హీరో విజయ్‌కు షాక్.. ఆ పని చేసినందుకు జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు
కోలీవుడ్ నటుడు దళపతి విజయ్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలను అందించి మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. హీరో విజయ్ త్వరలో రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాగా తాజాగా విజయ్ చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘిస్తే చట్టానికి ఎవరూ అతీతులు కారని అధికారులు మరోసారి నిరూపించారు. రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా, ఇతర చర్యలకు పాల్పడినా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన సందర్భాలు చూశాం. తాజాగా హీరో విజయ్‌కు తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. ఎందుకంటే..

మంగళవారం చెన్నైలోని పనైయూర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కి హీరో విజయ్ వెళ్లారు. విజయ్ తన టయోటా ఇన్నోవా క్రిస్టా కారులో వెళుతుండగా అకైర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో గ్రీన్ సిగ్నల్ పడే వరకు వేచి చూడకండా విజయ్ కారు డ్రైవర్ రెడ్ సిగ్నల్ జంప్ చేసి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు చెన్నై పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు నటుడు విజయ్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.500 జరిమానా విధించారు. దీని ద్వారా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని పోలీసులు నిరూపించారు.

గతేడాది ఇదే కారుపై నటుడు విజయ్‌కి పోలీసులు జరిమానా విధించారు. చెన్నైలో టింటెడ్ గ్లాస్‌తో టయోటా ఇన్నోవా కారులో ప్రయాణిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.500 జరిమానా విధించారు. ఇప్పుడు, రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు మరోసారి ఫైన్ వేశారు.
నటుడు విజయ్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ప్రమాదాల నివారణకు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను పాటించడం తప్పనిసరి. డ్రైవింగ్‌లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలి. ఫోన్‌లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వారితో పాటు తోటి ప్రయాణికులకు హాని కలిగించే అవకాశం ఉంది.

తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న దళపతి విజయ్.. నిన్న తన అభిమాన సంస్థ 'మక్కల్ ఇయక్కం' సభ్యులతో సమావేశమై 2026 ఎన్నికలపై చర్చించారు. ఇటీవల ఆ సంస్థ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించింది. అక్కడ విజయ్ రాజకీయ ప్రవేశం గురించి హింట్ ఇచ్చారు.
ఇక విజయ్ సినిమా విషయానికి వస్తే.. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లియో' సినిమా షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. సంజయ్ దత్, త్రిష లీడ్ రోల్స్ పోషించిన ఈ చిత్రంలో మిస్కిన్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా వంటి పెద్ద తారాగణం నటిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








