్రాలు, ఫ్రేమ్, ఇతర ప్యానళ్లు దెబ్బతినే అవకాశం ఉంది.

పబ్లిక్ రోడ్లపై కాకుండా ఇలాంటి ప్రత్యేకమైన ప్రాంతంలో ఇలాంటి విన్యాసాలు చేయడం కొంత వరకు అభినందనీయం. అయితే భద్రతా ఏర్పాట్లు లేకుండా మాత్రం ప్రయత్నం చేయడం ప్రమాదకరం. ఇలాంటి స్టంట్స్‌కు దూరంగా ఉండాలి. ఒకవేళ చేయాల్సి వస్తే హెల్మెట్ సహా ఇతర భద్రతా ఏర్పాట్లు చేసుకొని ప్రయత్నం చేయాలి
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








